-కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపిన యువకెరటం
-సమస్యలపై లోకేష్ పోరాటం స్ఫూర్తిదాయకం
-పార్టీ శ్రేణులకు రక్షణగా ముందడుగు
-తప్పుడు కేసులతో వేధించినా బెదరని గుండెధైర్యం
-రాష్ట్ర రాజకీయాల్లో ‘‘రెడ్ బుక్’’ సంచలనం
-అలుపెరగని పోరాటంతో పసుపుజెండా రెపరెపలు
అమరావతి: రాష్ట్రంలో అరాచకపాలనపై ప్రజలు తమ మనోగతాన్ని బయటకు చెప్పడానికే భయపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను క్షేత్ర స్థాయిలో ఎండగడుతూ అలుపెరగని పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిరచిన దమ్మున్న నాయకుడు యువనేత నారా లోకేష్. అరాచకశక్తుల కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు కన్నీళ్లను తుడుస్తూ, కేడర్‌కు మనోధైర్యాన్నిస్తూ లోకేష్ చేసిన పోరాటం యువతరా నికి స్ఫూర్తిదాయకంగా నిలచింది. పార్టీ అధినేత నుంచి సామాన్య కార్యకర్తలవరకు తప్పుడు కేసులతో వేధించిన జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడంలో లోకేష్ చూపిన తెగువ పార్టీని విజయతీరాలకు చేర్చింది. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఐదేళ్ల పాటు తాలిబాన్ తరహా నియంతృత్వ పాలన సాగింది. బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని విమర్శించిన నేతలతోపాటు సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సాధారణ కార్యకర్తలను సైతం తప్పుడు కేసులతో వేధించారు. కొందరు అరాచక పోలీసు అధికారులు అర్థరాత్రి వేళల్లో గోడలుదూకి తలుపులు బద్దలుగొట్టి పార్టీ కేడర్‌ను భయభ్రాంతులకు గురిచేశారు.
ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాడుతూ…మరోవైపు కేడర్‌ను కాపాడు కుంటూ ముందుకు సాగారు. అర్థరాత్రి వేళ సాధారణ కార్యకర్త మెసేజ్ చేసినా తక్షణమే స్పందించి వారికి అండగా నిలిచారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు లాంటి వారినే థర్డ్ డిగ్రీతో వేధించిన అరాచక ప్రభుత్వం పసుపు సైనికులను అన్నిరకాలుగా ఇబ్బందుల పాల్జేసింది. రాష్ట్రంలో దాదాపు 70 మందికి పైగా కార్యకర్తలను జగన్ ప్రభుత్వం పొట్టనబెట్టుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్‌కు అండగా నిలిచేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో న్యాయనిపుణులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి న్యాయసహాయాన్ని అందించారు. గత ఐదేళ్లలో వివిధ సంఘటనల్లో చనిపోయిన, దెబ్బతిన్న కేడర్‌కు కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా రూ.130 కోట్ల రూపాయల సహాయాన్ని అందించారు. అరాచకశక్తుల చేతిలో బలైన వారి బిడ్డలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యనందిస్తున్నారు. పార్టీ కేడర్‌కు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ లోకేష్ భరోసా కల్పించారు. రాయలసీమలో పాద యాత్ర సమయంలో లోకేష్ కాళ్లకు బొబ్బలు రావడం చూసిన తల్లి భువనేశ్వరి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆ సందర్భంలో లోకేష్ తల్లిని ఊరడిస్తూ… పార్టీకోసం కార్యకర్తలు ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నారు… వారితో పోలిస్తే నేను పడుతున్న కష్టం అంత పెద్దదేం కాదమ్మా… నాకేం కాదంటూ అనునయించారు. పార్టీ కేడర్‌కు లోకేష్ ఎంత ప్రాధాన్యత ఇస్తారనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం.
అగ్నిపరీక్ష సమర్థవంతంగా ఎదుర్కొన్న యువనేత
యువగళంతో ప్రజాకంటక పాలనపై అవిశ్రాంత పోరాటం సాగిస్తున్న నారా లోకేష్ పాదయాత్రను ఏ విధంగా అయినా అడ్డుకోవాలని కుట్రపన్నిన జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టింది. ఆరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువగళం శిబిరంపై పోలీసులు బందిపోటు దొంగల్లా విరుచుకు పడ్డారు.
యువగళం వాలంటీర్లను అపహరించి సమీపంలోని ఒక రైస్ మిల్లులో నిర్బంధించారు. భీమవరంలో పాదయాత్ర సమయంలో రెచ్చగొట్టి గొడవలు సృష్టించి తిరిగి యువగళం వాలంటీర్లపైనే తప్పుడు కేసులు బనాయించారు. లోకేష్ బస చేస్తున్న శిబిరాన్ని చుట్టుముట్టి అష్టదిగ్బంధనం చేశారు. ఒక పక్క తండ్రి అరెస్టు, మరోవైపు యువగళం వాలంటీర్ల నిర్బంధంతో ఉక్కిరిబిక్కిరైన యువనేత లోకేష్ తాను బసచేస్తున్న శిబిరం వద్దే నేలపై కూర్చుని గాంధేయ మార్గంలో ఆందోళనకు దిగారు. తన తండ్రిని చూసేందుకు వెళ్లాలని చెప్పినా అనుమతించకుండా అడ్డుకున్నారు. తనను అనుమతించేవరకు కదిలేది లేదంటూ నిరసనకు దిగడంతో యువనేత తాడేపల్లి వెళ్లేందుకు అనుమతించారు. పాదయా త్రకు తాత్కాలిక విరామం ప్రకటించి న్యాయపోరాటం చేశారు.
పార్టీ అధినేత చంద్రబాబునాయుడును 53 రోజులపాటు జైలులో ఉంచిన సమయంలో లోకేష్ అగ్నిపరీక్షను ఎదుర్కొన్నారు. ఒకవైపు అధినేతపై పెట్టిన తప్పుడు కేసుల్లో న్యాయ పోరాటానికి డిల్లీవెళ్లి నిపుణులతో నిరంతర చర్చలు, మరోవైపు రాష్ట్రంలో అక్రమ నిర్బంధానికి గురైన కేడర్‌ను కాపాడుకోవడం, ఇంకోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించిన యువగళం వాలంటీర్లను బయటకు రప్పించేందుకు యువనేత రేయింబవళ్లు పోరాడారు. చంద్రబాబు కోసం డిల్లీలో న్యాయపోరాటం చేస్తూనే జైలులో ఉన్న యువగళం కార్యకర్తలను బయటకు తెచ్చేందుకు ప్రత్యేకం గా న్యాయనిపుణులను ఏర్పాటుచేశారు. కొంతకాలం తర్వాత వారిని బెయిల్ పై బయటకు రప్పించారు. ఈలోగా అవుటర్ రింగ్ రోడ్డులో భూముల కుంభకోణ మంటూ తప్పుడు కేసు మోపి లోకేష్‌ను సైతం సీఐడీ విచారణకు పిలిచింది. ఏ తప్పూ చేయని లోకేష్ ఏ మాత్రం జంకకుండా సిఐడికి సమాధానమిచ్చారు. అన్ని ప్రతిబంధకాలను అధిగమించి పులు కడిగిన ముత్యంలా 79 రోజుల సుదీర్ఘ విరామానంతరం యువగళం జైత్రయాత్రను పునః ప్రారంభించి దిగ్విజయంగా గాజువాక శివాజీనగర్‌లో ముగించారు. ఆ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సాధించబోయే అప్రతిహతమైన విజయాలకు యువగళం పునాదులు వేసిందని చెప్పిన మాటలు ఈ ఎన్నికల్లో నిజమయ్యాయి.
రాష్ట్ర రాజకీయాల్లో ‘‘రెడ్ బుక్’’ సంచలనం
సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా యువనేత లోకేష్ చేసిన ప్రసం గాలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టించాయి. యువగళం పాదయాత్ర తర్వాత పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సమాయాత్తం చేసేందుకు శంఖారావం కార్యక్ర మం ద్వారా ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రాయలసీ మలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువనేత సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా యువగళం పేరుతో యువతతో సదస్సులు నిర్వహించి ఎన్నికల్లో వారు పోషించాల్సిన పాత్రపై దిశానిర్దేశం చేశారు. రాజకీయ ప్రత్యర్థు లపై మాటల తూటాలతో లోకేష్ చేసే ప్రసంగాలు కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.
అధికార పార్టీ వైఫల్యాలు, అవినీతి చర్యలను ఆధారాలతో సహా ఎండ గట్టడంతో లోకేష్ ప్రసంగాలు ప్రత్యర్థులను ఇరకాటంలో పడేశాయి. దీనికితోడు తెలుగుదేశంపార్టీ కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధించిన వారి వివరాలను పొందుపరుస్తూ లోకేష్ రూపొందించిన రెడ్‌బుక్ రాష్ట్ర రాజకీయాల్లో సంచల నంగా మారింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్లడం వారిలో నెలకొన్న భయాందోళనలకు అద్దంపట్టింది. ఈ విషయంలో తాను ఏ మాత్రం తప్పు మాట్లాడటం లేదని, ఎవరైతే అమాయక ప్రజలు, కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధించారో వారిపై అధికారంలోకి వచ్చాక విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
అధికారపార్టీ వత్తిళ్లతో పక్షపాతంతో వ్యవహరించిన పోలీసు అధికారులను రెడ్ బుక్ ఆందోళనకు గురిచేయగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనోస్థయిర్యాన్ని నింపింది. దీంతోపాటు ఎటువం టి శషభిషలు లేకుండా పార్టీ వాయిస్‌ను తనదైన శైలిలో సూటిగా, సుత్తిలేకుండా లోకేష్ చేసిన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేశాయి. తాలిబాన్ల మాదిరిగా జగన్ ప్రభుత్వం సాగించిన అరాచకానికి ఎదుర్కోవడంలో లోకేష్ చూపిన తెగువ ప్రజలు, పార్టీ కేడర్‌లో కొండంత ధైర్యాన్ని నింపాయి. మాచర్ల, తాడిపత్రి నియోజ కవర్గాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెద్దారెడ్డి లాంటి నరరూప రాక్షసులకు కేడర్ ఎదురొడ్డి నిలబడిరదంటే లోకేష్ ఇచ్చిన మనోస్థయిర్యమే ప్రధానకారణం. రాజకీ యాల్లో యువతరాన్ని ప్రోత్సహించేలా లోకేష్ సూచనలతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు పార్టీని విజయపథంలో నడిపించాయి.