Suryaa.co.in

Features

సైఫ్ పై నిషేధం ఎత్తివేత లవ్ జిహాద్ కు ప్రోత్సాహమే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ ఘటన పై హైకోర్టు తీర్పు లవ్ జహాద్ కు ప్రోత్సాహకరంగానే ఉంది. ప్రీతి అనే మేడికోను వేధించి.. ఆమె ఆత్మహత్యకు కారణమైనటువంటి సైఫ్ పై సస్పెన్షన్ తొలగిస్తూ హైకోర్టు తీర్పునివ్వడం దారుణం. ఇలాంటి తీర్పులతో రాష్ట్రంలో లవ్ జిహాద్ సంఘటనలు మరిన్ని జరిగే ప్రమాదం లేకపోలేదని విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని చెప్పడానికి ఇది ఓ చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలో కూడా జైలులో శిక్ష అనుభవిస్తున్న సైఫ్ ను సరిగ్గా రంజాన్ కు రెండు రోజుల ముందు విడుదల చేయడం ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగమేనని ప్రగాఢంగా విశ్వసిస్తోంది.
ఈ విషయంపై హిందూ సమాజంలోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లవ్ జిహాద్ రాక్షసక్రీడతో హిందూ సమాజానికి పెను ప్రమాదం పొంచి ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

హిందూ అమ్మాయిలపై లవ్ జోహాద్ వేట..

తెలంగాణలో.. ప్రత్యేకంగా భాగ్యనగర్ లో హిందూ అమ్మాయిలపై వేట కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కుప్పలు తెప్పలుగా లవ్ జిహాద్ రిజిస్ట్రేషన్ లు కొనసాగుతున్నాయి. ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలపై వలవిసిరి లవ్ జిహాద్ ఊబిలోకి దించడం సహజమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 40 వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు. ఇందులో అందరూ హిందూ అమ్మాయిలే. ఇది అధికారికమైనటువంటి ప్రభుత్వ గణాంకాల వివరాలు.

అనధికారికంగా దాదాపు 80 వేల మంది దాకా హిందూ అమ్మాయిలు తెలుగు రాష్ట్రాలలో మిస్సింగ్ అయ్యారు. రాబోవు రోజుల్లో ఇది భయంకరమైన పరిణామంగా మారే ప్రమాదం లేకపోలేదు.

ఇదే విషయమై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ అనేక సందర్భాలలో హిందూ అమ్మాయిల రక్షణ విషయమై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. లవ్ జిహాద్ విషయంలో అనేక కళాశాలలు.. విద్యాలయాలలో కూడా సెమినార్లు నిర్వహిస్తున్నాము. అయినా అమ్మాయిలు మోసపోవడం దౌర్భాగ్యం. ఇందుకు అమ్మాయిల కుటుంబ సభ్యులు కూడా బాధ్యత వహించాల్సిందే. మోసపోవడం హిందూ అమ్మాయిలా వంతు.. చేయడం ముస్లిం అబ్బాయిల వంతు.
ఈ విషయంలో పోలీసులు చొరవ తీసుకొని లవ్ జిహాద్ పై అవగాహన కల్పించాలి.

షీ టీఎం ఏర్పాటు చేసుకుని అద్భుతమైన విజయాలు సాధిస్తున్నామని చెబుతున్న పోలీసులు… ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 40,000 మంది మిస్సింగ్ అయిన హిందూ అమ్మాయిల జాడను ఎందుకు కనుగొనడం లేదో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం అతి దగ్గరలోనే ఉంది.

రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో పెళ్లి కోసం అప్లై చేసుకుంటున్న జంటల వివరాలను ఆ తల్లిదండ్రుల దృష్టికి ఎందుకు తీసుకు రావడం లేదో సమాధానం చెప్పాలి. వచ్చే రోజుల్లో భారీ ఆందోళన చేస్తే తప్ప.. సమస్యకు పరిష్కారం లభించేలా లేదు.

– పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్,
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)
9912975753
9182674010

LEAVE A RESPONSE