Suryaa.co.in

Andhra Pradesh

నిరుపేద‌ల‌ గూడు గోడు వినిపించ‌దా ముఖ్యమంత్రి గారూ..

-ద‌శాబ్దాలుగా నివ‌సిస్తున్న వారిని ఇళ్లు వ‌దిలి వెళ్లాల‌ని ఈ నోటీసులేంటి?
-కుర‌గ‌ల్లు గ్రామంలో 226 మంది పేద‌ల‌కు న్యాయం చేయాలి
-త‌హ‌శీల్దార్‌ని కోరిన టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్
నిరుపేద‌ల గూడు గోడు ముఖ్య‌మంత్రిగారికి వినిపించ‌దా అని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌శ్నించారు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో బుధ‌వారం ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌గిరి మండ‌లం కురగల్లు గ్రామంలో సమారు 226 మంది త‌మ గోడును లోకేష్ ఎదుట వెళ్ల‌బోసుకున్నారు. ద‌శాబ్దాలుగా తాము ఇళ్లు క‌ట్టుకుని వుంటున్నామ‌ని, ఇప్పుడు హ‌ఠాత్తుగా ప్ర‌భుత్వభూమిలో వుంటున్నార‌ని, ఉన్న‌ఫ‌ళంగా ఖాళీచేయాల‌ని నోటీసులు ఇచ్చార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
కుర‌గ‌ల్లు బాధితుల‌తో మంగళగిరి అంబేద్కర్ విగ్రహం నుంచి త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ర‌కూ ర్యాలీగా వెళ్లిన నారా లోకేష్‌..త‌హ‌శీల్దార్‌కి విన‌తిప‌త్రం అంద‌జేశారు. అధికారులు మానవత్వంతో ఆలోచించి

నిరుపేద‌ల ఇంటి స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించాల‌ని కోరారు. టిడిపి ప్ర‌భుత్వ‌హ‌యాంలో కొండ‌పోరంబోకు భూముల్లో నివ‌సిస్తున్న పేద‌ల‌కు ప‌ట్టాలిచ్చామ‌ని, అదేవిధంగా వీరికి ప‌ట్టాలివ్వాల‌ని కోరారు. రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్లు తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప‌నిచేస్తున్నార‌ని ఈ తొల‌గింపులు స్ప‌ష్టం చేస్తున్నాయ‌న్నారు.
సీఆర్డీఎ పరిధిలో పేదలు ఇళ్లు తొలగింపున‌కు నోటిసు ఇచ్చే అధికారం స్థానిక రెవెన్యూ అధికారులకు లేదని స్ప‌ష్టంచేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కుర‌గ‌ల్లు బాధితులకి న్యాయం జ‌రిగేవ‌ర‌కూ అండ‌గా వుంటాన‌ని, న్యాయ‌పోరాటానికి పూర్తిస‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తాన‌న్నారు.
గూడు కూల‌గొట్ట‌డం..పేద‌ల పొట్ట‌కొట్ట‌డం ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి దిన‌చ‌ర్య‌గా మారింది
పేద‌ల గూడు కూల‌గొట్ట‌డం, పేద‌ల పొట్ట కొట్ట‌డం మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి దిన‌చ‌ర్య‌గా మారిందని నారా లోకేష్ ఆరోపించారు. రేవేంద్రపాడు సర్కిల్ పెద్దవడ్లపూడి పరిధిలో ప్రభుత్వం తొలగించిన పేదల ఇళ్ళను ఆయ‌న‌ పరిశీలించారు.కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్ళు కూల్చేసారని, వ్యాపారాలు కూడా చేసుకోవడానికి వీల్లేదని షాపులు కూడా కూల్చేసారంటూ లోకేష్ ఎదుట మ‌హిళ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
ఇల్లు క‌ట్టుకుని ఇర‌వై ఏళ్లుగా వుంటున్నాన‌ని, ఇప్పుడు హ‌ఠాత్తుగా ఖాళీచేయాలంటున్నార‌ని, ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ని దివ్యాంగుడు రమేష్ క‌న్నీరు పెట్టుకున్నాడు. అనున‌యించిన లోకేష్‌…పేదల పొట్ట

కొట్టడానికి ఈ ప్ర‌భుత్వం వెనుకాడ‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. ఇళ్లు కోల్పోయిన‌, నోటీసులు అందుకున్న బాధితుల‌కు టిడిపి అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.
జగన్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదని స్వయంగా సలహాదారు సజ్జల చెప్పారు. సీఎం కే అవగాహన లేకపోతే ఇక ఎమ్మెల్యే ఆర్కే కి అవగాహన ఎలా ఉంటుందని లోకేష్ అన్నారు. మంగళగిరి లో డివైడర్ ఎవరు ఎత్తుకెళ్లారో నీతి కబుర్లు చెబుతున్న ఎమ్మెల్యే ఆర్కే సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన 2800 కోట్ల లో ఒక్క రూపాయి తీసుకురాలేదని అన్నారు.
ప్రభుత్వం నుండి నిధులు తీసుకురాకుండా కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ వాడేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం లేకుండా చేసారని అన్నారు. నియోజకవర్గంలో ఇసుక అంతా ఏమవుతుంది? అవినీతి అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు. పేదల ఇళ్లు కూల్చే పనులు ఆపాలని లోకేష్ కోరారు.

LEAVE A RESPONSE