Suryaa.co.in

Political News

నోరులేని ఈవీఎంలను నిందిస్తారా?

-ముందు మీ నోరు శుభ్రం చేసుకొని అనుమానాలు నివృతి చేసుకోండి
-ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈ నోరు ఏమైంది?

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి ఊహించని, ఊహకందని,కోలుకోలేని, కలలో కూడా అనుకోలేని రిజల్ట్స్ ప్రజలు ఇచ్చారు. WHY NOT 175 కు సరైన సమాధానం ఇచ్చారు.

వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు రెండు లక్షల డెబ్భై వేల కోట్లు ప్రజలకు వివిధ పథకాల కింద పంచితే ఆ డబ్బు తీసుకున్న అవ్వ, తాతలు ఓట్లు ఏమయ్యాయో, అక్క, చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో, రైతన్నల ఓట్లు ఏమయ్యాయోనని చెప్పనలివి గాని, వారిని చూడటానికే ఇబ్బంది పడే విధంగా ముఖకవళికలు పెట్టుకొని, రాబోయే, జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, ఏ గతి పట్టవలసి వస్తుందోనని మననం చేసుకుంటూ, పడబోయే వ్యక్తిగత ఇబ్బందులు బయటకు చెప్పుకోలేక, 5 సంవత్సరాలు ఎంతసేపట్లో వస్తుందిలే. తిరిగి మనమే అధికారంలోకి వస్తామని, వారి నాయకులకు సమాధానాలు చెప్పుకుంటున్నారు.

ఏ పార్టీ వారైనా వారి నాయకులను బుజ్జగించుకోవడం, సమాధాన పరుచుకోవడం, కార్యకర్తలు, నాయకులు చేజారి పోకుండా కాపాడుకోవడం కచ్చితంగా నాయకుడు చేయవలసిన పనే.
కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బు ఇచ్చాను కాబట్టి, నాకే ఓట్లేస్తారని ఒక భ్రమ తప్ప, అదే అభివృద్ధి, అదే సంక్షేమం, అదేరాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకు పోతుంది అని పిచ్చి భ్రమలో ఇప్పటికీ ఉన్నట్టుగా అర్థమవుతుంది.

మొదటగా మీరు ఇచ్చిన డబ్బు మీది కాదని గ్రహించండి. ఆ డబ్బు ఆ ప్రజలదేనని, మీరు యాష్ట పోతున్న ప్రజలందరూ గ్రహించారు. మీరు అనుకున్నట్టుగా సంక్షేమ పథకాలకే ఓటు వేసే పనైతే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారు, మీ కంటే ఎక్కువ ఇస్తామని, ఇచ్చుటకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మరి దీనినేమంటారు? దీనికి ఏం సమాధానం చెబుతారు?

ప్రజలు ఓట్లు వేసేది రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, వారి తరాలు బాగుపడాలని, వారంతా ప్రశాంతంగా జీవనం సాగించాలని. అవినీతి పాలనలేని , నిజాయితీగా పరిపాలించే వారిని, చట్టబద్ధ పాలన అందించే వారిని గెలిపిస్తారు తప్ప, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రౌడీ రాజకీయం చేసే వారిని కోరు కోరు. మీరు గతంలో ఇచ్చిన డబ్బు కంటే డబల్ గా ఇచ్చిన కూడా ఇదే పంథా కొనసాగుతుంది.

ఓడిపోయిన ప్రతి పార్టీ (బిజెపి తప్ప) నోరు లేని ఈవీఎంలను నిందిస్తుంటారు. 2019 ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే తెలుగుదేశం పార్టీ ఈవీఎంలలో ఏదో మోసం జరిగిందని, పత్రికలకెక్కిన విషయం మనం మర్చిపోలేదు. సహజంగానే నింద బిజెపి మీద వేస్తారు. అదే ఎన్నికల్లో అందరూ ఊహించినట్టుగా బిజెపికి 350, ఎన్డీఏ కు 400 వచ్చి ఉంటే, ప్రపంచంలో ఉన్న భారత వ్యతిరేకులంతా ఈ రాహుల్ గాంధీకి వంత పాడేవారు.

ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలను నిందిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పాట పాడుతున్నాడు. దీనిని బట్టి రాబోవు రోజుల్లో వైఎస్సార్సీపీ ఇండి అసోసియేషన్ లో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఏం చేద్దాం. సాక్షాలు లేవు అని.. నిజంగానే ఈవీఎం లలో మోసం జరిగినట్టుగా ప్రజలకు అనుమానాలు కలుగ చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి కి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల గురించి అనుమానం రాలేదేమో! ఇప్పుడు వారి పార్టీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (ధర్మవరంలో మా పార్టీ నాయకుడి మీద ఓడిపోయినవారు) భారత దేశమంటే విషం వెళ్లగక్కిన WIRE కథనాలు ఏవో చూపిస్తూ, లెక్కలేసి ఈవీఎంలలో పొరపాటు జరిగిందని చెబుతున్నారు.

ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఈ రాజ్యాంగ కల్పించింది. గతంలో కూడా కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, ఈ వైర్ లాంటి పత్రికలు కథనాలు రాసి, చివరకు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు కెళ్ళి ఛాలెంజ్ చేస్తే .. ఒక్కరు ముందుకు రాకుండా తేల్చకుండా, వారి అనుమానాలు నివృతి చేసుకోకుండా, దొంగకు తేలు కుట్టినట్టుగా ఉండిపోయారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మతిభ్రమించినట్టుగా, పిల్ల చేష్టలుగా, రాజకీయలతో ముడిపడిన, సంబంధించిన మాట మాట్లాడేటప్పుడు, దాని సీరియస్ నెస్ లేకుండా 54 సంవత్సరాల వయసులో టీ షర్ట్ వేసుకొని, తెలిసి తెలియని మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ తీర్మాన ప్రతులను, అందరి ముందే బహిరంగంగా చించివేసిన ఘనత ఈ రాహుల్ గాంధీ ది.

ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఈవీఎంల మీద అనుమానం ఉంటే.. వారు గెలిచిన హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు , వారు ఎందుకు ఈవీఎంల ప్రస్తాపన తీసుకురాలేదు?

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 99 సీట్లకు రాజీనామా చేసి, కచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ని తిరిగి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు పెట్టమని అడిగే ధైర్యం,తెగువ ఉంటే.. సీరియస్ గా దాని మీద దృష్టి పెట్టండి. జీవితంలో ఇంక మీరు, మీ పార్టీ ఈవీఎంల గురించి మాట్లాడకుండా రిజల్ట్స్ వస్తాయి. అప్పుడన్న మీ నోర్లు మూతపడతాయేమో! మీకు నిజాయితీ ఉంటే సిద్ధపడండి. పిల్ల చేష్టలుగా మాట్లాడి దేశం పరువు తీయకండి.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE