అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు లోకేష్ సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. తన కార్యాలయం వద్దకు వచ్చిన విజ్ఞప్తులు, అర్జీలే కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలపైనా ఆయన ఆరా తీయాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు అక్కడికక్కడే సమస్యలు క్లియర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు త్వరలోనే రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు.