టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదు. పైగా మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు అంటున్నారు సకల శాఖ మంత్రి సజ్జల. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అత్యాచారం కేసు నమోదు చెయ్యకుండా తగాదా కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసులు. స్థానిక వైసిపి నేతల ఒత్తిడితో పోలీసులు కేసు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారు. మహిళపై అత్యాచారానికి పాల్పడిన సోమశేఖర్, అఖిల్, అక్కులప్ప, వారికి సహకరిస్తున్న స్థానిక వైసిపి నేతలను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చెయ్యాలి.
పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటి?
వైసీపీ రాక్షసపాలనలో పోలీసుల ప్రాణాలకీ రక్షణలేకుండా పోయింది. నంద్యాల డీఎస్పీ ఆఫీసులో పనిచేసే కానిస్టేబుల్ గూడూరు సురేంద్రకుమార్ ని పట్టణం నడిమధ్యలో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశారు రౌడీషీటర్లు. జగన్‌రెడ్డి రాజ్యం నేరగాళ్ల స్వర్గమైందని రౌడీషీటర్లు నిరూపించారు. ఒక కాకి చనిపోతుంది సాటి కాకులు అరుస్తూ గోల చేస్తాయి. ఒక ఖాకీని చంపేస్తే..నిందితులైన రౌడీషీటర్లు ఎవరో తెలిసినా ఇప్పటికీ ఖాకీ బాస్‌లు పట్టుకోలేదంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో తేటతెల్లం అవుతోంది.
కానిస్టేబుల్ సురేంద్రకుమార్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.