-అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం
-టీడీపీ యువనేత లోకేష్
-నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి వలసల పరంపర
అమరావతి: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపిలోకి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ వీఏఆర్ కే ప్రసాద్ (అమ్మా ప్రసాద్) లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఉండవల్లి నివాసంలో ప్రసాద్ కు యువనేత లోకేష్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అమ్మా ప్రసాద్ వైసీపీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పనిచేశారు. వైసీపీ విధానాలు నచ్చక పార్టీకి, తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బిసి సెల్ నగర అధ్యక్షుడు, వడ్డెరసంఘ నేత పల్లపు శివరామకృష్ణ, పాదాల మధు, అబ్ధుల్ ఖాన్, అబ్దుల్ ఖాన్, కాటమాల అశోక్, మహమ్మద్ రఫీ బుధవారం టిడిపిలో చేరారు. వారందరికీ లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్నివర్గాల ప్రజలు కలసి రావాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలసివచ్చే వారందరికీ తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరిచే ఉంటాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా వస్తున్న వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు.