Suryaa.co.in

Telangana

సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళతాం

-కొత్త కమిటీ ప్రక్రియ లో నేను పాలు పంచుకోలేదు
-జరిగిన నష్టానికి మనస్తాపానికి గురయ్యా
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
-టీడీపీ నుండి వచ్చినవారికే నూతన పిసిసి కమిటీలో పదవులు
– ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
– ఓట్లు అధికంగా తెచ్చుకున్న మేము కోవర్టులమా?: జగ్గారెడ్డి
– భట్టి నివాసంలో కాంగ్రెస్ నాయకుల భేటీ
– రెండున్నర గంటల పైగా జరిగిన సమావేశం

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్ష నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు. సమావేశంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్లమెంటు సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్, సీనియర్ నాయకులు కోదండ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు ,మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఉన్నటువంటి అసలైన కాంగ్రెస్ వాదులను కాపాడుకోవడానికి సేవ్ కాంగ్రెస్ నినాదంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీని కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి సుమారు రెండు గంటలకు పైగా లోతుగా చర్చించుకున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ పరిణామాలు, పిసిసి నూతన కమిటీలో వలస వాదులకు ఇచ్చిన పదవులపై చర్చించారు.సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో సీనియర్ నేతలు మాట్లాడారు

భట్టి విక్రమార్క ఏమన్నారంటే..కాంగ్రెస్ పార్టీ లో దశాబ్దాలుగా సేవ చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు పిసిసి నూతన కమిటీ లో పేర్లు లేకపోవడం కొంత ఇబ్బంది ఏర్పడింది.రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అసలైన కాంగ్రెస్ నేతలు, సీనియర్ నాయకులు వలసొచ్చిన నాయకులతో తమకు అన్యాయం జరిగిందంటూ వచ్చి నన్ను కలుస్తున్నారు.అసలు కాంగ్రెస్ నాయకులకు , వలస వాదులకు మధ్య వ్యత్యాసం పై నా దృష్టికి వస్తుంది.

సీఎల్పీ గా మాకెందుకు న్యాయం చేయలేదని సీనియర్ నేతలు అడుగుతున్నారు.కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుపోయి నష్ట నివారణ చేస్తానని పంపించడం జరుగుతున్నది.కొత్త కమిటీ ప్రక్రియ లో నేను పాలు పంచుకోలేదు.. అందుకే న్యాయం చేయలేకపోయాను.అసలైన కాంగ్రెస్ వాదులకు సీనియర్లకు జరిగిన నష్టానికి నేను మనస్తాపానికి గురయ్యాను.కాంగ్రెస్ పార్టీని , భావజాలాన్ని, అసలైన కాంగ్రెస్ వాదులు, సీనియర్ నాయకులను కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్తో ముందుకు వెళ్లాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం .దేశంలో జరుగుతున్న విభజన రాజకీయాల దృష్ట్యా సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళతాం.

కాంగ్రెస్ బలమైన నేతలను సోషల్ మీడియా లో ద్రుష్పచారం చేస్తున్నారు..వారి పై చర్యలు తీసుకోవాలి..కాంగ్రెస్ కు మూల స్తంభాలుగా ఉన్న సీనియర్ నాయకుల క్యారెక్టర్లు బదనాం చేయడానికి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.గత సంవత్సరన్నర కాలం నుంచి కుట్ర పూరితంగా బలమైన నాయకులను బలహీనపరిచి పార్టీని హస్తగతం చేసుకోవడానికి లేదా, మరొకరికి అప్పజెప్పడమో.. ఏదో కుట్ర జరుగుతుంది సోషల్ మీడియా ద్వారా బలమైన నాయకులను బలహీనపరచడం వల్ల దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడి పార్టీ బలహీనంగా మారే ప్రమాదం ఉంది.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..సీఎల్పీ నేత భట్టి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న విషయాలపై సమావేశమయ్యాం.ఒరిజినల్ కాంగ్రెస్ నేతలుగా కలిసి చర్చించాం.కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి సేవ్ కాంగ్రెస్ నినాదం తో ముందుకు వెళతాం.కాంగ్రెస్ లో ఇంటర్నల్ డేమోక్రసి ఎక్కువ.నేను పీసీసి గా ఉన్నప్పుడు నా వాళ్లే ఉండాలి..నేను పార్టీని దక్కించుకోవాలని ఆలోచన చేయలేదు.

33 డిసిసి అధ్యక్షుల్లో మార్పులు చేస్తే కొంతమందిని అవమాన పరిచినట్టే.గెలిచే చోటే ఏకాభిప్రాయం జరగలేదట.. ఓడిపోయే చోటే ఏకాభిప్రాయం జరిగిందా.కావాలనే డిసిసి ప్రెసిడెంట్ల విషయంలో ఇలా చేశారు.33 జిల్లాలో 26 వేసి..7 ఎందుకు ఆపారు.?ఉపాధ్యక్షుల్లో ఇంత మంది బయట పార్టీ వారు ఉండడం అసలైన కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నది.180 మందిలో 54 మంది టీడీపీ నుండి వచ్చినవారికే నూతన పిసిసి కమిటీలో పదవులు ఇచ్చా రు.

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏమన్నారంటే.. పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు జరుగుతున్న అన్యాయం పై సమావేశం అయ్యాం.ఇన్ని ఏళ్లుగా ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వారికి అన్యాయం జరుగుతుంది.వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా పై ఉంది. కొత్త కమిటీల్లో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి..మొన్న పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇచ్చారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జరుగుతున్న పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాము. సోషల్ మీడియా ద్వారా కోవర్టు లు అని పెట్టిస్తున్నారు.కాంగ్రెస్ లోనే పుట్టాం.. కాంగ్రెస్ లోనే పెరిగాం.. కాంగ్రెస్ లోనే చస్తాం.నాలుగు పార్టీలు మారిన చరిత్ర మాది కాదు..సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏమన్నారంటే..
వలస బ్రిటిష్ పాలకులతో ఈ దేశం సర్వనాశనమైనట్టు, వలస వచ్చి పెత్తనం సాగించిన ఆంధ్ర పాలకులతో తెలంగాణ నష్టపోయినట్టు, అనేక పార్టీలు మారి వలస వచ్చిన నాయకులతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగుతుంది.కోవర్టులు అనే ముద్ర వేసేవాళ్లు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని విభేదించి ముఖ్యమంత్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటేందుకు జిల్లా నేతలతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్థిని నిల పెట్టి ఓట్లు అధికంగా తెచ్చుకున్న మేము కోవర్టులమా?
కాంగ్రెస్ ఉనికి కాపడినమా..? చెడగోట్టినామా..?మమ్మల్ని కోవర్టులు అని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పైన వలస నాయకుల ఖండన లేదు..ఏఐసిసి ఖండన లేదు.రాహుల్ గాంధీ జోడోయాత్ర కష్టపడి చేస్తే కోవర్తులు అని ముద్ర వేస్తున్నారు.డిసిసి ప్రెసిడెంట్లు ఉమ్మడి జిల్లాల దామోదర రాజనర్సింహ, మేము కలిసే మాట్లాడం.. నిర్మల పేరు పెట్టి పంపినం.. కానీ ఎందుకు అపారో తెలియదు.

LEAVE A RESPONSE