రాష్ట్రంలో జగనన్న విద్యుత్ కోతల పథకం అమలౌతుంది

-విద్యుత్ కోతలపై బహిరంగ చర్చకు సిద్ధమా?
-మాటలు కూతలు.. విద్యుత్ కోతలతో చలికాలంలో ముచ్చమటలు పటిస్తే ఇక వేసవి కాలంలో ఏంటి పరిస్థితి?
-మంతెన సత్యనారాయణ రాజు

జగన్ ప్రభుత్వం అసమర్ధత పాలన వలన విద్యుత్ కోతలతో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. రైతులు, పారిశ్రామిక వేత్తలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేదు. పవర్ జనరేషన్ మీద ఏ మాత్రం శ్రద్ధ పెట్టకపోవడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే రోజుకు 4 గంటల వరకు కరెంట్ కోతలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క గంట కూడా పవర్ తీసిన సందర్భాలు లేవు. రాష్ట్ర భవిష్యత్ మౌలిక సదుపాయాల కల్పన మీద ఆధారపడి ఉంటుంది. కాని జగన్ రెడ్డి వాటిని పట్టించుకున్న ధాఖలాలు లేవు. నాడు చంద్రబాబు నాయుడు హాయాంలో ప్రణాళికాబద్దంగా ఆర్.టి.పీ.పీలో 600 మె.గా. వాట్లు, వి.టి.పీ.ఎస్ లో 800 మె.గా. వాట్లలో దాదాపు 80 శాతం పూర్తి చేస్తే జగన్ రెడ్డి మిగిలిన పనులు చేయడం కూడా చేతగాక చేతులెత్తేసి రాష్ట్రాన్ని అంథకారంలోకి నెడుతున్నారు. మన రాష్ట్రంలో విద్యుత్ సర్ ప్లస్ లేకుండా సర్ ప్లస్ లోకి తీసుకువచ్చాం, పక్క రాష్ట్రం వారు అంథకారంలోకి వెళ్లిపోయారని కేసీఆర్ స్వయంగా చెప్పారు. కరెంట్ కోత లేకుండా ఇవ్వడం చేతగాకపోయినా కూడా కరెంట్ బిల్లులు మాత్రం విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు.

కేంద్రం రినెబుల్ ఎనర్జీలో భాగంగా 4,500 మె.గా. వాట్లు సాంక్షన్ చేస్తే 2,500 మె.గా. వాట్లను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. కాని జగన్ రెడ్డి మాత్రం ఒక్క మె.గా. వాట్ మీద దృష్టి సారించకుండా ఎక్కడో గుజరాత్ నుంచి పవర్ ను అత్యధిక ధరలు కొంటున్నారు. మన దగ్గర ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే ఉంటే తక్కువ ధరకు కరెంట్ వచ్చేది. పారిశ్రామిక వేత్తలు వచ్చేవి, పరిశ్రమలు వచ్చేవి, ఉద్యోగాలు వచ్చేవి, ఆదాయం పెరిగి ఉండేది. కాని ఒక్క పరిశ్రమ కూడా రాకపోవగా చాలా పరిశ్రమలు తరలిపోయాయి. రాష్ట్రంలో విద్యుత్ కోతలు దారుణం. ఆక్వా రంగానికి తీరని దెబ్బ. గత ప్రభుత్వం ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో దేశంలో ఎక్కువ రాబడులు ఈ రంగానికి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. కాని నేడు ఆ పరిస్థితి కరెంట్ కోతలతో పాటు డీజీల్ ధరలు భారమవ్వడంతో దయాదీన పరిస్థితిలో ఆక్వా రైతు ఉన్నాడు. గతంలో ఒక చిన్న రైతు 40కే.వి. ట్రాన్స్ ఫారమ్ పెట్టుకోవాలంటే లక్షా 50వేలు ఖర్చు అయ్యేది. నేడు అదే ట్రాన్స్ ఫారమ్ పెట్టుకోవాలంటే దాదాపు 3 నుండి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆనాడు రైతు 65 కే.వి. ట్రాన్స్ ఫారమ్ పెట్టుకోవాలంటే 2 లక్షల ఖర్చు అయ్యేది. నేడు అదే ట్రాన్స్ ఫారమ్ కు 5 లక్షలు అవుతుంది. ఇంత ఖర్చుతో రైతులు ఆదాయం ఎలా సమకూర్చుకుంటారు.

ఇప్పుడే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వచ్చే వేసవి కాలంలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటాయా అన్న సందేహం ప్రజల్లో కలుగుతుంది. విద్యుత్ శాఖ మంత్రి ఎప్పుడూ ఆ శాఖ మీద రివ్యూ పెట్టిన ధాఖలాలు లేవు. ఏ శాఖనైనా సజ్జల రామకృష్ణా రెడ్డే దిక్కా? దరిద్రపు సలహాలతో రాష్ట్రం ఇంత అద్వానస్థితికి చేరుకుంది. గతంలో సాంక్షన్ అయిన రినెవబుల్ విద్యుత్ పై ప్రభుత్వం శ్రద్ధ చూపితే రాష్ట్రం అంథకారం నుండి కాపాడుకోగులుగుతాం.

జగన్ రెడ్డి గ్రామాల్లో 3 గంటల వరకు పవర్ కోత విధిస్తూ జగనన్న పవర్ కోతల పథకాన్ని అమలు చేస్తున్నారు. మాటల్లో కోతలే కాకుండా పవర్ లోను కోతలు పెడుతున్నారు. జగన్ రెడ్డి మడమ తిప్పడం అంటారు గాని అది శుద్ధ అబద్దం మడమను 360 డిగ్రీల్లో తిప్పి మాట తప్పుతారు, మడమ తిప్పుతారు. జగన్ రెడ్డి మాటకు బ్రెయిన్ కు సంబంధం లేదు. నోటికి ఏది తోస్తే అది మాట్లాడతారు. చేతలు మాత్రం శూన్యం. రాష్ట్రంలో సబ్ స్టేషన్లు జగన్ రెడ్డి ఎన్ని ఏర్పాటు చేశారు. సబ్ స్టేషన్లు మరమ్మత్తులకు రూపాయి ఖర్చు చేయడం లేదు. జన్ కో ఉద్యోగస్థులకు జీతాలు నేటికి ఇవ్వని పరిస్థితి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కనీసం 10 ఏళ్ల వరకు ప్రణాళికలు వేసుకొని పాలన చేస్తున్నారు. కాని జగన్ రెడ్డి మాత్రం రేపటి కూడా ప్రణాళిక లేదు. ప్రజాస్వామ్యంలో జగన్ రెడ్డి నియంతృత్వ పాలన చేస్తున్నారు. ఒక శాఖలో అనేక మంది ఉద్యోగస్థులు ఉన్నారు వారందరి సలహాలు తీసుకోకుండా కేవలం జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి మాత్రమే ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఒక సబ్ స్టేషన్ లో ఎంత పవర్ వచ్చింది, ఎంత యూజ్ చేశారో కూడా వైసీపీ మంత్రులకు తెలియదు. కాని రాష్ట్రంలో ఏ స్ట్రీట్ లైట్ ఎంత సేపు వెలిగింది, దానికి ఎంత కరెంట్ వినియోగం అయ్యిందో చంద్రబాబు నాయుడు ఆనాడు టెక్నాలిజీని ఉపయోగించుకొని తెలుసుకునేవారు. విద్యుత్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. పవర్ కట్ పై బహిరంగ చర్చకు సిద్ధం.

Leave a Reply