Suryaa.co.in

Andhra Pradesh

డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
మా నాన్న మారిషస్-నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మాని, డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విచారణ జరపండి. నలభై ఏళ్ల మా నాన్న రాజకీయ జీవితంలో ఒక్క కేసైనా ఉందా? మీ రెండున్నరేళ్ల పాలనలో నాపై కక్ష కట్టి మరీ పెట్టిన ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు తప్పించి, మీరే ఆరోపించిన వాటిలో ఒక్క రూపాయి అయినా అవినీతి, అక్రమాలు నిరూపించగలిగారా?
సీబీఐ, ఈడీ, మనీల్యాండరింగ్, ఐటి కేసులతో ఆర్థిక ఉగ్రవాదైన జగన్ రెడ్డి ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా వరకూ విస్తరించారు. 72 వేల కోట్ల హెరాయిన్ దిగుమతిపై డీఆర్ఐ కేసులోనూ జగన్ రెడ్డే ఏ1. ప్రజల ఆరోగ్యం కాపాడే పాలు, పెరుగు, మజ్జిగ , నెయ్యి వ్యాపారం మాది. జనం ప్రాణాలు తీసి..లక్షల కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చే హెరాయిన్, గంజాయి, ప్రాణాంతక మద్యం మాఫియాలు మీవి.యెస్. నేను దుబాయ్ లో నా కుటుంబసభ్యులతో వున్నా. నా పర్యటనపైనా, మీ డ్రగ్స్ బిగ్ బాస్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా వెళ్లిన డ్రగ్స్ హెవెన్ ఐవరీ కోస్ట్ టూర్ పైనా కేంద్ర సంస్థల దర్యాప్తుకి సిద్ధమా? బ్రోకర్ సజ్జలా!
అక్టోబర్ 1న చాలెంజ్ చేసి మరీ డ్రగ్ టెస్ట్ లకి మా టిడిపి యువనేతల బృందం వస్తే, తోకముడిచిన మీ వైసీపీ నేతలే డ్రగ్స్ మాఫియా సూత్రధారులు, వాడకందారులని తేలిపోయింది. సజ్జల తీరు డ్రగ్స్ దొంగే…దొంగా..దొంగా అని అరిచినట్టుంది.

LEAVE A RESPONSE