Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ ఫోన్ ట్యాపింగ్

లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అవుతున్నా చర్యలు తీసుకోరా?
లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఎలెర్ట్ చేసిన ఆపిల్ సంస్థ
ఒంగోలు ఎమ్మెల్యేకి తొత్తులుగా పనిచేస్తున్న ఇద్దరు సీఐలను ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టాలి
ఎమ్మెల్యే బాలినేనికి ఊడిగం చేస్తున్న సీఐలు లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డిపై సాక్షాలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం
జగన్ రెడ్డిపై పోటీ చేస్తున్న తెదెపా అభ్యర్ధి బి.టెక్ రవి ప్రాణానికి ముప్పుందని చెప్పినా పోలీసుల బేఖాతర్
గన్ మ్యాన్ లేకుండా పులివెందులలో ఎన్నికల ప్రచారం చేశారంటే రాష్ట్రంలో ఇక ఏ వ్యక్తికి గన్ మ్యాన్ అవసరం లేదు
సీఎస్, సెర్ప్ సీఈవో తీసుకున్న నిర్ణయాల వల్ల 33 మంది వృద్ధులు బలి
ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదు

– తెదెపా సీనియర్ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వీటితో పాటు ఒంగోలులో తెదెపా నాయకులపై దాడి జరిగితే తిరిగి తెదేపా కార్యకర్తలపైనే కేసు నమోదు చేసి మాజీ మంత్రి బాలినేని మన్ననలకు దోహదపడుతున్న సీఐలు లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డిలపై సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య, దేవినేని ఉమా పాల్గొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కీలకంగా పరిగణించాలి: వర్ల రామయ్య

“రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్‌లు ట్యాపింగ్‌ చేస్తున్నారని మొదటి నుంచి మేము హెచ్చరిస్తునే ఉన్నాం. ఈ విషయంపై విచారించమని ఎన్నికల కమిషన్‌కు కూడా మేము ఫిర్యాదు చేశాం. మా నాయకుల ఫోన్‌లకు ఆపిల్ సంస్థ ఎన్నో సార్లు సెక్యూరిటీ నోటిఫికేషన్ పంపించాయి. తాజాగా యువనేత నారా లోకేష్ బాబు ఫోన్ కూడా ట్యాపింగ్‌కి గురవుతుందని ఆపిల్ సంస్థ సెక్యూరిటీ అలెర్ట్ నోటిఫికేషన్ పంపింది. పెగాసిస్ సాఫ్ట్ వెర్ ద్వారా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లు టాప్ చేస్తుందని గతంలో కూడా విచారించమని ఫిర్యాదు ఇచ్చామని మరల ఇప్పుడు కూడా ఫిర్యాదు చేశాం. ఐఫోన్‌ వినియోగదారులకు సెక్యూరిటీ నోటిఫికేషన్ వస్తుండటంతో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మిగిలినవారి ఫోన్‌లు ట్యాపింగ్ చేసి వారి కదలికలను అధికార పార్టీ గమనిస్తోందని దానిని కట్టడి చేయాలని ఈసీ ని కోరాం” అని వర్ల రామయ్య తెలిపారు.

వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్న సీఐ లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డిలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి…

“రాష్ట్రంలో చాలామంది పోలీసు అధికారులు ఇంకా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. జగన్ రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటే ఇబ్బందులకు గురవుతారని ఎన్ని సార్లు ఎంతమంది అధికారలుకు చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లైంది. ప్రకాశం జిల్లాలోని లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డి అనే సీఐలిద్దరు అధికార పార్టీ నాయకులకు కొమ్మకాస్తున్నారు. ఎమ్మెల్యేకు సీఐ సెల్యూట్ చేయడం చూసాము.

కానీ ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు సీఐ సెల్యూట్ చేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఎమ్మెల్యే కోడుకు వస్తే సీఐ డోర్ తీయడం చూసి ఆశ్చర్యపోయాం. ఇటువంటి అధికారులు నిష్పక్షపాతంగా ఉంటారనే నమ్మకం ప్రజలకు లేదు. బాలినేని మోచేతి నీళ్లు తాగడంలో సీఐ లక్ష్మణ్ ప్రధముడని ఒంగోలు కోడై కూస్తుంది. బాలినేని ఏం చెబితే అదే జీహుజూర్ అంటాడు. ఎమ్మెల్యే చెప్పాడని జైలులో ఉన్న వ్యక్తులపై కూడా కేసు పెట్టిన పాటి సీఐ భక్తవత్సల రెడ్డి. వైసీపీ కార్యకర్తలా ఈ ఇద్దరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఒక్క క్షణం కూడా ఎన్నికల విధుల్లో వీరు పాల్గొనడానికి వీలు లేదు” అని అన్నారు.

పులివెందులలో గన్ మ్యాన్ లేకుండా ప్రచారాలు చేస్తే ఇక రాష్ట్రమంతటా సుభిక్షమే

33 కేసులెదురుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పులివెందులలో తెదెపా తరుఫున పోటీ చేస్తున్న బి.టెక రవికి గన్ మ్యాన్‌ను అక్కర్లేదంటం పోలీసుల వ్యవహారశైలికి అద్దం పడుతున్నది….
“మొట్టమొదటి నుంచి దురుద్దేశంతోనే జగన్ రెడ్డి వాలంటీరు వ్యవస్థను పెట్టుకున్నాడు. ఇప్పుడు వాలంటీర్లుగా రాజీనామా చేసి ఏజెంట్లుగా మారండని వాలంటీర్లకు అధికార పార్టీ నాయకులు పిలుపునిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వాలంటీర్లను ఏజెంట్లుగా వినియోగించకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం. కీలకమైన విషయం గురించి మాట్లాడాలని డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి అపాయింట్మెంట్ కోరాం. కానీ ఇంతవరకు మాకు అవకాశం కల్పించలేదు. మా ఇబ్డందులు పట్టించుకోడు, మా ఘోష డిజిపి వినడని అర్థమయ్యి డిజిపికి ఫిర్యాదు చేయాల్సిన అంశాన్ని ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సి వచ్చింది.
చిన్న గొడవ అయినా మేము ఈసీకి ఫిర్యాదు చేయాల్సి వస్తోంది. ముఖ్యమంత్రిపై పులివెందుల నుంచి మా పార్టీ తరఫున బి.టెక్ రవి పోటీ చేస్తున్నాడు, అతని ప్రాణానికి హాని ఉంది. గన్ మ్యాన్లు ఇవ్వండని డిజిపిని కోరాం. అతనికి ఏమి ప్రాణ హానీ లేదని కడప ఎస్పీ బదులిచ్చాడు. పులివెందులలో గన్ మ్యాన్‌లు లేకుండా స్వేచ్ఛగా ఏ వ్యక్తైనా ఎన్నికల ప్రచారాలు చేశారంటే ఇక రాష్ట్రంలో ఏ అభ్యర్ధికి గన్ మ్యాన్‌ల అవశరం లేనట్లే. రాష్ట్రమంతటా సుభిక్షంగా ఉన్నట్టే” అని వర్ల తెలియజేశారు.

సీఎస్, సెర్ప్ సీఈవో తీసుకున్న నిర్ణయాల వల్ల 33 మంది వృద్ధులు బలి: దేవినేని ఉమా

“ఎన్నికల కోడ్ వచ్చిన 25 రోజుల్లో మచిలీపట్నంలో పోలీసుల స్టేషన్‌పై పేర్ని నాని దాడి, ఒంగోలులో బాలినేని అరాచకాలు వంటి ప్రధానంగా 35 సంఘటనలపై ఈసీకి ఫిర్యాదు చేశాం. కానీ ఇప్పటివరకు న్యాయం జరగడం లేదు, నిందితులపై చర్యలు లేవు. బందర్‌ లో జరిగిన ఘటనపై పేర్ని నాని, కిట్టూలపై కేసు పెట్టుంటే ఒంగోలులో బాలినేని అరాచకాలు జరిగేయి కాదు. పెన్షన్ పంపిణీ వ్యవహారంలో సీఎస్ జవహార్ రెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల 33మంది వృద్ధులు మరణించారు. భవిష్యత్తులో పెన్షన్ పంపిణీ సజావుగా సాగాలంటే సెర్ప్ సీఈవోగా మురళీధర్ రెడ్డి ఉండకూడదని ఈసీకి తెలిపాం” అని తెలిపారు.

LEAVE A RESPONSE