Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో భారీ పర్యాటక ప్రాజెక్టులు.. ఎస్‌ఐపీబీ ఆమోదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులపై బోర్డు సమావేశంలో చర్చించారు. పలు ప్రతిపాదనలకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయని, వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2,868.60 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్‌ఐపీబీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,564 గదులు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. రానున్న ఐదేళ్లలో 1,564 గదులను పూర్తి చేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
సీఎం జగన్‌ మాట్లాడుతూ ‘‘పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా మారాలన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక ప్రాజెక్టులు ఉండాలని.. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని వెల్లడించారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా మెరుగైన అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశాఖలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడంపై దృష్టి పెట్టాలన్నారు.
ఆమోదం పొందిన ప్రాజెక్టులివే
ఒబెరాయ్‌ విల్లాస్‌ బ్రాండ్‌ పేరుతో రిసార్టులకు ఆమోదం. దీనిలో భాగంగా విశాఖ, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్‌, పిచ్చుకలంకలో రిసార్టులు నిర్మించనున్నారు.
విశాఖ శిల్పారామంలో నిర్మాణాలకు ఆమోదం.
హయత్‌ ఆధ్వర్యంలో స్టార్‌ హటల్స్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణాలకు ఆమోదం.
తాజ్‌ వరుణ్‌ బీచ్‌ పేరుతో విశాఖలో హోటల్‌, అపార్ట్‌మెంట్‌కు ఆమోదం.
విశాఖ టన్నెల్‌ అక్వేరియం స్కైటవర్‌ నిర్మాణానికి ఆమోదం. విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హోటల్‌ నిర్మాణానికి ఆమోదం. పెరుగొండ ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం

LEAVE A RESPONSE