Suryaa.co.in

National

ఛత్తీస్‌గఢ్‌లో బయటపడ్డ మావోయిస్టుల సొరంగం

ఛత్తీస్‌గఢ్‌: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హతమార్చేశాయి. ఈ క్రమంలోనే మావోయిస్టుల సొరంగం ఒకటి బయటపడింది. తాలిపేరు నది సమీపంలో భారీబంకర్‌ను గుర్తించాయి భద్రతా బలగాలు. సొరంగంలో సకల వసతులు ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు. దేశవాళి రాకెట్‌ లాంచర్లు తయారుచేసే ఫౌండ్రీమిషన్‌, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

విద్యుత్‌ లైన్‌ నిర్మించే సిల్వర్‌ వైర్‌, ఇతర ఆయుధాలను సైతం గుర్తించారు. విధ్వంసం కోసం వాడే బాంబులను మావోయిస్టులు ఈ సొరంగంలోనే తయారు చేసుకుంటున్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. తుమిరెల్లి ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ భారీ సొరంగాన్ని గుర్తించాయి.

ఈ చర్యతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలినట్లైంది. ఇదిలాఉండగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా బలగాలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్క జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు నక్సలైట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

LEAVE A RESPONSE