రైతుల సంక్షేమం, ఆర్ధిక ప్రగతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు తెలిపారు.వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొనిరావడంతో రైతాంగం నూతనోత్సాహంతో వ్యవసాయ సాగు..బహు బాగు అంటూ ఆనందంతో వ్యవసాయం చేస్తూ ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారన్నారు.
బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలనా కార్యాలయంలో బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతా రామాంజనేయులు (లాలుపురం రాము)అధ్యక్షత న నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సొసైటీ ల చైర్ పర్సన్స్ తో,సి ఈ ఓ లతో సొసైటీల అభివృద్ధి, నిర్వహణపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ రైతులకు తక్కువ వడ్డీతో ఋణాలు ఇవ్వడంతో పాటు ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా 64 రకాల పధకాలను తీసుకోచిందన్నారు.
వాటిలో కోల్డ్ స్టోరేజ్ ను రాష్ట్రంలో మొదటగా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూరు లో ఏర్పాటు చేయడం జరిగిందని కృష్ణదేవరాయలు అన్నారు.విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకు ఋణాలు,ఎరువులు,పెట్టుబడి సాయం ఇలా అనేక విషయాల్లో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతుందన్నారు.సొసైటీల గోడౌన్స్ నిర్మాణం, పెట్రోల్ బంక్ నిర్వహణ,కోల్డ్ స్టోరేజ్,సూపర్ బజార్ లు,ఇలా 64 అంశాలతో రైతుల ఆర్ధిక ఎదుగుదల కు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
నరసరావుపేట శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రైతుల మేలు జరిగే పధకాలను అమలు చేస్తూ రైతు పక్షపాతి గా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిచారన్నారు.సహకార సంఘాల ద్వారా రైతులు రుణాలు పొంది ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారన్నారు.
జి డి సి సి బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతా రామాంజనేయులు (లాలుపురం రాము)మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ అన్నివిధాల తోడు,నీడలా డి సి సి బి ఉంటుందన్నారు.తక్కువ వడ్డీ తో రుణాలు పొంది,ఎక్కువ ప్రయోజనాలు పొందేలా వివిధ పధకాలను సహకార సంఘాల ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం అన్నారు.సమావేశంలో డి సి ఏం ఎస్ చైర్ పర్సన్ యార్లగడ్డ భాగ్యలక్ష్మి మదన్, అభ్యుదయ రైతు నూతలపాటి హనుమయ్య,డైరెక్టర్ లు కోటా హరిబాబు,వట్టి కొండ వెంకటేశ్వరమ్మ ఆంజనేయులు, అనిల్ కుమార్,గోవిందా నాయక్, డి సి ఓ రాజశేఖర్,సి ఏ ఓ కృష్ణవేణి, జి ఎం శేష భానురావు తదితరులు పాల్గొన్నారు.