– సూట్ కేస్ కంపెనీల సృష్టి, క్విడ్ ప్రోకో విధానాల మేథస్సు రాష్ట్రరైతాంగానికి శాపంగా మారింది
• వర్షాలు, వరదలకు పంటలుదెబ్బతిన్నా..తెగుళ్లు వైరస్ లువచ్చి నష్టపోయినా, రూ.7వేలిస్తాం, వాటితో బతకండి,లేకుంటే చావండి అన్నట్లుగా ప్రభుత్వం రైతాంగంవిషయంలో వ్యవహరిస్తోంది
• గోదావరి జిల్లాల్లో వర్షాలకు తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం కొనేస్థితిలోలేదు
• ఈ క్రాపింగ్, ఈప్రొక్యూర్ మెంట్ అంటూ సాయం చేయాల్సినవారే, రైతులతో ఆడుకుంటున్నారు
• విజయనగరం జిల్లాలోని చెరకురైతులకు ఇచ్చిన సీఆర్ పీసీ నోటీసులను తక్షణమే ఉససంహరించుకోవాలని తెలుగురైతు విభాగం తరుపున డిమాండ్ చేస్తున్నాం
• రాష్ట్రవ్యాప్తంగా నల్లి, తామర వ్యాప్తితో దారుణంగా దెబ్బతిన్ని మిరపరైతుల ముఖాలుకూడా ఈ ప్రభుత్వం చూడలేదు
తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
విచిత్రమైన పరిస్థితులు, వింతపోకడలు, అసత్యాలు, అబద్ధాలు, అర్థసత్యాలపై ఆధారపడిన రాష్ట్రప్రభుత్వం, కావాలనే ప్రజలకుసంబంధంలేని, వారికి ఎంతమాత్రం సమ్మతంకాని విష యాల్లో తలదూరుస్తోందని, టీడీపీనేత, తెలుగురైతు రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
రాష్ట్రరైతాంగం పడుతున్న ఇబ్బందులు, వ్యవసాయరంగంలోని సమస్యలను పరిష్కరించాల్సి న ప్రభుత్వం, పాలకులు తమకు సంబంధంలేని అంశాలను భుజాలపై వేసుకుంటున్నారు.విజయనగరం జిల్లా సీతానగరంలోని నారాయణంచలమయ్య అండ్ సన్స్ (ఎన్ సీఎస్) చక్కె ర కర్మాగారంలో, గతమూడేళ్లనుంచి యాజమాన్యం సరైన పద్ధతుల్లో నడవకుండా, స్థానికప్రాంతాల్లోని చెరకురైతులకు రూ.16.33కోట్లవరకు బకాయిపడింది. ఆ బకాయిలు చెల్లించమన్నరైతులపైకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో దమనకాండకు పాల్పడింది . రైతులబకాయిలు ఎగ్గొట్టిన యాజమాన్యానికి వత్తాసుపలుకుతూ, ఈ ప్రభుత్వం అన్నదాత లకు సీఆర్ పీసీ నోటీసులివ్వడం నిజంగా బాధాకరం.
దగ్గరదగ్గర 80రైతులకు సీఆర్ పీసీ నోటిసులిచ్చిన పోలీసులు వారంతా పోలీస్ స్టేషన్లకు వస్తే, వారికి కౌన్సిలింగ్ ఇస్తామంటూ పరోక్షబెదిరింపులకుపాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నియంత్రత్వానికి వ్యతిరేకంగా అక్ష రాలే తూటాలుగా మార్చి పేలుస్తున్నాడన్న ఒకేఒకకారణంతో, స్నేహితుడిని పరామర్శించ డానికి వెళ్లిన ఏబీఎన్ అంధ్రజ్యోతి ఎండీపై తప్పుడు కేసులుపెట్టారు. మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ కుటుంబీకులు, ఆయన్ని విచారిస్తున్న అధికారులు రాధాకృష్ణ తప్పేమీ లేదని చెబుతున్నాకూడా ఈప్రభుత్వం కావాలనే తనకు సంబంధంలేని అసంబద్ధ విషయాలపై ఎక్కువగా మొగ్గుచూపుతోంది.
రాష్ట్రంలోని రైతాంగం అనేక ఇబ్బందులుపడుతోంది. గోదావరి జిల్లాల్లో వరిపైరు అంతా వర్షానికి దెబ్బతిని, ధాన్యం రంగుమారి, కొనేవారులేక ఆప్రాంత అన్నదాతలు లబోదిబోమం టున్నారు. మరోపక్క బకాయిలు అడిగారన్న అక్కసుతో చెరకురైతులకుసీఆర్ పీసీ నోటీసు లిచ్చారు. ఇలాంటి ప్రభుత్వదుర్మార్గాలు ప్రజల్లో చర్చకురాకూడదనే ప్రభుత్వం మీడియా యాజమాన్యాలపై తప్పుడుకేసులుపెట్టడం. రైతులకు
కష్టమొచ్చినప్పుడువారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఈక్రాప్ పేరుతో తప్పించుకుంటోంది.ఈక్రాప్ లో పంటలవివరాలు నమోదైనా కూడాచాలాప్రాంతాల్లో ఈప్రొక్యూర్ మెంట్ లో భూములసర్వే నంబర్లు కనిపించని పరిస్థితిచూస్తున్నాం. ఈ క్రాప్ లో నమోదైన సర్వేనంబర్లు ఈ ప్రొక్యూర్ మెంట్ లో కనిపించక పోవడానికి ప్రధానకారణం జగన్మోహన్ రెడ్డి మోసకారీ సంక్షమమే. ప్రజలను, మరీ ముఖ్యం గా రైతులను కన్నతండ్రిలా ఆదుకోవాల్సిన ప్రభుత్వాధినేత మోసపుమాటలతో, అబద్ధాలతో పబ్బంగడుపుకుంటూ తప్పించుకుంటున్నాడు.
గోదావరిజిల్లాల్లోని చాలా ఆర్బీకేల్లో (రైతు భరోసాకేంద్రాలు) పంటలకు సంబంధించిన సర్వేనంబర్లు ఈప్రొక్యూర్ మెంట్ లో కనిపించడం లేదు. దానికి బాధ్యతవహించాల్సింది ఈప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలకు రైతులను బలితీసుకుంటారా? రైతులధాన్యాన్ని కొనకుండా, దాన్నుంచి తప్పించుకునే చర్య లకు ప్రభుత్వం తక్షణమే స్వస్తిపలికి, తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రకటించిన మధ్ధతు ధరప్రకారం ప్రభుత్వమే కొనాలని తెలుగురైతు విభాగంనుంచి డిమాండ్ చేస్తున్నాం.
ఈ క్రాప్ నమోదు అయినా, కాకున్నా ఈ ప్రొక్యూర్ మెంట్ లోపంటభూముల సర్వేనంబర్లు లేకున్నా, గ్రామాల్లోని వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి, ప్రభుత్వం తక్షణమే వర్షాలకు తడిచిన, రంగుమారిన, ముక్కిపోయిన ధాన్యాన్ని కొనాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం.
గోదావరి జిల్లాల్లో వరితోపాటు అనేకప్రాంతాల్లో చెరకు, పసుపు, అపరాలు, వాణిజ్యపంటలు, మిరప, పత్తి పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు ఈప్రభుత్వం ఇన్ పుట్ సబ్సీడిఇస్తుందో… లేదోనన్న సందిగ్ధంలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. పంటలుదెబ్బ తిన్నా రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ, పంటలబీమా తాలూకా పరిహారం అందేపరిస్థితి ఈ ప్రభుత్వంలోకనిపించడంలేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరే. పంటలబీమా తాలూకూరైతులతరుపున ప్రభుత్వంచెల్లించాల్సిన సొమ్ముని జగన్మోహ న్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. దానివల్ల రాష్ట్రంలోని రైతులకు ఎక్కడా రూపాయి పరిహారం అందని దుస్థితి.
ప్రకృతి వైఫల్యాలకు తోడు, మానవతప్పిదాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బాధ్యతలేని తనం రాష్ట్రరైతాంగాన్ని నిలువునా ముంచేశాయి. రాష్ట్రంలో ప్రధానమైన వాణిజ్య పంట మిరప, ఆ పైరుకి నల్లి, తామరవంటివి వ్యాపించి మిర్చిరైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడచూసినా పంటనిలువునా ఎండిపోతోంది. దానికికారణమేంటని అడిగేనాథుడు ఈ ప్రభుత్వంలో ఎవరూకనిపించడంలేదు. మిర్చిరైతులవద్దకువెళ్లి ఏంజరిగింది..ఎంతపంట నష్టం జరిగిందని అధికారులుగానీ, ప్రభుత్వపెద్దలు గానీ అడిగిందిలేదు.
నల్లి , తామర వ్యాప్తికిగలకారణాలేమిటి… దాన్ని నిరోధించడానికి ఎలాంటి పురుగుమందులు వాడాలనే దిశగా వ్యవసాయశాఖ ఆలోచనచేయడంలేదు. ప్రకృతివైపరీత్యాలను ప్రకృతిపై నెట్టేసి చేతులుదులుపుకున్న ప్రభుత్వం, వ్యవసాయశాఖ యంత్రాంగం మిర్చిపైరు నాశనానికి కార ణమైన తెగులు, నల్లిని ఎవరితప్పిదంగా చూపిస్తుంది? దానివ్యాప్తికి కారణమేంటో, రైతులు ఎందుకింతలా నష్టపోయారు..నష్టపోయిన వారికి ఎంతసాయం చేయాలనే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నాం.
పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం తో, సాక్షిపత్రికలో ఫుల్ పేజీ ప్రకటనలతో ప్రారంభమైన వైఎస్సార్ జలకళ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.? వైఎస్సార్ జలకళ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా లక్షా95వేలమంది రైతులు అర్జీలుపెట్టుకుంటే, లక్షా54వేలమందిని అర్హులుగా ఆమోదించారు. వారిలో 36వేలమంది రైతులభూముల్లో జియాలజిస్టులు సర్వేచేసి, నీరుంద ని తేల్చారు.వాటిలో 8వేలవరకు బోర్లు వేశారు. కానీ ఆ8వేలమందిలో ఒక్కరికీ ఈ ప్రభుత్వం రూపాయిఇవ్వలేదు. బోరుబళ్లవాళ్లు రాష్ట్రంవదిలిపెట్టి వెళ్లిపోయారు. రైతులను ఆదుకోవడా నికి తామే బోర్లు వేయిస్తాము… మోటార్లు బిగిస్తామని.. విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని ముఖ్య మంత్రి ఊదరగొట్టారు.
వైఎస్సార్ జలకళ పథకం ఆరంభించి దాదాపు సంవత్సరంన్నర కావస్తోంది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నిబోర్లువేసి, ఎందరురైతులకు మోటార్లు, విద్యుత్ కనె క్షన్లు ఇచ్చిందో చెప్పాలి. ఈ విధంగా అంతా మోసం..అబద్ధమే. సూట్ కేస్ కంపెనీలసృష్టికి, క్విడ్ ప్రోకో అమలుకి వాడిన మేథస్సుతో నిత్యం రైతులను మోసగిస్తున్నారు. రైతులు స్వచ్ఛందంగా తమకుతామే బోర్లు వేయించుకొని విద్యుత్ కనెక్షన్లకోసం అధికారులచుట్టూ తిరుగుతున్నా, ఒక్కరైతుకికూడా ఈప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ ఇచ్చినదాఖాలాలు లేవు.
తాముపంటలు వేసుకొని, ఎంతోకొంతమందికి ఉపాధికల్పించి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేస్తాము.. దయచేసి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి అంటున్నాఈ ప్రభుత్వంలో చలనం లేదు. తాము రూ.7వేలుఇస్తాము..అడుక్కుతినండి అన్నట్లుగా రైతులువిషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆఖరికి బకాయిలు అడిగినపాపానికి నారాయణంచలమయ్య అండ్ సన్స్ చెరకుఫ్యాక్టరీ రైతాంగంపైకి పోలీసులను ఉసిగొల్పుతారా? సదరు చెరకు ఫ్యాక్టరీ బకాయిలుఉన్న రైతులకు ఈ ప్రభుత్వం జారీచేసిన సీఆర్ పీసీ నోటీసులను తక్షణమే ఉపసంహరించుకొని, నోటీసులిచ్చిన రైతులందరికీ బహిరంగక్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.