2022 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పిన అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ ఒక్కసారి గుర్తు చేసుకుందాం..
45 సంవత్సరాలకే మహిళలకు ఇస్తానన్న పింఛను ఎక్కడ ? కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 12,500 ఎక్కడ ? విభజన హామీ అయినా కడప ఉక్కు పరిశ్రమ ఎక్కడ ?
రేషన్ లో సన్న బియ్యం పంపిణీ చేస్తాను అన్న హామీ ఎక్కడ ? వారంలో మీ ఇంటికి నడుచుకుంటూ వచ్చింది అన్న రేషన్ కార్డు ఎక్కడ ? సీఎం అయిన వారం రోజుల్లో రద్దు చేస్తాను అన్న సిపిఎస్ రద్దు ఎక్కడ ?
కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా ఇస్తాను అన్న అమ్మఒడి పథకం ఎక్కడ ? 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని అన్నా హామీ ఎక్కడ ? ఎన్ని ఇల్లు కట్టారు ?
అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తాను అన్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పర్మినెంట్ ఎక్కడ ? అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తాను అన్న వృద్ధుల ₹3000 పింఛన్ ఎక్కడ ?
ప్రమాణ స్వీకారం రోజు ప్రతి సంవత్సరం పెంచుతారు అన్న 250 పింఛను ఎక్కడ ?వచ్చిన వెంటనే పరుగులు పెట్టి ఇస్తాను అన్న పోలవరం, అమరావతి ఎక్కడ ?
తితిలి తుఫాను బాధితులకు ఇస్తానన్నా నష్ట పరిహారం ఎక్కడ ? బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానన్న 50 రోజుల పర్యటన ఎక్కడ ? ప్రతి సంవత్సరం జనవరిలో విడుదల చేస్తాను అన్న ఉద్యోగ క్యాలెండర్ ఎక్కడ?
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తీస్తానన్న మెగా డీఎస్సీ ఎక్కడ ? రైతులకు వేయిస్తాను అన్న ఉచిత బోర్లు ఎక్కడ ? అన్నా క్యాంటీన్ల అవినీతిని బయట పెట్టి 3 నెలల్లో ప్రారంభిస్తాను అన్న రాజన్న క్యాంటీన్ ఎక్కడ ?
ప్రతిపక్షంలో ప్రచారం చేసిన చంద్రబాబు పై ఆరు లక్షల కోట్ల అవినీతి ఎక్కడ ? అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి సంవత్సరమే ఇస్తాను అన్న 1150 కోట్లు ఎక్కడ ? కరోనా బాధితులకు ఇస్తాను అన్న 2000 సహాయం ఎక్కడ ? మరణించిన వారి అంత్యక్రియలకు ఇస్తాను అన్న 15000 ఎక్కడ ?
ప్రతిపక్షంలో ఉండగా అమరావతి, పోలవరంలో టీడీపీ చేసింది అన్న అవినీతి ఎక్కడ ? నాడు చంద్రబాబే కొట్టేశాడు ఆయన ఇంట్లోనే ఉంది అన్న పింక్ డైమండ్ ఎక్కడ ?
లోకేష్ బినామీ అన్న శేఖర్ రెడ్డి ఎక్కడ ? మీ తండ్రిని చంపాడు అన్న రిలయన్స్ అధినేత ఎక్కడ ?
25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి సాధిస్తాను అన్న ప్రత్యేక హోదా ఎక్కడ ? రైతుల కోసం ఏర్పాటు చేస్తాను అన్న 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ ?
ప్రతి పడిరైతుకు లీటరు పాలకు అదనంగా ఇస్తాను అన్న 4 రూపాయలు ఎక్కడ ?
ప్రతిపక్షం నుంచి వచ్చే వారిని రాజీనామా చేయించి తీసుకుంటాను అన్న హామీ ఎక్కడ ?
ప్రమాదాల వల్ల మరణించిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నాడు డిమాండ్ చేసిన కోటి రూపాయల పరిహారం ఎక్కడ ?
తెలంగాణ సీఎం కెసిఆర్ తో కలిసి సాధిస్తాను అన్న ప్రత్యేక హోదా ఎక్కడ ? సొంత బాబాయ్ హత్య కేసులో నాడు సీబీఐని డిమాండ్ చేసి దోషులను పట్టుకోవాలన్న ప్రతిపాదన ఎక్కడ ? చంద్రబాబు ఇచ్చాడు అన్న 35 మంది కమ్మ డిఎస్పీల పేర్లు ఎక్కడ ? నాడు పట్టిసీమ ప్రాజెక్టులో జరిగింది అన్న 100 కోట్ల అవినీతి ఎక్కడ ?
లోకేష్ చేశాడో అన్న ఫైబర్ గ్రిడ్ అవినీతి ఎక్కడ ? శాసన మండలికి డబ్బులు వృధా అని రద్దు చేస్తాను అన్న మాట ఎక్కడ ?
ఇంకా చాలా ఉన్నాయి…
– శ్రీనివాస్ నాయుడు