Suryaa.co.in

Andhra Pradesh

మహిళల కంట కరెంటు చార్జీల కన్నీరు

– ధరలు పెంచి మహిళల ఉసురు తీసుకున్న జగన్
– జగన్ రెడ్డి ఫ్యాన్ రెక్కలు విరచడానికి సిద్ధమైన జనం
– అప్రకటిత కరెంటు కోతలు… అల్లాడుతున్న రైతులు, వృద్ధులు, మహిళలు, ప్రజలు
– బిల్లులు పెంచనని చెప్పి పదిసార్లు పెంచి రకరకాల విద్యుత్ బిల్లుల పేరుతో జగన్ రెడ్డి దోపిడీ
– గత ప్రభుత్వంలో ఉన్న సర్ ఛార్జీలు రూ.560 కోట్లు అయితే రూ.1500 కోట్లను ప్రజల నుండి వసూలు చేసిన జనగ్
– తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

ఫ్యాన్ రెక్కలు విరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. జనం ఈరోజు స్విచ్ వేస్తే… జగన్ రెడ్డి ఫ్యాన్ రెక్కలు ఊడి రోడ్డుమీద పడటం ఖాయం అని.. జనాలను మోసం చేసిన దోచుకున్న జగన్ రెడ్డికి నేడు ప్రజలు బుద్ధి చెప్పడానకి సిద్ధంగా ఉన్నారని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత తెలిపారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

మోసాలు దోపిడీలతో అప్రకటిత విద్యుత్ కోతలతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. అధికారంలోకి వచ్చే ముందు కరెంట్ బిల్లులు పెంచనని, విద్యుత్ వినియోగదారులను ఆదుకుంటానని.. ఐదేళ్లలో పది సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలపై 75 వేల కోట్ల పెనుభారం మోపి దోచుకుని జగన్ రెడ్డి ప్రజలను వంచించాడు.

వర్షాకాలంలో కూడా కరెంట్ కట్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టాడు. ఇచ్చిన మాట నెరవేరిస్తే ఓటు వేయమన్న దమ్మున్న మొగోడు జగన్ అంటూ ఓట్లకు వెళ్తున్నారు. ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్. ఆయన, ఆయన మంత్రి వర్గం కోట్లు దండుకుని తాడేపల్లి ప్యాలెస్ లో కుమ్మరించుకున్నారు. నేడు కరెంట్ బిల్లులు చూసి ఇంత ఎండలో కూడా జనం వణుకుతున్నారు. జగన్ రెడ్డి అప్రకటిత కోతలతో వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

జగన్ రెడ్డికి దాచుకోవడం దోచుకోవడం పై ఉన్న శ్రద్ద.. పేదలను ఆదుకోవడంపై లేదు. రక రకాలు ఛార్జీలతో వచ్చే కరెంట్ బిల్లు ముట్టుకుంటే భయపడే పరిస్థితి వచ్చింది. సర్ ఛార్జీల పేరుతో కరెంట్ బిల్లులు పెంచి, కరెంటు బిల్లులు పేరుతో సంక్షేమ పథకాలు కట్ చేసి మెసం చేసిన మోసగాడు ఈ జగన్ రెడ్డి. గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం 2019 – 2024 పరిస్థితులను చూస్తే నాడు 50 యూనిట్లు కరెంట్ వాడితే రూ.52 బిల్లు వచ్చేది. అదే నేడు రూ. 150 బిల్లు వస్తుంది.

గత ప్రభుత్వంలో 150 యూనిట్లు విద్యుత్ వాడితే రూ.400 బిల్లు వచ్చేది. ఇప్పుడు 900 వస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో 250 యూనిట్లు వాడితే రూ.1,114 బిల్లు వచ్చేది. నేటి జగన్ రెడ్డి పాలనలో రూ. 2,187 బిల్లు వస్తుంది. 350 యూనిట్లు గత ప్రభుత్వంలో వాడితే రూ. 1950 బిల్లు వస్తే.. నేడు రూ. 3,600 కరెంట్ బిల్లు వస్తుంది. ఈ బిల్లులను చూసి ప్రజలు భయపడుతున్నారు. కరెంట్ లేక నిన్నటి వరకు చదువుకునే విద్యర్థులు తీవ్ర ఇబ్బందిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వంలో లోఓల్టేజ్ ను ప్రజలు ఎప్పుడూ చూడలేదు అటువంటిది మళ్లీ లోఓల్టేజ్ సమస్యను జగన్ రెడ్డి తెలుగు ప్రజలకు పరిచయం చేశాడు. జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, విద్యుత్ సంస్కరణలతో లోఓల్టేజ్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటాడు. ఏంటి బటన్ నొక్కేది. పది సార్లు ఛార్జీల పెంపు బటన్ నొక్కడమా.? పేద మద్య తరగతి కుటుంబాలపై పెనుభారం మోపడమా బటన్ నొక్కడం.

ఈ అప్రకటిత కోతలతో కరెంట్ ఎప్పుడు వచ్చేది తెలియ పొలాల దగ్గర రైతులు పాము కాట్లకు గురై చనిపోయిన పరిస్థితి ఉంది. ఇన్ని రకాల మెసాలకు తెరతీస్తూ ప్రజలను ఉద్దరిస్తున్నామంటే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. సర్ ఛార్జీలో పేరుతో గత ప్రభుత్వంలోని బిల్లులంటూ మూడింతలు ప్రజలపై భారాలు మోపి దోచుకున్నారు. చంద్రబాబు హయాంలో నాణ్యమైన విద్యుత్ యూనిట్ రూ.2కే ఇస్తే దాన్ని మూడు రెట్లు పెంచి దోచుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న సర్ ఛార్జీల బిల్లులు రూ. 560 కోట్లు ఉంటే దానికి రూ. 1500 కోట్లు ప్రజలను పీడించి వసూలు చేశారు.

దానితోపాటు స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఇఎమ్ఐ పద్దతిలో చెల్లించాలంటూ వినియోగదారులను తీవ్ర ఇబ్బంది పెట్టారు. ప్రతి పనిలో కూడా లాభం లేకుండా దాచుకోకుండా దోచుకోకుండా చేసే పరిస్థితి జగన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ ను సిరిడీ సాయి ఎలక్ట్రాన్స్ అయినటు వంటి తన బినామీ కంపెనీకి దోచిపెట్టి దండుకున్నారు. సంక్షేమం పేరుతో పేదల రక్తాని పీల్చుకుని రకరకాల పన్నుల పేరుతో పేదలను పీడించిన వ్యక్తి జగన్ రెడ్డి. ఈ రోజు ఏ ముఖం పెట్టుకు 90 శాతం హామీలు అమలు చేశానని జనంలోకి జగన్ రెడ్డి వస్తాడు.?

ఈ జగన్ రెడ్డి మోసపు మాటలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. వైసీపీ మేనిఫెస్టో బైబిల్, కురాన్, భగవత్ గీత అన్న జగన్ తన మాట తప్పి మళ్లీ జనాలకు సంక్షేమాన్ని ఇస్తానంటే జనం నమ్మడంలేదు. ఆంధ్రప్రదేశ్ ను అంధకార ఆంధ్ర ప్రదేశ్ మార్చి అప్రకటిత విద్యుత్ కోతలో మహిళలను, ప్రజలను తీవ్ర ఇబ్బంది పెట్టి.. బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నానని చెప్పి 130 సార్లు బటన్ నొక్కి 130 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు తప్పా పేద, మధ్య తరగతి ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు.

50 యూనిట్లు వాడితే మూడు నాలుగు వెలు బిల్లులు వేసి సంక్షేమం అని చెప్పి కోవడం సిగ్గు చేటు. ఈరోజు చెబుతున్నారు మీరు గిరగిర తిరుగుతుంది ఫ్యాన్ అని. ఈరోజు స్విచ్ వేస్తే… నీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోయి రోడ్డుమీద పడ్డటం ఖాయం… జగన్ ఫ్యాన్ రెక్కలు విరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేలో జరిగే సమరంలో వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

LEAVE A RESPONSE