అప్పులు, సరుకుల ధరలు, గంజాయిలో ఏపీ టాప్
90 శాతం సబ్సీడీతో డ్రిప్ ఇస్తుంటే జగన్ రద్దు చేశాడు.
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, గుట్టూరు హైవే వద్ద కుంచిటిగవక్కలిగ సామాజిక వర్గీయులతో నారా లోకేష్ ముఖాముఖి
• ఓసీలుగా ఉన్న మమ్మల్నీ బీసీల్లోకి మార్చినా ప్రయోజనం లేదు.
• మడకశిరలో నిర్మించతలపెట్టిన వక్కలిగ భవనాన్ని ఈ ప్రభుత్వం నిలిపేసింది.
• టీడీపీ ప్రభుత్వం రూ.5 కోట్లతో మంజూరు చేసిన వక్క మార్కెట్ ఈ ప్రభుత్వం రద్దు చేసింది.
• కర్నాటక బార్డర్ లో ఉన్న వక్కలిగలకు ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి.
• అక్రమంగా వక్కలిగలపై కేసులు రౌడీ షీట్ తెరిచారు.
• వక్కలిగ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి.
• రాళ్లపల్లి, రత్నగిరి రిజర్వాయర్లను నిర్మించాలి.
ముఖాముఖిలో నారా లోకేష్ మాట్లాడుతూ…
• గాలికొచ్చిన ప్రభుత్వం..గాలికే పోతుంది.
• అధికారంలోకి వచ్చాక దామషా ప్రకారం వక్కలిగలకు నిధులు కేటాయిస్తాం.
• వక్కలిగలను టీడీపీ రాజకీయంగా ప్రోత్సహిస్తుంది
• వక్కలిగలను మంత్రి, ఎమ్మెల్యే చేసిన ఘనత టీడీపీదే.
• ఎన్టీఆర్ హయాంలో హెచ్.బి.నరసయ్యకు న్యాయశాఖా మంత్రిగా అవకాశం కల్పించారు.
• పట్టురైతులకు ఈ ప్రభుత్వం పెట్టిన రూ.45 కోట్ల బాకీ మేము చెల్లిస్తాం.
• వక్క మార్కెట్ ను మడకశిరలో అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తాం.
• సీమకు తెచ్చిన నీరు వృథా చేయకుండా డ్రిప్ ద్వారా పంటలకు అందించాం. 90 శాతం సబ్సీడీతో డ్రిప్ ఇస్తుంటే జగన్ రద్దు చేశాడు.
• మడకశిర పరిధిలో టీడీపీ హయాంలో పట్టు రైతులకు 1000 షెడ్లు నిర్మించాం.
• హంద్రీనీవా 90 శాతం పూర్తి చేశాం..10 శాతం చేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ.
• వక్కలిగలను ఓబీసీలో చేర్చడం బీసీ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. దీనిపై పార్టీ అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
• టీడీపీ హయాంలో తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం.
• అధికారంలోకి వచ్చాక పెద్దలతో చర్చించి కర్నాటక, తమిళనాడులో చదివేవాళ్లకు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటాం.
• స్థానికంగా మంచి కాలేజీలు, యూనివర్సీటీలు తీసుకొస్తే బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు.
• అడ్డగోలుగా బీసీలపై కేసులు పెడుతున్నారు.
• బీసీల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే తెస్తాం.
• కేసులు రివ్యూ చేయడానికి జిల్లా స్థాయిలో కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం.
• స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో 16 వేల పదవులు బీసీలు కోల్పోయారు.
• టీడీపీ స్థాపనతోనే బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్ర్యం వచ్చింది.
• అప్పులు, సరుకుల ధరలు, గంజాయిలో ఏపీ టాప్ లో ఉంది.