వేడిగా ఉన్న చారుని ఏమంటాం?: వేడిచారు కదా!
దాన్ని కాస్త సరదాగా ఏడిచారు అందామా?
అలానే ఇంకొన్ని….సరదా సరదాగా
చారుని పిలవాలంటే ఎలా పిలవాలి… సింపుల్
దా ..చారు
చారు చల్లగా ఉంటే… కూల్ +చారు…కూల్చారు
రెండు రకాల చారు ఉంటే… దో+ చారు…దోచారు
చారు లో ఒక టాబ్లెట్ వేస్తే… పిల్ +చారు…పిల్చారు
చారు కి ఫోన్ చెయ్యాలంటే … కాల్ +చారు…కాల్చారు
చారులో కొంచం నూనె వేస్తే … తేల్ + చారు…తేల్చారు
చారుని కేకలేస్తే… అరి+చారు…అరిచారు
చారులో పొడి వేస్తే… పొడి+చారు…పొడిచారు
చారుతో యుద్ధం చేస్తే వార్+చారు వార్చారు
మడి కట్టుకుని చారు పెడితే మడి+చారు…మడిచారు
ఇలా చాలా రకాల గూఢా చారులున్నాయన్న మాట
చారుల్లో ఇన్ని రకాలున్నాయని మాకోసం పొందుపరి”చారు”.
– జీహెచ్చార్