దళిత బంధు పధకంలో భాగంగా బౌధనగర్ డివిజన్ కు చెందిన ,నరసయ్య స్విఫ్ట్ వాహనాన్ని మరియు జానకి రామ్ సెంటరింగ్ సమగిరీ మెటీరియల్ అందచేశారు. అడ్డగుట్టకు చెందిన నక్క మధుకు బెరీజ వాహనాన్ని మరియు వాహనాన్ని మరియు ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సితఫలమంది క్యాంపుకార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు , తదితరులు నాయకులు పాల్గొన్నారు.
బోనాలు సందర్భంగా అదనంగా నీటి సరఫరా : లష్కర్ బోనాలు ఏర్పాట్ల పై అధికారులతో ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావు గౌడ్ సమీక్షను నిర్వహించారు. చిలకలగుడా బోనాలు వేడుకలతో పాటు సికింద్రాబాద్ పరిధిలో ఉత్సవాలు ఘనంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఆలయాన్ని బోనాలు వేడుకలకు ముస్తాబు చేయాలనీ దేవాదాయ శాఖ ఉప కమీషనర్ శ్రీ రామకృష్ణను ఆదేశించారు. అదే విధంగా బోనాలు పండుగను పురస్కరించుకొని మూడు రోజుల పాటు వరుసగా నీటి సరఫరా జరపాలని, సివరేజి ఇబ్బందుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేకంగా జనరేటర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంగా వ్యవహరించాలని అధికారులను పద్మారావు గౌడ్ ఆదేశించారు. దేవాదాయ శాఖతో పాటు వివిధ విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు