Home » అన్నం తింటున్నారా? అశుద్ధం తింటున్నారా?

అన్నం తింటున్నారా? అశుద్ధం తింటున్నారా?

ఎన్ టీవీ, టీవీ9 రాష్ట్రస్థాయి చానళ్లా? ఉండి లోకల్ ఛానళ్లా?
జగన్మోహన్ రెడ్డి గాడిని నాలుగు మాటలు అంటా
హు బ్రాట్ డ్రగ్స్ ఇన్ ఏపీ అని ప్రజలు ప్రశ్నించాలి
స్కూల్ పిల్లలకు గంజాయి, మాదకద్రవ్యాలు అందుబాటులో జగన్మోహన్ రెడ్డి పరిపాలన
పిల్లలు, యువత భవిష్యత్తు సర్వనాశనం చేసే విధంగా ముందుకు వెళుతున్న జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే సర్వనాశనం కానున్న భావితరాల భవిష్యత్తు…
భవిష్యత్తు తరాలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి అభ్యర్థులను గెలిపించాలి
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

హు కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నించినట్లుగానే, హు బ్రాట్ డ్రగ్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ అని ప్రజలంతా ప్రశ్నించాలని నరసాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు కోరారు. హు కిల్డ్ బాబాయ్ అన్నది ఇప్పుడు తేలిపోయింది. హు బ్రాట్ డ్రగ్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ అన్నది తేలాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇదే విషయమై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తో పాటు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. ఎవరు తీసుకొచ్చారు… ఎందుకు తీసుకువచ్చారు. ఈ డ్రగ్స్ ఎక్కడకు తరలించాలని అనుకున్నారు. గతంలో వచ్చిన ఇన్వాయిస్ ఏమిటి?, అన్న దానిపై రానున్న ఎన్నికలలోగా నిజదోషులు ఎవరన్నది కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

పరీక్షల నిమిత్తం డ్రగ్స్ ను ల్యాబ్ కు పంపామని, మూడు రోజుల్లో నివేదిక అందుతుందని చెప్పారు. కానీ 20 రోజులు అయినప్పటికీ, ఆ విషయంపై ఎవరు నోరు మెదపడం లేదన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న డ్రగ్స్ ను ఎందులో వాడుతున్నారన్నదానిపై విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని కోరారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలకు, గంజాయికి అడ్డాగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ ఎక్కడపడితే అక్కడ స్కూల్ పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను సమూలంగా సర్వనాశనం చేసే వ్యక్తిని రాజకీయాలలో కొనసాగనిస్తే రాబోయే తరాలకు ప్రమాదం అని హెచ్చరించారు. కొంతమంది మహిళలు జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకం ఇచ్చారని అంటున్నారని, గతం లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనూ స్కూలు, కాలేజీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి మహిళలను ఆకర్షించడానికి అమ్మ ఒడి పథకం కింద నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులను జమ చేస్తుండగా, గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లకు, కాలేజీలకు ఫీజుల రూపంలో చెల్లించేవారని చెప్పారు. దీనివల్ల విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కావని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి చంద్రబాబు నాయుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ, వారికి కూడా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

అమ్మబడి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి, స్కూలుకు వెళ్లే పిల్లలకు ఐస్ క్రీమ్ బండ్ల వద్ద డ్రగ్స్, గంజాయి అందుబాటులో ఉంటున్న వాటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్కూల్ పరిసరాలలోనే డ్రగ్స్, గంజాయిని విక్రయించడం ద్వారా, భవిష్యత్తు తరాలను సర్వనాశనం చేస్తున్నారన్నారు. ఇటువంటి వ్యక్తి మరొకసారి ఎన్నికైతే ఒక తరం భవిష్యత్తు పనికిరాకుండా పోతుందన్నారు. పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసి, వారి ఆరోగ్యంతో, రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్న వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

డ్రగ్స్ ఛాయలు ఉన్న మద్యం తయారీ ద్వారా, రాష్ట్రంలో మగువలు మాంగల్యానికి దూరం అవుతున్నారని రఘురామ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి ఆసుపత్రులలో చేరిన వారిని పరిశీలిస్తే, వారి కిడ్నీలు, లివర్ లు పూర్తిగా చెడిపోయినట్లు గుర్తించడం జరిగిందన్నారు. 20 ఏళ్ల పాటు ఎక్కువ మోతాదులో మద్యం సేవించిన వారి కంటే, జగనన్న ప్రత్యేక మద్యాన్ని కొద్ది కాలం పాటు సేవించిన వారి లివర్, కిడ్నీలే ఎక్కువ రేట్లలో చెడిపోయాయని తెలిపారు.

ఎవరైనా సమాజ శ్రేయస్సును కోరుకుంటారని, డబ్బు సంపాదన కోసం ప్రజల రక్త మాంసాలతో ఆడుకునే వ్యక్తులు ఎంతో ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఇటువంటి వ్యక్తులను సమాజానికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదన్న ఆయన, రానున్న ఎన్నికల ప్రచారంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ కేసు ఏమైందని ప్రశ్నించనున్నట్లు తెలిపారు.

డ్రగ్స్ వల్ల రాష్ట్రం సర్వనాశనం

రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలతో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇచ్చింది ఏమిటి అని ప్రశ్నించిన ఆయన, రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చారని, ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు. ప్రజలకు నిజాలు చెబితే పార్లమెంటు సభ్యుడని కూడా చూడకుండా దారుణంగా హింసించారన్నారు. ప్రజలకు హింస రాజ్యాన్ని, ప్రజాస్వామిక హక్కులు లేని రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

నిషేధించిన మాదకద్రవ్యాలను, నాణ్యత లేని మద్యాన్ని ప్రజలకు పంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని అన్నారు. మీకు మేలు జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, ఎన్ని కుటుంబాలకు కీడు చేశారో ఒక్కసారి మహిళలు ఆలోచించుకోవాలని సూచించారు. కొన్ని తరాలను సర్వనాశనం చేసే దిశగా ముందుకు వెళుతున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించి, నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రఘురామ కృష్ణంరాజు అభ్యర్థించారు.

నేను స్థానికేతరుడిననడం ఆశ్చర్యాన్ని కలిగించింది

ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి నేను స్థానికేతరుడిననడం ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో 25 నుంచి 30 గ్రామాలలో నా దగ్గర బంధువులు ఉన్నారు. మా ముత్తాత, మా తాత, మా నాన్న ఈ ప్రాంతంలోనే జన్మించారని, ఇక్కడే వారి బంధు గణమంతా ఉన్నదని, గ్రామాల పేర్లతో సహా రఘురామ కృష్ణంరాజు వివరించారు. ప్రస్తుతం తాను విలేకరులతో మాట్లాడుతున్న నా ఈ ఇల్లు కూడా ఉండి లోనే ఉన్నదని గుర్తు చేశారు.

భీమవరంలో ఇల్లు కట్టుకున్నానని కామెంట్ చేయడం విడ్డూరంగా ఉందన్న ఆయన, ప్రస్తుత ఎమ్మెల్యే భీమవరంలో ఉంటుంటే, తాను మాత్రం ఉండి లోనే ఉంటున్నానని గుర్తు చేశారు. నన్ను లోకల్ కాదంటారా?, నా ప్రాంతం ఇది… మా ముత్తాత, తాత, తండ్రి అందరి ప్రాంతం ఇదేనన్నారు. బ్రతుకుతెరువు కోసం ఒక్క ఊరికి వెళ్ళాం… వచ్చామన్నారు. దానికే నాది ఈ ప్రాంతం కాదని అంటారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి జనవరిలో వచ్చినప్పుడు నన్ను ఎందుకు స్వాగతించారని ప్రశ్నించిన, బయటి ప్రాంతం వారు వచ్చారని స్వాగతించారా అంటూ నిలదీశారు.

రామరాజు, శివరామరాజు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. గతంలో వారిద్దరు కలిసే ఉండేవారు . వారిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. నాకు రామరాజు, శివరామరాజుతో ఎటువంటి శత్రుత్వం లేదు. అందరము మిత్రులమేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గతంలో శివరామరాజు నాపై పోటీ చేసినప్పుడు నేను ఆయన్ని ఒక్క మాట అన్నది లేదు. ఆయన, కూడా నన్ను ఒక్క మాట అనలేదు. మా భవిష్యత్తును తేల్చే ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఒకరిని మరొకరం ఆప్యాయంగా కౌగిలించుకున్నాము. ఎంపీగా నేను ఎన్నికైన తర్వాత నన్ను మొదట అభినందించిన వ్యక్తి శివరామరాజు అని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. అంతా అన్యోన్యంగా ఉన్నామన్న ఆయన, నాపై పోటీ చేసే వ్యక్తి ఎవరైనా వారిని ఒక మాట కూడా అననని పేర్కొన్నారు.

డ్రామాలు ఆడుతున్న బెట్టింగ్ బ్యాచ్

ఉండి నియోజకవర్గంలో బెట్టింగ్ బ్యాచ్ డ్రామాలు ఆడుతోందని, కొంతమంది నిరాహార దీక్ష చేస్తే, మరి కొంతమంది ఆహార దీక్ష చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. బెట్టింగులు కట్టిన వారు జూన్ 4వ తేదీ తర్వాత డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పుడే ఇవ్వాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలో ఉన్నారన్నారు. 40 మంది బెట్టింగ్ రాయుళ్లు ఒక్కొక్కరు నలుగుర్నీ వెంటేసుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకుంటామని అంటున్నారని, వారు తమ డబ్బులు పోతాయన్న ఆందోళనతో ఒంటిపై పెట్రోల్ పోసుకుంటామని అంటున్నారో, నిజంగానే ప్రేమతో అంటున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

ఈ విషయమై ఎన్ టీవీ, టీవీ9 అత్యుత్సాహంతో వార్తా కథ నాలను ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏంట్రా బాబు.. ఎన్ టీవీ, టీవీ9 రాష్ట్రస్థాయి చానళ్లా?, లేకపోతే ఉండి లోకల్ ఛానళ్లా?? అంటూ అడగడం జరిగిందన్నారు. ఎంతసేపు రామరాజు, శివరామరాజు, రఘురామ కృష్ణంరాజు అంటూ గొడవ లేనా? అని ప్రశ్నించానని, మీరనుకుంటున్నట్లు ఉండిలో ఎటువంటి గొడవలు లేవని, అంతా ప్రశాంతంగానే ఉందని చెప్పానని రఘురామ కృష్ణంరాజు వివరించారు.

కొంతమంది జూదరులు తమ డబ్బులు పోతాయని ఆందోళనతో నిరాహార దీక్ష, వంటావార్పు వంటి చిలిపి పనులు చేస్తున్నారని అపహస్యం చేశారు. ఓకే నెంబర్ తో పది వాహనాలను వేసుకుని తిరుగుతున్నారని చేస్తున్న వ్యాఖ్యలపై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉన్నదని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కల్పించిందని గుర్తు చేశారు. నేను ఎక్కడికైనా వెళితే, అక్కడికి నాతో పాటు భద్రతా సిబ్బంది, నాతో వచ్చే అన్ని కులాలకు చెందిన సన్నిహితులు ఉంటారని, వారందరితో కలిసి వెళ్లాలంటే ఎక్కువ వాహనాలే ఉపయోగించాల్సి ఉంటుందని చెప్పారు.

ఉండి నుంచి పోటీ చేస్తానని నేనెక్కడ చెప్పలేదు

ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తానని నేను ఎక్కడ కూడా చెప్పలేదని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఎంపీగానైనా , ఎమ్మెల్యేగానైనా పోటీ చేస్తానని, చట్టసభల్లో ఉంటానని మాత్రమే పేర్కొనడం జరిగిందన్నారు. నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత, అమలాపురంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు ఎన్నికల్లో పోటీ చేయాలన్నది రాష్ట్ర ప్రజల కోరిక అని పేర్కొన్నట్లు, ఢిల్లీ నుంచి బిజెపికి చెందిన ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం ఒకటి, రెండు రోజుల వ్యవధిలో తనను కలవబోతున్నారని, కుదిరితే నరసాపురం ఎంపీ స్థానం నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారని, లేనిపక్షంలో రామరాజుకు సముచిత గౌరవాన్ని ఇచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లుగా ఎన్ టీవీ, టీవీ9 లలో స్క్రోలింగ్ వచ్చిందన్నారు. అక్కడ మీడియా ప్రతినిధులు ఉండే అవకాశం లేదని, ఈ విషయాన్ని రామరాజే మీడియా ప్రతినిధులకు చెప్పి ఉంటారన్నారు.

నన్ను లోకల్ కాదంటేనే ఊర్ల పేర్లు చెప్పాను

ఉండి నియోజకవర్గానికి నన్ను స్థానికేతరుడని రామరాజు పేర్కొంటేనే నేను నా బంధు గణం నివసించే ఊర్ల పేర్లు చెప్పానని, లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇప్పటివరకు రామరాజును నేను పల్లెత్తు మాట కూడా అనలేదని ఆయన గుర్తు చేశారు. నేను స్థానికేతరుడనని పదే, పదే ఎన్ టీవీ, టీవీ9 పేర్కొంటూ ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో, ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో పైనే ప్రత్యేక దృష్టి సాధించి మాట్లాడుతుంటే, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు.

ఎందుకంటే బయట చూసేవాళ్ళకు లోకల్ కాకపోతే, రఘురామ కృష్ణంరాజు అక్కడికి ఎందుకు వెళ్లారని అనుమానం వస్తుందన్నారు. ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ మా పుట్టు, పూర్వోత్తరాలు ఏమిటో తెలుసునని పేర్కొన్నారు. నేను ఉండి ఎమ్మెల్యేగా పోటీలో ఉంటే వైకాపా నాయకత్వం ఒక వీరాది వీరుడిని, శ్రీరంగనాధుడిని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఎన్నికల బరిలో రఘురామకృష్ణంరాజు ఉండాలన్నది ప్రజల ఆకాంక్ష అని, ఆయన జగన్మోహన్ రెడ్డి బాధితుడని , జగన్మోహన్ రెడ్డి పై ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు.

ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్న రెండున్నర కోట్ల మంది

రానున్న ఎన్నికల్లో నేను ప్రజాక్షేత్రంలో ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారని, ఉండి నియోజకవర్గంలోని 40 మంది జూదరులు కోరుకోకపోవచ్చునని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రెండున్నర కోట్ల మంది ప్రజాభిప్రాయానికే తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్న ఆయన, రామరాజుకు టికెట్ ఇవ్వకూడదని నేను అనడం లేదన్నారు. ఉండి నియోజకవర్గంలో ఆయన ఎంతో కష్టపడ్డారని, ఇళ్లిళ్లు తిరిగారన్నారు.

అయితే ఒకవైపు వైకాపా నాయకత్వంతో మాట్లాడుకుంటూ, ఇక్కడ పార్టీ నాయకత్వాన్ని అల్లరి పాలు చేయాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు. పార్టీ నాయకత్వం రాష్ట్రస్థాయిలో ప్రజాభిప్రాయం మేరకు ఒక నిర్ణయం తీసుకుంటుందని, జూదరుల ఇంట్రెస్ట్ కోసం నిర్ణయం తీసుకోదన్నారు. పార్టీని, వ్యక్తిగతంగా నన్ను , రామరాజు విమర్శించడం సరికాదని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రేపు నాకు ఎంపీ టికెట్ వస్తే, రామరాజు తో కలిసి నేను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాల్సిందేనని గుర్తు చేశారు. రామరాజు మంచివారని ఓటు వేయామని ప్రజలను అభ్యర్థించాల్సిందేనని, అలాగే రామరాజు నాతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందేనని చెప్పారు.

ఒకవేళ వైకాపా టికెట్ రంగనాథ రాజును కాదనుకొని, రామరాజుకి ఇస్తే ఆయన పార్టీని వీడవచ్చు. వైకాపా టికెట్ ను రామరాజు అడిగిన మాట నిజం. ఎవరితో మాట్లాడించారో అందరికీ తెలిసిందే. అందులో అబద్ధం ఏమీ లేదు. ఒక పార్టీలో టికెట్ దక్కనప్పుడు, మరొక పార్టీలో టికెట్ కోసం ప్రయత్నించడంలో తప్పేమీ లేదు… కాకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోయే ముందు, పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం సరైన విధానం కాదన్నారు. పార్టీలో ఎవరు చేరిన స్వాగతిస్తామన్న వైకాపా నాయకత్వం, ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇచ్చేది లేదని రామరాజుకు చెప్పినట్లుగా తెలిసిందన్నారు.

ఇతరులతో నిరాహార దీక్షలు చేయిస్తూ, మూడు పూటలా మనం మాత్రం భోజనం చేయడం సరికాదని, అంత బాధగా ఉన్నప్పుడు కావాలంటే ఆయనే చేసుకోవచ్చునన్నారు. ఇతరులతో చేయించడం సరికాదని చెప్పారు. అలాగని తానేమి చేయమని చెప్పడం లేదన్నారు. వాళ్లంతట వారే నిరాహార దీక్ష చేస్తున్నారంటే మీరు కూడా నమ్మరు కదా అంటూ మీడియా ప్రతినిధులను రఘురామకృష్ణంరాజు ఎదురు ప్రశ్నించారు.

ఎమ్మెల్యేగా గెలిస్తే ఢిల్లీలో ఉంటారనేది తప్పుడు ప్రచారం

ఎమ్మెల్యేగా గెలిస్తే ఢిల్లీలో ఉంటానని కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఎమ్మెల్యేను ప్రజలు పాలేరుగా భావిస్తున్నారని, పాలేరు పనికి ఒప్పుకున్న తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడకు పోతారని ఎదురు ప్రశ్నించారు. ఎంపీగా మేలో ఎన్నిక అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నన్ను ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించనంతవరకు నేను వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నానని గుర్తు చేశారు.

ఎంపీగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడంతో పాటు, పార్లమెంటరీ కమిటీల సమావేశాలకు హాజరు కావలసి ఉండడం వల్లే ఢిల్లీలో ఉన్నానన్నారు. ఆరు పార్లమెంట్ కమిటీలలో సభ్యుడిగా ఉండడంతో పాటు, ఒక పార్లమెంట్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రతి పార్లమెంటరీ కమిటీ సమావేశం వారం నుంచి పది రోజుల వ్యవధిలో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కమిటీ సమావేశాలకు సభ్యుడిగా, చైర్మన్ గా హాజరు కావలసి ఉంటుందని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి బహిష్కరించిన అనంతరం ఒకసారి రాక, రాక హైదరాబాదుకు వస్తే అపహరించి దారుణంగా హింసించారని గుర్తు చేశారు. ఎత్తుకెళ్లి చిత్రహింసలు పెట్టారు కదా , ఇక మన జోలికి రారులే అనుకుంటే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, ఈ విషయం తెలిసి అప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్లి పోవాల్సి వచ్చిందన్నారు. నా నియోజకవర్గంలో ప్రధానమంత్రి పాల్గొన్న బహిరంగ సభకు హాజరవుతుంటే, అతిథుల జాబితా నుంచి నా పేరును తొలగించడమే కాకుండా, అడుగడుగునా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నన్ను అరెస్టు చేయాలని చూశారన్నారు.

ఇంత జరిగిన తర్వాత కూడా, అన్ని విషయాలు తెలిసి… నేను నియోజకవర్గానికి రాలేదని అంటున్నారంటే కడుపుకు అన్నం తింటున్నారా? లేకపోతే అశుద్ధం తింటున్నారా? అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను నియోజకవర్గానికి ఎందుకు రాలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. వాళ్లకు నాపై దురాభిప్రాయం కలిగించేలా కామెంట్లు చేసినా, పట్టించుకోవడానికి ప్రజలేమీ అంత అమాయకులు కాదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ప్రతిరోజు ప్రజలకు కనిపిస్తూనే ఉన్నా

రాష్ట్రంలో టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని నిషేధించినప్పటికీ, మొబైల్ ఫోన్లలో ప్రజలకు నేను ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా కనిపిస్తూనే ఉన్నానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నానని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఢిల్లీలో ఎందుకు ఉంటానన్న రఘు రామకృష్ణంరాజు, ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.

మిమ్మల్ని కలవాలంటే మీ భద్రత వలయాన్ని దాటుకొని రావాల్సి వస్తుందనే ప్రచారం జరుగుతోందన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నపై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ… నేను ప్రస్తుతం అందరినీ కలుస్తూనే ఉన్నాను. ఆప్యాయంగా పలకరిస్తున్నాను. నాకు సెక్యూరిటీ థ్రెట్ ఉన్నది. తప్పకుండా సెక్యూరిటీ లేయర్ అనేది ఉంటుంది. అదేమీ తప్పు కాదని, రక్షణ సిబ్బంది వారి పని వారు చేస్తూ ఉంటారన్నారు. నాకు ప్రాణపాయం ఉందని కేంద్ర ప్రభుత్వం రక్షణను కల్పించింది. రక్షణ సిబ్బంది ఎవరైనా ఆయుధంతో వస్తున్నారా? లేదా?అనేది పరిశీలిస్తారన్నారు.

ఉమాబాలను ఒక్క మాట అనను… జగన్మోహన్ రెడ్డి గాడిని అంటాను

నరసాపురం వైకాపా ఎంపీ అభ్యర్థి ఉమాబాలను నేను ఒక్క మాట కూడా అననని, ఆమె నన్ను ఒక్క మాట అంటే నేను జగన్మోహన్ రెడ్డి గాడిని నాలుగు మాటలు అంటానని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. నర్సాపురం నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి జరగలేదన్న ఆమె కామెంట్లపై స్పందిస్తూ, బహుశా ఆమె ఇంకా కౌన్సిలర్ స్థాయిలోనే ఆలోచిస్తుందేమోనని, అందుకే ఈ విధంగా మాట్లాడి ఉంటారన్నారు. అయినా ఉమా బాల నాకు గతంలో ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరించారని, నా గెలుపులో ఆమె పాత్ర కూడా ఉందని ఆమె నన్ను ఎంత విమర్శించినా నేను విమర్శించని చెప్పారు.

నన్ను విమర్శించడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని తిట్టించడం ఆమెకు అభిమతమైతే నాకు సమ్మతమేనని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ అని, 80 శాతం మంది పార్టీ కోసం, పార్టీ అధినేత కోసమే పని చేస్తారన్నారు. నేను ఎంపీగా పోటీ చేస్తే రామరాజు తో కలిసి తిరుగుతాను. ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయనతో నే కలిసి తిరుగుతాను. బహుశా ఆయన కడుపు మండి ఒక మాట అని ఉండవచ్చు. సారీ అని చెబితే సర్దుకొని పోతాను.

నరసాపురం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేది లేదని, ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థులు వెనక్కి తగ్గితే అప్పుడు ఆలోచిస్తామని వైకాపా పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి అన్నారని రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా, అంటే అభ్యర్థులను వెనక్కి తగ్గేలా చేస్తారేమోనన్నారు. ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తే, మాజీ మంత్రి రంగనాథరాజును నాపై పోటీకి పెట్టాలని వైకాపా నాయకత్వం యోచిస్తున్నప్పటికీ, ఆయన అంగీకరించలేదని తెలిసిందన్నారు.

Leave a Reply