Suryaa.co.in

Political News

జగన్.. వీరిని అడుగు.. ఎందుకు ఓడావో చెబుతారు!

(కె.సురేష్)

జగన్ గాని,, వైసీపీ నాయకులు గాని,ఎందుకు ఓడామో అంటున్నారు.

రామతీర్థం లో తెగిన రాముడు తలను
అడుగు ఎందుకు ఓడామో?

అంతర్వేదిలో కాలిపోయిన రథంను
అడుగు ఎందుకు ఓడామో?

కనకదుర్గమ్మ గుడిలో పోయినా నగలను,, వెండి సింహాలను
అడుగు ఎందుకు ఓడామో?

చనిపోయిన నర్సీపట్నం డాక్టర్: సుధాకర్ ఫ్యామిలీ నీ
అడుగు ఎందుకు ఓడామో?

మద్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ను అడుగు ఎందుకు ఓడామో?

చనిపోయిన తోట చంద్రయ్య ను,అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ అడుగు ఎందుకు ఓడామో?

ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో?

మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు
పెట్రోల్ పోసి చెరకు తోటలో తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ నీ
అడుగు ఎందుకు ఓడామో?

అమరావతి లో ఆడవాళ్ళని,ఉద్యమం చేసి చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో?

మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయినా కిరణ్ ఫ్యామిలీ నీ అడుగు ఎందుకు ఓడామో?

బీళ్ళు తెరిచిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో??
పూర్తి కానీ ప్రాజెక్టులు నీ అడుగు ఎందుకు ఓడామో?

నెల నెల జీతం కోసం ఎదురు చేసే ఉద్యోగస్తులను,
వాళ్ళ కుటుంబాలను
అడుగు ఎందుకు ఓడామో?

కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని
అడుగు ఎందుకు ఓడామో?

నిరుద్యోగ యువత పడ్డ మానసిక వేదనని
అడుగు ఎందుకు ఓడామో?

గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని
అడుగు ఎందుకు ఓడామో?

నువ్వు కక్ష పూరితంగా బాధలు పెట్టిన ఉపాధ్యాయులను అడుగు ఎందుకు ఓడామో..

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన నీ దౌర్భాగ్య ఘనత ను అడుగు…
ఈ ప్రపంచంలో అప్పులతోనే పాలించిన ఏకైక దరిద్ర సిఎం నువ్వే!

అప్పులు చేసి పథకాలు పప్పు బెళ్ళాలు ఇవ్వడానికి నువ్వే ఎందుకు… దానికి వాలంటీర్ అయినా సరి పోతాడు కదా. అదేనా సమర్ధత. అదేనా నాయకుడు లక్షణం..
అందుకే నీకు విద్యావంతులు యువత దూరమైనారు.
నువ్వు పాలనకు పనికిరాని చేతగాని దద్దమ్మ అని జనాలకు తెలిసిపొయింది.

ఇలా చెప్పుకుంటూ పోతే 100 పేజీల పుస్తకం కూడా చాలదు..

నువ్వు ఓడిపోవటానికి ఈ కారణాలు చాలా?
ఇంకా ఏమైనా కావాలా జగన్ గారు?!

– మీ ఆంధ్రుడు

LEAVE A RESPONSE