Suryaa.co.in

Political News

ప్రతీకారం పలురకాలు..

ఆయన వాళ్ళ యంపీ..
ఎక్కడో తేడా వచ్చింది..
యంపీ గారిని చిన్న బుచ్చారు..

ఆయన ఎంత ఒదిగి ఉందామన్నా కుదరలేదు..బాగా ఎత్తు కదా!
కాస్త కురచగా ఉన్నా..బుద్దులు కురచగా ఉన్నా అతి వినయం బాగా పండుతుంది.
రాజుగారు …అతివినయ విధేయత పాత్ర పోషించలేకపోయారు.

ఆయన పలుకుబడి వారి పంటికింద రాయి మాదిరి అయింది.
పక్కకు జరపాలని చూసారు..
భారీ విగ్రహం కదా కదపలేకపోయారు.

ఆయన కూడా గొంతు విప్పారు..
మెల్లగా స్వరం గరం గరం గా మారింది..
ఆ స్వరకరవాలం చీల్చటం మొదలెట్టింది..

అటు మాటల దాడి పెంచారు..
అక్రమ కేసులు ..
తీసుకెళ్ళి దాడిచేసి హింసించేవరకు వెళ్ళారు..
పైశాచికం పగలబడి నవ్వుకుంది..!
అక్కడ నుండి అసలు సినిమా ప్రారంభమైంది..

మెడ మీది కేసుల కత్తి ఊగిసలాడటం మొదలయింది.
కాదు..! రాజుగారే కదుపుతున్నారు..

వీలు కుదిరినప్పుడల్లా..లోపలకు పంపే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
చేస్తున్నట్టు తెలిసే లా నిశ్చలన చిత్రాలు విడుదల చేస్తున్నారు కూడా..

అసలే జైలు బెంగ..దానికి తోడు ఈయన ప్రయత్నాలు..
గుండెల్లో గుబులు పెరుగుతుంది.

పాలన ..తప్పులు మీద తప్పులు..ప్రజల్లో వ్యతిరేకత..
ఇన్నాళ్ళూ అండగా నిలిచిన అనకొండలు ఎప్పుడు మింగేస్తాయో తెలియదు.

ఒక్కసారి తీసుకెళ్ళి ..కొట్టి సంతోషపడినా ..అది ఒక రోజు కుశాలు అంతే!
ఈయన మాత్రం ..నిత్యం రంపపు కోత కోస్తున్నారు.
తిరుపతి రైతుల సభకు వచ్చారు..!

రాజు వెడెల రవితేజములదరగ..! అన్నట్టు..!
వచ్చి ఊరుకున్నారా?
ఎవరి పేరైతే నిత్యం స్మరిస్తారో..ఎవరి పొడ అసలు గిట్టదో..
ఎవరిని అణచివేయాలనుకున్నారో…
ఆయన్ని ఆలింగనం చేసుకుని..సవాలు విసిరారు..

ఒక చిన్న నవ్వు నవ్వారు కూడా..ఆయనకు కనిపించాలని..

వారాంతంలో కోర్టు విచారణ..వాయిదాలకు హాజరు టెన్షన్ లో ఒకరు ..
సాకులు వెతుకులాట ..అదో పెద్ద పెంట..

రాజుగారు మాత్రం వారాంతంలో ..కేంద్రమంత్రులతో ములాఖత్ లు..
దర్శనీయ స్ధలాల సందర్శనం..కుటుంబంతో సహా..

చివరకి పెరట్లో ..దృశ్యాలు కూడా విడుదల చేస్తున్నారు.
ఎంత కులాసా గా ఉన్నానో…
ఎంత ఖుషీగా ఉన్నానో..
చూడు ..అన్నట్టు..!

ఇది అన్యాయం కదా?
పుండు మీద కారం చల్లినట్టు కాదా?
ప్రతీకారం ఇలా కూడా తీర్చుకోవచ్చని ఇప్పుడే తెలుస్తుంది.

ఒక్క లాఠీ విరగదు..
ఒక్క రక్తం చుక్క కారదు..
కాని ఒళ్ళు మండిపోతుంది..
మనసు పచ్చి పుండయిపోతుంది..

వాటే ..టార్చర్?

అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE