విజయవాడ ఆదాయపు పన్ను కమీషనర్ గా మేకతోటి దయాసాగర్

విజయవాడ ఆదాయపు పన్ను కమీషనర్ (టి.డి.యస్) గా మేకతోటి దయాసాగర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. 1992 IRS బ్యాచ్ కు చెందిన దయాసాగర్ గారు గతంలో ముంబై, హైదరాబాద్ లలో ఇన్కమ్ టాక్స్ కమీషనర్ గా పనిచేశారు. నేడు విజయవాడలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు మరియు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో విజయవాడ JCIT TDS వినోద్ కన్నన్, విశాఖపట్నం JCIT TDS శంకర్, విశాఖపట్నం DCIT చింతపల్లి మెహర్ చాంద్, విజయవాడ ITO HQRS దుర్గాభవాని లు మేకతోటి దయాసాగర్ గారికి ఘనస్వాగతం పలికారు. ఆదాయపుపన్ను కమీషనర్(టి.డి.స్)గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిధి అంతటా ప్రభుత్వ ప్రాధాన్యతలైన టి. డి. యస్, పన్నుదారుల సేవలు మరియు ఫిర్యాదు రహిత పరిపాలనలే ధ్యేయం గా మెరుగైన సేవలు అందిస్తామని మేకతోటి దయాసాగర్ గారు స్పష్టంచేశారు.