మా ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో విష్ణు , ప్రకాష్ రాజ్ ల మధ్య మాటల యుద్ధమే కాదు అధికారులకు ఫిర్యాదుల వరకు వెళ్లింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయగా.. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. దీంతో మా లొల్లి మరో మలుపు తిరిగింది. ఈ క్రమంలో మంచు విష్ణు ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పటు చేసి ప్రకాష్ రాజ్ , జీవిత రాజశేఖర్ ల ఫై పలు విమర్శలు చేసారు.
ప్రకాష్ రాజ్ కు ఎవరైనా బీపీ మాత్రలు ఇస్తే బాగుంటుంది. అపరిచితుడుగా ప్రవర్తిస్తున్నాడు.. చిన్న చిన్న విషయాలకు ‘మా’ పరువు తీస్తున్నాడు. ఆయన రియల్ లైఫ్ లో కూడా యాక్ట్ చేస్తారు. ప్రకాష్ రాజ్ విషయం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడతాడు. పెద్దలకు గౌరవం ఇవ్వలేని వాడు ఏమి చేస్తాడు..? కృష్ణ, కృష్ణంరాజు నీ ప్రకాశ్ రాజ్ అవమానిస్తారా..? తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ లో ప్రకాష్ రాజ్ గురించి ఎవరినడిగినా చెపుతారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడేది చాలా తప్పు.. ఓటు అడిగే హక్కు నాకుంది నేను రైట్ వే లో వున్నాను. ఇక్కడ ‘మా’ ఇల్లు నీ పాడు చేసేందుకు కంకణం కట్టుకున్నాడు’ అని మంచు విష్ణు ఎద్దేవా చేశారు.
‘జీవిత గారు మీరు చెప్పేది కరెక్ట్ గా చెప్పండి.. నాలుగు రోజులు ముందు రాజశేఖర్ గారు వచ్చి మోహన్ బాబు గారితో ఏమి చెప్పారో మీకు తెలీదు. ఉమ్మడి కుటుంబంలో కొన్ని సమస్యలు వుంటాయి వాటిని రోడ్డు మీదకు తీసుకురావద్దు. నా గురించి మాట్లాడండి, కానీ నా ఫ్యామిలీ గురించి మాట్లాడవద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ‘మా’ ఫ్యామిలీనీ విడగొట్టొద్దు ఇది ‘మా’ ఫ్యామిలీ మన ఫ్యామిలీ.. జీవిత గారు నా ఫాదర్ నేమ్ నీ సంబోధించవద్దు.. శ్రీహరి గారు వుంటే ఈ రోజు వేరేలా ఉండేది. నాకు నా తండ్రి సపోర్ట్ వుంది’ అంటూ విష్ణు జీవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.