– ప్రకాశం జిల్లాకు ఎవరు ఏం చేశారో.. ఒంగోలులో బహిరంగ చర్చకు సిద్ధమా?
– మైనింగ్ యూనివర్సిటీ, పేపర్ మిల్లు టీడీపీ హయాంలో ఎందుకు చేయలేకపోయారు?
– 14 ఏళ్ళు సీఎంగా ఉండి వెలిగొండ ప్రాజెక్టుపై బాబు చేసిన ఖర్చు ఎంత?
– సంతనూతలపాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు
టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ఏమన్నారంటే..టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు తన తాబేదార్లతో రచించిన స్క్రిప్ట్ ను ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల సంతకాలతో మీడియాకు ఇచ్చారు. అలాంటి లేఖ రాయాల్సివస్తే ముందుగా చంద్రబాబుకు రాయాలి.. ఎందుకంటే.. చంద్రబాబు 2014-19పరిపాలన కాలంలో ప్రకాశం జిల్లాకు ఏం చేశాడు ..
2019 జూన్ నుంచి 2021 అక్టోబర్ 6వరకు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లాకు ఏం చేశారనేదానిపై… చర్చకు సిద్ధమని గతంలోనే టీడీపీకి ఛాలెంజ్ విసిరాను. చంద్రబాబు చెప్పినట్టు లేఖలు రాయడం కాదు.. ఒంగోలు కలెక్టరేట్ ఆఫీసు ఎదురుగా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు ఏం చేశాడు.. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనే దానిపై చర్చకు మీరు సిద్ధమా.
ముఖ్యమంత్రికి లేఖ రాసిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను, చర్చకు వచ్చే ముందు,ఈ ప్రశ్నలకు సమాధానలతో రావాలి.
జనవరి 11, 2019లో చంద్రబాబు రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సభలో రూ. 4500కోట్ల ధనం వెచ్చించి పోర్టు అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట వాస్తవమా? కాదా? అదే సభలో రూ. 24వేల కోట్లతో పేపర్ మిల్లు తీసుకువచ్చాను, ఇండో ఏషియా కంపెనీ పెట్టుబడితో వచ్చింది అన్నారు, ఆ పేపర్ మిల్లు ప్రకాశం జిల్లాలో ఎక్కడ పెట్టారు? ఎక్కడ శంకుస్థాపన జరిగింది? చెప్పలగలరా.. ప్రకాశం జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీ స్థాపిస్తానని మాట ఇచ్చారు.. మీ హయాంలో ఎందుకు మైనింగ్ ప్రారంభిచలేదు?
మీ హయాంలో టంగుటూరు ప్రకాశం పంతులు యూనివర్సిటీగా నామకరణం చేసి, ఒక్క ఉద్యోగ నియామకం చేయకుండా పేరు ప్రకటించి వదిలేసిన మాట వాస్తవమా? కాదా? రైతులకు గిట్టుబాటు ధరల కోసం జీవో నెంబర్ 31 విడుదల చేసి సుబాబుల్, జామాయిల్ కు రూ. 4200 ధరను తప్పనిసరిగా కంపెనీలు చెల్లించాలని ఎందుకు అమలు చేయలేకపోయారు?
దొనకొండ సెజ్ లో విమానాల స్పేర్ పార్టుల అభివృద్ది పరిశ్రమ స్థాపిస్తామన్నారు, ఎక్కడ ఉంది? ప్రకాశం జిల్లాలో వెటర్నరీ యూనివర్సిటీ ఎక్కడ పెట్టారు? చంద్రబాబు 14ఏళ్ల పరిపాలన కాలంలో వెలికొండ ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు పెట్టారు? దాని వివరాలపై చర్చకు రావాలి ప్రకాశం జిల్లాలో మద్దిపాడు, నాగులప్పాడు, కొత్తపట్నం మండలం సస్యశ్యామలం కావడానికి, సన్న చిన్నకారు రైతులు బాగుపడటానికి గుళ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి స్వర్గీయ వైయస్ఆర్ గారు మంచి చేస్తే.. మరి, చంద్రబాబు ఏం చేశారు?
రామతీర్థం నిర్మాణంలో వైయస్ఆర్ గారి పాత్ర ఎంతో.. చంద్రబాబు పాత్ర ఎంతో చర్చకు సిద్దంగా ఉండాలి. చంద్రబాబు భజన చేస్తున్న ఆయన సమూహాం వీటిపై చర్చకు రావాలి.. మేము ఎప్పుడైనా చర్చకు సిద్దం.. సీఎంగారి పర్యటన తర్వాత ఏ క్షణమైనా మీరు, ఎక్కడ చర్చకు వచ్చినా సిద్ధం. ప్రకాశం జిల్లా పై ఈ ప్రభుత్వానికి ప్రేమ, చిత్తశుద్ధి ఉంది కాబట్టే, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ జిల్లా అభివృద్ధికి కేవలం రెండేళ్ళ కాలంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం..
రామయపట్నం పోర్టు భూసేకరణ కార్యక్రమాలు మా ప్రభుత్వ హయాంలోనే జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్న మాట వాస్తవమా, కాదా? కొత్తపట్నం- మోటుపల్లి షిప్పింగ్ హార్బర్ లుగా కేబినెట్ తీర్మానాలు చేసిన మాట వాస్తవమా, కాదా? ఎస్ఎస్ఎల్ కాలేజీలో ట్రిపుల్ ఐటీ ఓపెన్ చేశాం.. ట్రిపుల్ ఐటీ పునః ప్రారంభించిన మాట నిజమా? కఆకాదా? మార్కాపురం నియోజకవర్గంలో రూ.475కోట్లతో హాస్పటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాము.. మేమే ఓపెన్ చేస్తాం.
టంగుటూరు ప్రకాశం ఓపెన్ యూనివర్సిటీకి రూ.64కోట్లు శాంక్షన్ చేశాం, పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒంగోలు నుంచి పొదిలి వరకు ఫోర్ లైన్స్ రోడ్డు పనులకు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట తప్పితే, మేము మరమ్మతులు చేయించాం.. రేపో మాపో రూ.717కోట్లతో ఫోర్ లైన్ రోడ్డుకు శంకుస్థాపన చేయబోతున్నాం. మద్దతు ధర గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు? ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఓట్లు వేయించుకుని చావు దెబ్బతిని 23 సీట్లకు పరిమితమైన మీ చేతగాని నాయకత్వంలో ఉన్న మీరు .. 151 మంది ప్రజాప్రతినిధులను గెలిపించుకున్న ప్రజానాయకుడు జగన్ గారి మీద అవాకులు చెవాకులు పేలడానికి సిగ్గుండాలి.
చంద్రబాబు అధికారంలోకి వస్తే రూ. 5వేలకోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి వరదలు, తుఫానులు వస్తే ఆదుకుంటామని చెప్పి ఒక్క రూపాయి అయినా నష్టపరిహారం ఇచ్చాడా . ప్రకాశం జిల్లాలోనే శనగ రైతులకు 2019-21వరకు క్వింటాకు రూ. 4750 ధర చెల్లించిన ఘనత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వానిది.
సిగ్గుతో తలదించుకుని లెంపలేసుకోవాలి టీడీపీ..
వెనుకబడిన ప్రకాశం జిల్లాను మీ హయాంలో పిశాచులు పట్టినట్టు పీడించారు, నయవంచకుల్లా దొంగ మాటలు చెప్పారు. మీ హయాంలో పొగాకు రైతులు అల్లలాడుతుంటే తొంగిచూసిన దాఖలాలు లేవు సీఎం మార్క్ ఫెడ్ ను తెచ్చి, కేజీ పొగాకును రూ.100 నుంచి 110 లకు మద్దతు ధరకు ముక్కు, చెవుల పిండి మరీ కొనే పరిస్థితి తీసుకువచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు రచించిన స్క్రిప్ట్ మీద సంతకాలు పెట్టి, చేతకాని వారిగా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మిగిలారు.
మీ హయాంలో క్వింటా ధాన్యానికి ఎంత చెల్లించారు.. మేము ఎంత చెల్లించాము.. ఖరీఫ్ సీజన్ లో రూ. 1875 ప్రకటించి, మేమే ధాన్యం కొన్నాము. మిర్చి రైతులకు మేము క్వింటాకు రూ.20వేల పైచిలుకు చెల్లించాము.. మీరు రూ.12 వేలు, 8వేలు, 9వేలు అని దోబుచులాడారు.. మీ దరిద్రపు యుగంలో రైతులు పంటలను కోల్డ్ స్టోరేజ్ లో దాచిపెట్టుకున్నారు. మీ హయాంలో కోల్డ్ స్టోరేజ్ లు కిటకిటలాడాయి.. చిట్టచి ధాన్యం గింజ వరకు కొన్నాము. రైతుల పక్షపాతిగా, నిరుద్యోగుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం నిలిచింది.. నిలువ నీడలేని వాళ్లకు ఇళ్లపట్లాలు ఇచ్చి నీడనిచ్చాం..
– చంద్రబాబు హయాంలో పేదవారి పెన్షన్ లకు కూడా డ్రామాలాడారు.. ఎన్నికల ముందు పసుపు కుంకుమ అని డ్రామా వేషాలు వేశారు.. చంద్రబాబు ఎంతమందికి ఉద్యోగులు ఇచ్చారు? 2వేలు నిరుద్యోగ భృతి ఇచ్చారా?
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. దాదాపు 3 లక్షల మందికి గౌరవ వేతనంతో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం.. 1.25 లక్షల మందికి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. కరోనా విపత్కర సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఆపకుండా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా, నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేశాం. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఆర్బీకేలు, సచివాలయాలు, పీహెచ్ సీలు అభివృద్ధికి చిహ్నాలు కాదా.. మేము చేయాల్సిన పనులు త్రికరణ శుద్ధిగా చేస్తాం.
పాడిపరిశ్రమను వ్యవసాయ అనుబంధ రంగంగా గుర్తించారు, పాడిపరిశ్రమ ఉంటే లీటర్ ధరకు అమూల్ ధర ద్వారా అత్యధికంగా చెల్లిస్తుననారు. గతంలో మీరు హెరిటేజ్ ద్వారా పాడి రైతుల రక్తాన్ని పీల్చారు.
ఒంగోలు డైరీని నాశనం చేసింది మీరుకాదా? కోపరేటివ్ సెక్టార్ నాశనం చేసింది మీరు కాదా? రైతన్న కు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? చీమకుర్తి పరిసరాలకు మంచినీటి కోసం రామతీర్థం రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా రూ.64కోట్లతో పథకానికి శంకుస్థాపన చేశాం. చీమకుర్తి పట్టణానికి మంచినీరు అందించే ప్రయత్నం జరుగుతుంది. రైతు భరోసా ఇచ్చాం,అమ్మ ఒడి ఇచ్చాం పేదపిల్లలు చదువుకునే బడులను నాడు-నేడుతో ఆధునీకరించాం. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయానికి పెద్దపీట వేశాం. మా ప్రభుత్వ హయాంలో లక్షల మంది అవ్వతాతలకు పెన్షన్లు నెలనెలా ఠంఛనుగా ఇంటికే తెచ్చి ఇస్తూ, వారికి అండగా నిలబడ్డాం.
ప్రకాశం జిల్లా ప్రజలు బాబును ఎప్పుడూ నమ్మరుః ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి
– మీడియా సమావేశంలో మార్కాపురం ఎమ్మల్యే కుందూరు నాగార్జున రెడ్డి కూడా పాల్గొని మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టును 5 ఏళ్ళు అధికారంలో ఉండి టీడీపీ పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. అందుకే ప్రకాశం జిల్లా ప్రజలు చంద్రబాబును ఎప్పుడూ నమ్మరుగాక నమ్మరు.