Suryaa.co.in

Political News

అన్నతో ఉందాం…అండగా ఉందాం

భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త ఒరవడికి నాంది పలికిన వ్యక్తి జగనన్న.. జనం కోసం తనని తాను కోల్పోయిన మనసున్న మారాజు… తల్లి, చెల్లి, భార్యాపిల్లలూ, కుటుంబం అందరినీ వదిలి, అన్నిటినీ వదులుకుని మనకోసం పదేళ్ళకి పైగా అరణ్యవాసం చేసిన యువరాజు.
అధికారమే పరమావధిగా బతికితే ఇన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, బాధలు పడాల్సిన అవసరం లేదన్నది మనకందరికీ తెలిసిందే.. కానీ జనానికి ఏదో చేయాలి, మునుపటి కంటే మరింత మెరుగైన జీవితాలను, భవిష్యత్తు ను ఇవ్వాలి, రాజన్న ఆశయాలు, ఆయన కలలుగన్న జీవితాలు ప్రతి ఇంటికి అందించాలని ప్రతీక్షణం పరితపిస్తూ అహర్నిశలూ శ్రమించాడు…
ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు… కుట్రలు… కుతంత్రాలు అక్రమార్కుల కుటిల యత్నాలు అన్నీ తట్టుకుని నిలబడ్డాడు… ఒక్కొక్క మెట్టునూ ఎక్కుతూ, ఒక్కొక్క చిక్కుముడినీ విప్పుతూ మనకోసం అడుగులు ముందుకేస్తున్నాడు.. ఆ దారిలో పూలకంటే ముళ్లే ఎక్కువ ఉన్నాయి.. అయినా సరే వెనకడుగు వేయకుండా చిరునవ్వుతో నొప్పిని భరిస్తూ జనానికి ఇచ్చిన ప్రతి మాటను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. చేతికి ఎముక లేదన్నట్లు కరోనా లాంటి మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసినా తనకి మించిన భారాన్ని తలకెత్తుకున్నాడు.. అన్నీ తానై అందరి భారాన్ని మోస్తున్నాడు..
కానీ… జనానికి మంచి జరిగితే ఓర్వలేని రక్కసిమూక అంతా ఒకే గుంపుగా చేరి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, ఆయన ఆలోచనల్ని భగ్నం చేయాలని, ప్రజలకు జరుగుతున్న మంచికి అడ్డుకట్ట వేయాలని పన్నని కుట్ర లేదు… చేయని తప్పు లేదు… పిచ్చి పరాకాష్ట కు చేరి ఎంతకు దిగజరిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.. చిన్న చిన్న ఇబ్బందులు, లోటుపాట్లు ఉండొచ్చుగాక!
మునుపటికంటే ఇప్పుడే మనం అన్నకు చాలా అవసరం. మొదటిసారి అధికారంలోకి వచ్చాం… ఖజానా మొత్తం ఖాళీ చేసి మిగిల్చిన 100 కోట్లతో మాత్రమే పాలన మొదలుపెట్టాం.. అయినా సంక్షేమం ఆగలేదు.. అడుగులు సడలిపోలేదు.. ఈరోజు కాస్త అటూ ఇటూ కావచ్చు.. కానీ అన్న అన్నీ చూసుకుంటాడు.. ఖచ్చితంగా మనల్ని ముందు వరుసలో పెట్టుకుంటాడు.. ఆయన కష్టాన్ని కళ్లారా చూశాం.. అడుగులో అడుగులేశాం… ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుపటికంటే మరింత బలంగా నిలబడాల్సిన సమయం వచ్చింది. కాస్త ఓపికగా ఉందాం…
అన్నతో ఉందాం అన్నకు అండగా ఉందాం

– జాజుల కృష్ణ

LEAVE A RESPONSE