Suryaa.co.in

Andhra Pradesh

జనం సొమ్ము జలగలా పీల్చేస్తున్నాడు: నారా లోకేష్

మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనే రకం జగన్ మోసపు రెడ్డి. జనం సొమ్ము దోపిడీకి ఆడని జగన్ నాటకం లేదు. వైసీపీ కార్యకర్తలందరినీ వలంటీర్లుగా పెట్టుకుని పార్టీ కోసం పనిచేయిస్తూ ప్రజాధనం ధారపోస్తున్నారు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం కాదు.. ప్రజాధనం ఏదో విధంగా కాజేయడమే అని కొత్తసూత్రంతో పాలన సాగిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలైన వలంటీర్లకి రూ.233 కోట్లతో సెల్ ఫోన్లు కొనిచ్చారు. వాటి రీఛార్జిల ఖర్చు ప్రజల డబ్బే. వీరు పనిచేసేది వైసీపీ కోసం. మొబైల్ లో ఇంటర్నెట్ వాడి సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. కానీ జనం సొమ్ము సొంతానికి ఎలా వాడుకోవాలనే అత్యాశతో మరో JO తెచ్చారు. GO అంటే గవర్నమెంట్ ఆర్డర్..JO అంటే జగన్ ఆర్డర్. మూడేళ్ల పాలనలో సర్కారు ఖజానాలో డబ్బులు లేవని ప్రజాసంక్షేమ పథకాలు ఆపేసిన ప్రభుత్వం రూ.300 కోట్లు సాక్షికి ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు సచివాలయాల్లో సాక్షి పత్రిక వేయించుకోవాలని హుకుం జారీతో మరికొన్ని కోట్లు గుంజేశారు. సచివాలయంలో సాక్షి పేపర్ పడుతుండగా, మొబైల్లో ఈ పేపర్ యాక్సెస్ వుండగా…మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే సాక్షి వేయించుకోవాలని నెలకి రూ.5.32 కోట్లు JO ఇచ్చేశారు. అంటే ఏడాదికి 63.84 కోట్లు. జనం సొమ్ము జలగలా పీల్చేస్తున్న జగన్ జనానికి ఎదురొచ్చినా…జనమే ఎదురెళ్లినా జనానికే రిస్కు. అవినీతి బకాసురుడు జగనాసురుడు ఆకలికి ఆంధ్రప్రదేశ్ ఆహారమైపోతోంది.

LEAVE A RESPONSE