Suryaa.co.in

Food & Health

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాకం….భయంకరమైన నిజాలు!

చిన్న పట్టణాలలో, ఆఖరుకు గ్రామాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన, మన ఆరోగ్యానికి కలిగే భయంకర ప్రభావం ఏంటో ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిన దినేష్ మాటల్లోనే విందాం….దినేష్ అనే వ్యక్తి తన మాటలతో నిజాలను చెప్పి ….తను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరెవరూ పోగొట్టుకోకూడదని భావించి తాను చేసిన తప్పిదాలను మనకు తెలియజేశారు.
దినేష్ అనే వ్యక్తి .ఫాస్ట్ ఫుడ్డు సెంటర్ నిర్వహించిన ఓ యజమాని…….5 నిమిషాలలో 400 రూ; సంపాదించేవాడు.. తనకు జరిగిన ఓ సంఘటననే, అతని నోటివెంట నిజాలను చెప్పించింది. తాను చేసిన ఆహారాన్ని తానే తిని చాలా అనారోగ్యంతో ఇలా చెప్పాడు. అతను చెప్పిన నిజాలు ఇవి…….
ఫాస్ట్ ఫుడ్డు షాపులో వాడే చికెను తాజా అయినది కాదు. నిన్నటిది……మొన్నటిది……..ఒక్కోసారి ఒకవారం క్రితంవి కూడా వాడుతాము. చెడిపోయిన చికెనును వెనిగర్ లో ముంచి వాటి వాసన కస్టమర్లకు తెలియకుండా చేస్తాము.
చికెన్ రైస్ చేసేటప్పుడు చెడిపోయి తెల్లగా మారిన చికెనుకు, ఆరెంజ్ కలరును వాడి రంగును మారుస్తాము. ఆ కలరును మీ చేతిలో వేసుకుని ఒక నిమిషం తరువాత కడిగితే, ఆ కలరు వారం రోజులవరకు పోదు.అలాంటి కలరు మీ కడుపులోకి పోతే……..సోయా సాస్ .రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు కానీ,,,,,,,10 రోజుల క్రితం కాగి కాగి మరిగిన నూనెతో కలిపి వాడుతాము.ఏ షాపులోనూ మంచి నూనె వాడరు.పామాయిలు తప్ప ఏదీ వాడరు.కళాయిలో అన్నం అంటుకుపోకుండా,ఎక్కువగా పామాయిల్ వాడి, తొందరగా,లేటు లేకుండా పదార్థాన్ని కస్టమర్లకు అందిస్తాము.
చెబితే నమ్మరు…..ఆ కళాయిలను రోజుల తరబడి కడగనే కడగము. నూనె జిడ్డు పోయి మళ్ళీ లేటు అయితే, పక్క షాపుకు వెళ్ళిపోతారని.అజినోమోటో… అన్న పదార్థం ఎక్కువగా వాడకూడదు. మేము దాన్ని చాలా ఎక్కువగా వాడుతాము.మీరు ఒక్కసారి దాన్ని మీ నాలుక మీద పెట్టుకుని చూడండి మీకే తెలుస్తుంది.తెల్ల మిరియాలపొడిలో చేతికి దొరికిన పిండిని కలిపి వాడుతాము. ఆ పిండిలో పురుగులు కూడా ఉంటాయి.టొమాటో సాస్.. ఎక్కువ మోతాదులలో కొనిపారేస్తాము. అందువల్ల అవి చెడిపోయినా exp.date అయిన వాటిని కూడా వాడేస్తాము.చిల్లీ సాస్ …..వాడుతున్న బాటిలును మీ ముక్కుదగ్గర పెట్టుకుని చూడండి. ఆ వాసనకు మీకు వాంతులు రాక మానవు.
నిమిషాలలో 8 ప్లేట్లు అందిస్తాము. ఒక్కొక్క ప్లేటు 50 రూ అంటే 5 నిమిషాలలో 400 సంపాదించేవాడిని. కానీ డబ్బు సంపాదిస్తున్నాను అనుకున్నానే కానీ, నేను నా పిల్లలు కూడా అవి తిని చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాము. చేసిన తప్పును చెప్పుకుని మీలో కొంతమందిలో అయినా మార్పు రావాలని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ తప్పుకు శిక్ష అనుభవిస్తూ 8,000 జీతానికి , ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటరును మూసేసి ఇలా నిజాలను మనకు చెప్పి… కనీసం మనలో కొందరైనా ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని మనసారా కోరుకుంటోంది.

LEAVE A RESPONSE