( హితేష్ శంకర్)
నేటి పరిస్థితుల్లో ఉదాహరణకు రెండు సంఘటనలను సమాన స్థాయిలో చూస్తే, మహిళల పట్ల ఆలోచనా విధానం, మహిళల స్థితిగతుల గురించి ఒక పెద్ద చర్చను ప్రారంభించవచ్చని అనిపిస్తుంది. మొదటిది… ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలనతో ఆ దేశం మళ్లీ అరాచక యుగానికి వెళ్లిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల సమానత్వం గురించి మాట్లాడటం తీవ్రమైన నేరం. తాలిబాన్ ప్రతినిధి ఇటీవల స్థానిక మీడియా, టోలో న్యూస్‌తో మాట్లాడుతూ, మహిళల పని పిల్లలను కనడం. వారు చేయవలసింది అదే. వారికి ప్రభుత్వంతో పని లేదు. ప్రభుత్వంలో మహిళలు మంత్రులు కాలేరు.
ఈ ప్రకటనలతో ఎల్లప్పుడూ మహిళల హక్కుల కోసం పోరాడే మొత్తం ప్రగతిశీల సోదరవర్గం నోరుమెదపలేదు. ఇదో ఆశ్చర్యం!
రెండోది…
కేరళలోని బిషప్ జోసెఫ్ కల్లరంగట్ట, ముస్లిమేతర బాలికలను ‘లవ్ జిహాద్’, ‘నార్కోటిక్ జిహాద్’ కింద ఇరికించారని, బాధితులు మత మార్పిడి ద్వారా దోపిడీకి గురవుతున్నారని, వారిని ఉగ్రవాదంలో కూడా ఉపయోగిస్తున్నారని తీవ్ర ఆవేదన చెందారు.
ఇది ప్రేమ వివాహం కాదు, ముస్లిం తీవ్రవాదుల యుద్ధ వ్యూహం. భారతదేశం లాంటి దేశంలో ఆయుధాల బలం మీద ఎవరూ నిర్మూలించబడరని జిహాదీలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అందుకే వారు లవ్ జిహాద్, నార్కోటిక్ జిహాద్ ఉపయోగిస్తున్నారు. కేరళలోని కాథలిక్ బాలికలు దాని బారినపడటం మొదలైంది.
హిందువులు గొంతెత్తినప్పుడు నవ్వుకున్నారు…
కొన్నేళ్ళ కిందట నుంచి లవ్ జిహాద్ గురించి హిందూ సమాజం తరపున మాట్లాడినప్పుడు అందరూ నవ్వుకున్నారు. లవ్ జిహాద్ బాధితులు వందలాది మంది ఉన్నారు. వందలాది దీన గాథలు ఉన్నాయి. ముస్లిం అబ్బాయిలు తమ మతాన్ని దాచుకుని, ముస్లిమేతర బాలికలకు దగ్గరవ్వడం, బాలికలపై ఇస్లాం విధించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం నిత్యకృత్యమయ్యాయి. కానీ, ఇప్పుడు ‘ఆ బిషప్’ ఆందోళనలు లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది.
ఈ రెండు సంఘటనలు, మహిళల వాస్తవ పరిస్థితిని చెప్పడం మాత్రమే కాదు, ముస్లింలు మహిళల గురించి ఆలోచించడం మాత్రమే కాకుండా, ఇప్పటి వరకు మహిళల తరుఫున పోరాడుతున్న ప్రగతిశీల సృష్టికర్తల మౌనాన్ని కూడా బహిర్గతం చేశాయి.
తాలిబాన్లు తమ మధ్యయుగ ఆలోచనలను బహిరంగంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు తెచ్చారు. అయితే, కేరళలోని బిషప్‌లు చెప్పిన వాటిలో నిజం ఏమిటి? ఇది కేవలం ఈనాటి సమస్య మాత్రమేనా, కేరళ నుండి వినిపించే స్వరం మాత్రమేనా? లేదా మహిళల పట్ల ఇస్లాం మతం గురించి ఆలోచించడం, ముస్లిమేతర మహిళలపై లైంగిక హింస, కాబుల్-కాందహార్ దృశ్యాలపై కేరళ నుండి వచ్చిన ఆందోళన కాకుండా వేరే కథ ఉందా?
‘ముస్లిం ముఠాలు’!
గెటెస్ట్ వన్ ఇన్‌స్టిట్యూట్ పోర్టల్‌లో 2015లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం…
‘ముస్లిం ముఠాలు’ యూరోపియన్ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొన్నారు. ఆక్స్‌ఫర్డ్‌షైర్ సీరియస్ కేస్ రివ్యూలో, ఒక బాధితురాలు తనను చిల్డ్రన్స్ హోమ్ నుండి రవాణా చేసినట్టు చెప్పింది. నిందితుడు దొరికిపోయాడు. శిక్ష పడిరది. కానీ అతను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అతను మళ్లీ బాధితురాలిని స్మగ్లింగ్‌లో పెట్టాడు.
400 మంది బ్రిటిష్ అమ్మాయిలు ఫిర్యాదు
15 ఏళ్ళుగా, ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో దాదాపు 400 మంది బ్రిటిష్ అమ్మాయిలు ‘ముస్లిం అత్యాచార ముఠా’ ద్వారా లైంగిక వేధింపులకు గురైనట్టు స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. ఈ సమస్య బ్రిటన్‌కు మాత్రమే పరిమితం కాలేదు… డెర్బీ, బ్రిస్టల్, రోథర్‌హామ్‌లో కూడా కనిపించింది. 2004, 2012 మధ్య, 373 మంది బాలికలు ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో లైంగిక వేధింపులకు గురయ్యారు. 2013 సంవత్సరంలో, ఈ కేసులో ఏడుగురు ముస్లిం నిందితులు దోషులుగా తేలారు. బ్రిటన్‌లో 1995, 1998 మధ్య, ఒక విద్యార్థి హుస్సేన్, మహ్మద్ అక్రమ్, తాలిష్ మహమూద్ అక్రమ్‌తో బాధపడ్డాడు. స్కూలు ప్లే గ్రౌండ్‌లో అత్యాచారం కూడా గురయ్యాడు.
పాకిస్తాన్‌లో…
ఇస్లాం మతం స్వీకరించడానికి, జిహాదీలను వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు గత సంవత్సరం పాకిస్తాన్ లాహోర్‌లో ఇద్దరు క్రైస్తవ సోదరీమణులు హత్యకు గురయ్యారు. జిహాదీలు ఆ తలలను వేరు చేసి కాలువలో పడేశారు. ఇద్దరు సోదరీమణులు అప్పటికే వివాహం చేసుకున్నారు, వారికి పిల్లలు ఉన్నారు. డిసెంబర్ 2020లోనే, పాకిస్తాన్‌లో 12 ఏళ్ల క్రిస్టియన్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. దీని తరువాత ఆమె ఇస్లాం మతం స్వీకరించి వివాహం చేసుకుంది.
అదే ఏడాది పాకిస్తాన్ లోనే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ముస్లిమేతర బాలిక కిడ్నాపర్ల నుండి విముక్తి పొందింది. ఆ సమయంలో ఆమెను బంధించారు. ఐదు నెలల క్రితం ఆమెను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాలిని తాకట్టు పెట్టారు. తనను బానిసగా ఉంచినట్టు ఆమె తన కుటుంబానికి చెప్పాడు. పశువుల కొట్టం 24 గంటలూ తుడిచేది.
12 మంది ముస్లింలకు 143 ఏళ్ళ జైలు శిక్ష
2016లో, యుకె కోర్టు పాకిస్తాన్ మూలాలకు చెందిన 12 మంది ముస్లింలకు 143 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ పురుషులు 2011-2010 సమయంలో వెస్ట్ యార్క్‌షైర్‌లో 13 ఏళ్ల బ్రిటీష్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. దోషుల్లో ఒకరు బంగ్లాదేశ్‌కు పారిపోయారు. అతను డ్రగ్స్ డీలర్ కూడా.
రోథర్‌హామ్ పిల్లల లైంగిక వేధింపుల ఘటన
2010 సంవత్సరంలో, బ్రిటిష్ చరిత్రలో అత్యంత భయంకరమైన అత్యాచార ఘటన బహిర్గతమైంది. దీనిని రోథర్‌హామ్ పిల్లల లైంగిక వేధింపుల కుంభకోణం అంటారు. ఎనభైల చివర నుండి 2010 వరకు, దాదాపు 1,400 మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యారు. దీనికి కారకులు బ్రిటిష్-పాకిస్తానీ ముస్లింలు. వారు ఈ రాకెట్‌ను పిల్లల సంరక్షణ కేంద్రాల ద్వారా నడిపేవారు. ఈ సంరక్షణ కేంద్రాల నుండి బాలికలను టాక్సీల ద్వారా తీసుకెళ్లి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఇది కేవలం నేరస్థుడి, బాధితుడి కేసు మాత్రమే కాదని ఈ సంఘటనలు చూపుతున్నాయి. మహిళలను లక్ష్యంగా చేసుకోవడం తాలిబాన్ ఎపిసోడ్‌లో కనిపించే అదే మనస్తత్వం.
డ్రగ్స్‌కు బానిసలుగా చేసి…
కేరళ నాయకులు, వ్యాఖ్యాతలు ‘కల్పితం’ అని పిలవడానికి ప్రయత్నిస్తున్న నార్కోటిక్స్ జిహాద్ గురించి ఇప్పుడు చర్చ! యూరోప్‌లోలాగా ఇక్కడ కూడా కొంతమంది ఇలాంటి ‘నార్కోటిక్స్ జిహాద్’ నడుపుతున్నారు. ప్రత్యేకించి డ్రగ్స్‌కి బానిసలుగా చేయడం ద్వారా వారు యువతను బలహీనపరుస్తున్నారు. డ్రగ్స్ అండ్ డ్రగ్ అడిక్షన్ కోసం యూరోపియన్ మానిటరింగ్ సెంటర్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం… జిహాదీ మూకలు యూరోపియన్ యువతకు గంజాయి, కొకైన్, హెరాయిన్ సరఫరా చేస్తాయి. డ్రగ్స్ రేవ్ పార్టీలు చేస్తారు. యూరోపియన్ యూనియన్‌లో, 14.1 శాతం మంది యువత గంజాయి సేవించారు. అదే సమయంలో, 1.9 శాతం మంది యువత కొకైన్ ఉపయోగించగా, 1.8 శాతం మంది యువత ఇతర నిషేధిత ఔషధాలను ఉపయోగించారు.
పేలుడుకు సూత్రధారులు ముస్లిం దంపతులు!
2015లో, జిహాదీ గ్రూపు మిలాతు ఇబ్రహీంతో సంబంధం ఉన్న మీసా హోడ్జిక్ డెన్మార్క్‌లో అరెస్టయ్యాడు. అతని నుండి 48 కిలోల గంజాయి, మూడు కిలోల స్మాక్ కనుగొన్నారు. దాని నాయకుడు స్పెయిన్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడు. బ్రిటిష్ ముస్లిం భర్త, భార్య మహ్మద్ రెహ్మాన్, సనా అహ్మద్ ఖాన్ లండన్‌లో బాంబు పేలుళ్లకు పథకం వేశారు. 7 జూలై 2005న, లండన్‌లో బాంబు దాడులు జరిగాయి, ఇందులో యాభై మందికి పైగా మరణించారు. పదేళ్ల తర్వాత భార్యాభర్తలిద్దరూ ఈ సంఘటనను పునరావృతం చేయాలని అనుకున్నారు. కానీ అంతకు ముందే వారిని అరెస్టు చేశారు. మహమ్మద్ రెహ్మాన్ నిత్యం కొకైన్, గంజాయిని ఉపయోగించేవాడని దర్యాప్తులో తేలింది.
ఈ రెండు అంశాలను కలిపితే, ఇది ఒక ప్రదేశానికి సంబంధించిన విషయం లేదా ఊహాజనితమైన విషయం కాదని తెలుస్తుంది. ఈ సంఘటనలను ప్రత్యేక సంఘటనలుగా పరిగణిస్తే, చుట్టూ మంటలు వ్యాపించడం ద్వారా సమాజం నిర్లక్ష్యానికి గురవుతుంది. అప్పుడు ఈ మంటలు ‘అడవి మంటలు’గా మారడానికి ఎక్కువ సమయం పట్టదు.
ఇంకో విషయం… మేము తాలిబాన్లకు వెయ్యి ప్రశ్నలు అడుగుతాము, మేము ఇస్లాం మీద కూడా అడుగుతాము. కానీ, మతమార్పిడి వల్ల మీరు గాయపడితే, మీరు వణుకుతారు అని ఆ బిషప్‌ని ఒక ప్రశ్న కూడా అడగాలి.
‘మార్పిడి’ అనే గాయం ఏళ్ళుగా ఈ దేశాన్ని బాధిస్తోంది. కాబట్టి ఆలోచించండి! ఈ ఆట ముగియాలంటే, స్త్రీకి సమాన హోదా ఇవ్వాలి, పురుషుడు తన అసలు విశ్వాసంతో జీవించడానికి అనుమతించాలి. మీరు భారతదేశపు ఈ ప్రాథమిక స్వభావాన్ని వదిలేస్తే, ఇక్కడ ఉండిన తర్వాత కూడా, మీరు ఒక ఆక్రమణదారుడిలా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు ఒకరిని నిందిస్తారు, కొన్నిసార్లు మరొకరిని నిందిస్తారు… దీని వల్ల మీ జీవితం ఆటుపోట్లకు గురవుతుంది.
Source: Panchjanya