లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
ఒకరి జీవితంలో
మనం జోక్యం చేసుకోకుండగా బతికితే….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
ఒకరి గురించి పూర్తిగా నిజం తెలుసుకోకుండగా
తప్పుగా అర్థం చేసుకొని లేనిపోనివి తనువుకు అంటించుకోకుంటే…!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
ఒకరి ఎదుగుదల చూసి కుల్లుకుంటూ
శరీరాన్ని విషతుల్యం చేసుకోకుంటే…!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే….
అనవసరమైన విషయాలకి స్పందిస్తూ
మన సంతోషాల్ని వదిలి మాట్లాడుకుంటూ ఉంటే….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే…
నిన్ను నీవు తెలుసుకొని చేసే పనిని
దైవత్వంగా భావిస్తూ నీదైనా శైలిలో బత్కు నీవు బత్కితే….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే…
నీకు ఎదుటి వారిలో మంచి చూసే
గుణం క్యారెక్టర్ ఉంటే…!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే…
ఎప్పుడు ఒకరి మీద ఏడ్వడం
వదిలేసి హాయిగా జీవిస్తుంటే…….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే…
గతమనే గాయల్ని పునాది రాళ్లుగా,
వర్తమానాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా బతికితే… !!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే…
నీవు చేసే మంచి పని వల్ల
ఎదుటి వ్యక్తి ముఖంలో చిరునవ్వుకు నువ్వు కారణమైతే….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే…
నా వల్ల ఒకరు బాగుండాలని నేను బాగుండాలని కోరుకుంటూ
దాన్నే సూత్రప్రాయంగా నిత్యం ఆచరణలో కనబరిస్తే….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే…
నీవు చేయలేని మంచిపని ఎవరు చేసినా
అభినందించే గుణం మనస్తత్వం నీలో ఉంటే…!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
అభిమానించే మనుషుల్ని Save చేసుకుంటూ,
విమర్శించే వారిని List లో నుండి delete చేస్తూ పోతుంటే..!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
ఏ వ్యక్తికి పూర్తిగా బానిసగా ఉండకుండా
ఎవరికి కీడు తలపెట్టకుండా స్వేఛ్చగా బతికితే….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
ఎదుటి వ్యక్తి చేసేపనికి అడ్డుపడకుండా
చేయూతనిచ్చే దిశలో ఉంటే……!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
నీలోని టాలెంట్ ప్రజ్ఞాపాటవాలు గుర్తించి
నీకంటూ ఓ స్థాయి కల్పించిన మనిషిని మరువకుండగా ఉంటే…!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
లేనిదానికి అర్రులు చాస్తూ ,
ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా సంతృప్తి పడితే…..!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
ఒకరిని కపట స్నేహం పేరిట బంధుత్వంగా మార్చుకొని
అవసరం తీరాక వదులుకోకుండగుంటే…..!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
ఆపద సమయంలో ఆదుకున్న మనిషి విషయంలో కృతఘ్నత చూపకుండా, కృతజ్ఞత భావంతో జీవితాంతం ఉంటే…..!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే….
ఒక వ్యక్తి పడే కష్టాన్ని వాళ్లలోని
ప్రతిభని గుర్తించి గౌరవించడం మొదలు పెడితే….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే….
ఒకరి మనోభావాలు దెబ్బతీయకుండా
గౌరవాభిమానాలతో మాట్లాడితే…!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
ఒకరిని చులకనభావంతో చూడకుండా
సాటి మనిషిగా గౌరవిస్తూ ఉంటే…..!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే….
నిత్యం మనల్ని పలకరించే మనిషి
గుర్తు పెట్టుకొని మరీ పలకరించే మనిషి మనకుంటే….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
మనిషిగా పుట్టి నల్గురి ప్రేమాభిమానాలని
ఆప్యాయత అనురాగాలని సంపాదించుకుని ఉంటే….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
నీతి ,నిజాయితీగా ,ధర్మంగా
ఆ సన్మార్గంలో బతకుతూ మొదలు పెడితే ….!!
లైఫ్ ఈజ్ బ్యూటిఫులే
కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ
నీ మీద ఆధారపడిన వారి కళ్లలో ససంతోషం చూస్తే…!!
బి పాజిటివ్ ,డోన్ట్ నెగిటివ్ థింక్ అబౌట్ సెంటెన్స్
– జి.కె.నారాయణ
కలం పేరు :లక్ష్మి శ్రీ
మల్లె దొడ్డి గ్రామం
జోగులాంబ గద్వాల్ జిల్లా
సే:వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్