తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్టు-2021 ఆవిష్కరణ

98

– అబ్ స్ట్రాక్టును ఆవిష్కరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

అర్థ గణాంక , ప్రణాళిక, టీ.ఎస్.డీ.పీ.ఎస్. శాఖలు రూపొందించిన అత్యంత కీలకమైన “తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్టు – 2021” ప్రచురణను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు.

బుధవారం ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డీ. లో జరిగిన ఈ అబ్ స్ట్రాక్టు ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక,
vinod ప్రణాళిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీ.ఆర్. రెడ్డి, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్ , అర్థ గణాంక శాఖ అధికారులు డీ. శివ కుమార్, రామ బ్రహ్మం, రామకృష్ణ, వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.