రాజన్నా..
నాడు నీ ఆరోగ్యశ్రీ…
నేడేమో అనారోగ్యం ఫ్రీ..!
ఒకనాటి ఉచిత విద్యుత్తు
అది నీ విద్వత్తు..
ఇప్పుడు ఇంటి ఖర్చు మొత్తం
ఒక ఎత్తు..
విద్యుత్తు ఒక ఎత్తు..
జనాలు చిత్తు..!
నాడు నువ్వు కొన్నే ఉచితం
ఇప్పుడు అవసరాన్ని
మించి ఉచితం…
నీ కొడుకు చిత్తం..
ఎన్ని ఉచితాలున్నా
చెత్తకి మాత్రం పన్ను…
సచివాలయానికి అదే దన్ను!
నాడు అభివృద్ధి కోసం అప్పు
ఇప్పుడేమో పంపిణీ
కోసం రుణం..
తీర్చే దారి..దరీ
కనబడని దారుణం..!
ప్రభుత్వ ఆస్తులు తాకట్టు..
ముందెన్నడూ చూడని కనికట్టు..!!
నాడు అడాళ్లకు పెత్తనం..
ఉడుక్కుంది మగతనం..
అందుకే అమ్మ ఒడి…
పెంచుతుంది మద్యం రాబడి!
ఉన్నదీ..ఉంచుకున్నదీ..
దాచుకున్నదీ ఇచ్చేస్తాడు మొగుడు..మగాడనే అహంకారి..
సర్కారీ అబ్కారీకి..!
రాజన్నా..
మరి నీ కొడుక్కి
వాడేగా ముద్దుల కొడుకు..
ముద్దులిచ్చి మరీ చంకనెక్కాడు..
అభివృద్ధి పాడెనెక్కించాడు!
నీదేమో పాదయాత్ర..
ఇప్పుడేమో అమాసకో..పున్నానికో
ఘోషయాత్ర..
పరిస్థితి చేదుమాత్ర..!
ముందేమో..
ఉన్నాను..విన్నాను..
ఇప్పుడేమో..
ఉన్నాను..ఉంటాను..
కాని వినను..!
ఈఎస్కే..!