సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ తీస్తున్న లేటెస్ట్ మూవీకి గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. హైలీ ఇన్ ఫ్లేమబుల్ అనేది ఉప శీర్షిక. మహేష్ బాబు మాస్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ మూవీ మోసగాళ్లకు మోసగాడు నేడు రీ రిలీజ్ సందర్భంగా పలు థియేటర్స్ లో టైటిల్ తో పాటు ఫస్ట్ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసారు.
ఇక ఈ మాస్ స్ట్రైక్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తలకి స్కార్ప్ కట్టుకుని ఊర మాస్ స్టైల్ లో ఫైట్ చేస్తున్న సీన్స్ ని చూడవచ్చు. మహేష్ బాబు లుక్స్, స్టైల్, స్వాగ్ తో పాటు గ్లింప్స్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో అదిరిపోయాయి. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని 2024 జనవరి 13న గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నారు మేకర్స్.