Suryaa.co.in

Andhra Pradesh

కన్నతల్లి లాంటి పుడమితల్లిని కాపాడుకుందాం

– మానవ మనుగడకు చెట్లే ఆధారం
– ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం
– ప్రకృతిని ప్రేమిద్దాం .
– కార్మిక శాఖ మంత్రి సుభాష్

రామచంద్రపురం: మానవుని మనుగడకు చెట్లే ఆధారమని, పర్యావరణ పరిరక్షణకు పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ ను నియంత్రించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామచంద్రపురం మండలంలోని ఆదివారపుపేట గురుకుల పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ప్రపంచ పర్యావరణ దినోత్సావాన్ని పురస్కరించుకుని వన సంరక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో కోటి మొక్కలు నాటనున్నాట్టు తెలిపారు. వనమహోత్సవంలో ప్రతిఒక్కరం భాగస్వాములమై మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం అని పిలుపు నిచ్చారు. మరల్ని భరిస్తున్న దరిత్రికి మొక్కలను నాటడమే మనమిచ్చే బహుమతి అని అన్నారు. చెట్లను కాపాడి వాటిని పరిరక్షిస్తామంటూ అధికారులతో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్డీవో అఖిల, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫారెస్ట్ అధికారి ఎం వి వి ప్రసాద్ లు మాట్లాడుతూ మొక్కల పెంపకం, వన సంరక్షణ ఒక్కరోజు కార్యక్రమం కాదని ప్రతినిత్యం చేయాల్సిన కార్యక్రమం అన్నారు. అడవులను పరిరక్షించుకుంటే అదే మన ప్రాణానికి జీవనాధారం ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ లు జి ఈశ్వరరావు, డి ఎస్ ఎన్ మూర్తి, ఎఫ్ ఎస్ ఓ నాగ సత్యనారాయణ, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు యోగేంద్ర, దుర్గాప్రసాద్, ఎంపీడీవో పద్మజ్యోతి, ద్రాక్షారామం సర్పంచి కొత్తపల్లి అరుణ, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE