విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ వీక్షణ ఆంధ్రప్రదేశ్ లో అయిదువేల ప్రాంతాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ లక్ష్యంగా చేసుకుని మన్ కీ బాత్ వీక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, మట్టా ప్రసాద్, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్నలో ఆధ్వర్యంలో జోన్ ల వారిగా పర్యవేక్షణ చేయడంతో అన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో మన్ కీ బాత్ వీక్షణ లు విద్యా ప్రాంగణాల్లో ఏర్పాటు చేశారు.