-మహేందర్ రెడ్డిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి
-విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంటి ?
-సీఎం రేవంత్ రెడ్డిలో పచ్చ రక్తం
-బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మహేందర్ రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని అప్పుడు రేవంత్ రెడ్డి దూషించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆంధ్రా వ్యక్తిని ఎలా నియమించారు ? వాళ్లు తెలంగాణ యువతకు ఏం న్యాయం చేస్తారు ? రాజకీయాలకు సంబంధమున్న వారిని కమిషన్ సభ్యులుగా నియమించబోమని సీఎం అన్నారు. గురువు చంద్రబాబు బాటలో నడుస్తున్న శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిలో పచ్చ రక్తం ప్రహిస్తోంది.
టీడీపీలో పనిచేసిన రజని కుమారిని కమిషన్ సభ్యురాలిగా ఎలా నియమించారు విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంటి ? ముగ్గురు ఆంధ్రా అధికారులను డైరెక్టర్లుగా నియమించారు ? తెలంగాణ ప్రయోజనాలు వాళ్లు ఎందుకు కాపాడుతారు ? ఓటుకు నోటు కేసును వాదించిన న్యాయవాదులకు సీఎం అందలం. సింగరేణి ఉద్యోగాల విషయంలో అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరులోగా 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 60 ఉద్యోగాలనే నోటిఫై చేసింది.