– తెలంగాణ బీజేపీ యస్ సి మోర్చా ఇంచార్జి మునిస్వామి
బీజేపీ యస్సిమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుబాష అధ్యక్షతన హైదరాబాద్ లోని బరకత్పురా లో గల బీజేపీ సిటీ కార్యాలయంలో రాష్ట్ర యస్సిమోర్చా పదాదికారులు, జిల్లా ఇంఛార్జీల, జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి , జాతీయ యస్సిమోర్చా కార్యదర్శి యస్ కుమార్ ,జాతీయ కార్యవర్గ సభ్యులు వేముల అశోక్ పాల్గొని సమావేశంలో మాట్లాడారు.
ఇదే సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొల్హార్ యంపీ, తెలంగాణ యస్సి మోర్చా ఇంచార్జి మునిస్వామి పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై దాదాపు గంటపాటు నాయకులతో కల్సి తెలంగాణలో దళితుల సమస్యలపై చర్చించారు.
అనంతరం మునిస్వామి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యంత మోసానికి గురైన సమాజం దళిత సమాజమేనని అన్నారు. మోసపు హామీలతో దళితులను కేవలం ఓటుబ్యాంక్ గా చూసిన కేసీఆర్ వైఖరి తెలంగాణ దళిత సమాజానికి తీరని అన్యాయం చేసిందని అన్నారు.
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని మాట తప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు.రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మూడెకరాల భూమి ఇస్తానని ఉన్న భూమి లాక్కున్నాడని, ఇప్పుడు దళిత బందు అని మరో కొత్త మోసానికి తెరలేపాడని అన్నారు.
ఇక చూస్తూ ఊరుకుంటే దళితను బరిజాతల నిలబెట్టేందుకు కూడా కేసీఆర్ ధైర్యం చేయకమానడని, కాబట్టి దళితులకు kcr చేస్తున్న మోసాలను దళిత సమాజంలో ఎండగట్టి దళితుల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలని యస్సిమోర్చా నాయకులకు పిలుపునిచ్చారు. అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉంది దళిత సమస్యలను పరిష్కారం కోసం కృషి చేద్దామన్నారు.
ఈ సమావేశంలో నాయకులు కుమ్మరి శెంకర్,కంతికిరణ్, అంబేడ్కర్,బొట్ల శ్రీను, అంజిబాబు, చంద్రశేఖర్, శివుడు, శివాజీ, సత్యం లతో పాటు రాష్ట్ర పదాదికారులు,జిల్లా ఇంఛార్జీలు,జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.