1.పొద్దున్నే లేవకపోతే, లేవండి రిటైరయ్యానని ఎప్పుడూ పడుకోవడమేనా?
2. త్వరగా లేస్తే, మీకు వయసైపోయి నిద్ర తగ్గిందని తెల్లారక ముందే లేచి అందరి నిద్ర పాడుచేస్తే ఎలా?
3.ఇంట్లో కూర్చుండిపోతే,అస్తమానం ఆ మొబైల్ పట్టుక్కూర్చోక పోతే వంటపనిలో సాయపడొచ్చు కదా?
4. ఒక వేళ ఇంటి బయట ఎక్కువ ఉంటే, కాలికి బలపం కట్టుకొని ఊరంతా తిరగకపోతే ‘రామా కృష్ణా’ అంటూ ఓ మూలుండవచ్చు కదా?
5. పూజ గదిలో ఎక్కువ సేపుంటే,ఎప్పుడూ లొడలొడా మంత్రాలు చెప్తూ గంట వాయించి హారతులిస్తే దేవుడు దిగొస్తాడేంటి?
6. పార్ట్ టైమ్ జాబ్ చేసి కాస్త డబ్బులు సంపాదిస్తే,రిటైరయ్యాక మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నానని పేద్ద ఫోజు, ఆ ఏడుపు అప్పుడు ఉండుంటే ఈ పాటికి నాలుగు అంతస్థుల మేడ ఉండేది.
7. భార్యను ‘చార్ ధామ్’యాత్రకు తీసుకెళ్తే,అబ్బో పేద్ద యాత్రలు! ఎదురింటి ఎంకట్రావ్ భార్యతో ‘ఊటీ కాశ్మీర్ సిమ్లా కులూ మనాలి’తీసుకెళ్లాడు.
8. ఒకేళ ‘ఊటీ కాశ్మీర్ సిమ్లా కులూ మనాలి’ తీసుకెళ్తే,అంతలేసి డబ్బులు తగలేసే బదులు నాకు రవ్వల గాజులో లేక నెక్లేసో చేయించొచ్చు కదా?
9. అపార్ట్మెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ ప్రెసిడెంటై బిజీగా ఉంటే,మొదట ఇంటి పనులు చేసి ఆ తర్వాత ఊరును ఉద్ధరించండి.
10. ఒక వేళ ఏది పట్టించుకోకుండా ఊరుకుంటే,పొరుగింటి పుల్లారావును చూసి నేర్చుకోండి, అపార్ట్మెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ ప్రెసిడెంటై సెక్యూరిటీ గార్డ్ చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాడు. మీరూ ఉన్నారెందుకు?
ఓల్ మొత్తంగా నేను చెప్పేదేమిటంటే; రిటైరయ్యాక ‘నేనది చేస్తా ఇది చేస్తా ‘ అని ఓవర్ గా ఇదైపోయి ఫోజులు కొట్టకుండా భార్య చెపినట్టు వింటే మంచిది. ఏది ఏమైనా భార్యచేత చీవాట్లు తప్పదు!
DISCLAIMER: ఇది మాత్రం నా అనుభవము కాదు. పక్కింటి పురుషోత్తం అగచాట్లు చూసి రాసింది.
– వి.వి.సుబ్రమణ్యం