Suryaa.co.in

Andhra Pradesh

ప్రేమ విషాదం..యువకుడు ఆత్మహత్య

– అమ్మాయి చేసిన మోసాన్ని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు

తూర్పుగోదావరి జిల్లాలో అయినవిల్లి మండలం కొప్పిశెట్టివారిపాలెంలో ప్రేమ విషాదం చోటుచేసుకుంది. ప్రియురాలు మోసం చేసిందంటూ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయి చేసిన మోసాన్ని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రేమ పేరుతో తన వద్ద నుండి డబ్బులు,బంగారం,బట్టలు తీసుకుందని

యువకుడి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన సూసైడ్ సంబంధించిన వీడీయోను పంపేందుకు గత రాత్రి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ లని యువకుడు క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు కొప్పిశెట్టి శంకరరావు గత కొంతకాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇదిలాఉంటే యువకుడుకి గతంలో పెళ్లయ్యి బార్య భర్తలు విడిపోయారు.

LEAVE A RESPONSE