( అన్వేష్)
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి లోక్‌సభ స్పీకర్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, అనకాపల్లి ఎంపి సీఎం రమేష్ కేంద్ర క్యాబినెట్‌లో బెర్త్ కోసం పోటీ పడ్డారు. అయితే అనూహ్యంగా నరసాపురం ఎంపి శ్రీనివాసవర్మ క్యాబినెట్‌లో చోటు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో కీలమైన లోక్‌సభ స్పీకర్ పదవి పురందేశ్వరికి ఇచ్చే అవకాశాలున్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.