Suryaa.co.in

Andhra Pradesh

అంబేడ్కర్ జయంతి నాడు లోకేష్ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించారు

– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్

అంబేడ్కర్ జయంతి నాడు లోకేష్ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

అంబేడ్కర్ జయంతి నాడు అంబేడ్కర్ పేరుపై నారా లోకేష్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తప్పుడు వార్తలు వ్రాశారు. ఆయనపై దుష్ప్రచారం చేశారు. జగన్ అవినీతి పుత్రిక సాక్షి. గతంలోనూ చంద్రబాబునాయుడిపై, లోకేష్ పై ఇలాంటి అనేక తప్పుడు వార్తలు ప్రచారం చేసింది. తప్పుడు ప్రచారం చేస్తూ దొరికిపోయిన దొంగలు వైసీపీ పేటిఎం బ్యాచ్. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం, జక్కసానిపల్లి గ్రామ ఎస్సీలతో లోకేష్ ముఖాముఖీ లో ఏమీ తప్పు మాట్లాడలేదు. ఆ సమయంలో అంకులప్ప అనే దళితుడు అంబేడ్కర్ విదేశీ విద్యపై అడిగిన ప్రశ్నకు లోకేష్ చెప్పిన సమాధానాన్ని వక్రీకరిస్తూ సాక్షి, పేటిఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు పెట్టిన అంబేడ్కర్ విదేశీ విద్యను జగన్ రెడ్డి తొలగించి తన పేరు పెట్టుకున్నారని మాత్రమే లోకేశ్ అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే డా. అంబేడ్కర్ పేరును విదేశీ విద్యకు పునరుద్దరిస్తామని లోకేష్ చెప్పారు. జగన్ రెడ్డి విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరును తొలగించినప్పుడు లోకేష్ స్వయంగా మంగళగిరిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పేరును పునరుద్దరించాలని పోరాటం చేశారు. మార్ఫింగ్ లు, ఫోర్జరీలు చేయడం, సూటుకేసు కంపెనీలు సృష్టించడంలో వైసీపీ నేతలు, పేటియం బ్యాచ్ దే పేటెంట్ అయింది. గతంలోనూ చంద్రబాబునాయుడు, లోకేష్ ల పై ఇలాంటి అనేక తప్పుడు వార్తలు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయారు. బాబాయిని చంపి నారాసుర రక్తచరిత్ర అంటూ చంద్రబాబు నాయుడికి అంటగట్టారు.

శ్రీవారి పింక్ డైమండ్ చంద్రబాబునాయుడి ఇంట్లో ఉందంటూ నీతి మాలిన రాజకీయం చేశారు. డీఎస్పీ ప్రమోషన్ లలో చంద్రబాబు సామాజిక వర్గానికే కట్టబెట్టారంటూ దుష్ప్రచారం చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, పోలవరం, పట్టిసీమల్లో అవినీతి అని తప్పుడు ప్రచారం చేశారు. వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా అవే అబద్దాలు చెబుతూ ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్నారు. వైసీపీ అబద్దాల ఫ్యాకర్టీగా తయారైంది, దీని చైర్మన్ గా జగన్ రెడ్డి వ్యహరిస్తున్నారు. సాక్షి మీడియాతో పాటు సోషల్ మీడియాలో టీడీపీపై బురద చల్లడం పనిగా పెట్టుకున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కంటే సాక్షి మీడియా నుంచే వచ్చే కాలుష్యంతోనే ప్రజలకు ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. వైసీపీ పేటీయం బ్యాచ్ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా టీడీపీ నుంచి దళుతుల్ని విడదీయలేరని టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE