ఆంగ్లంలో అప్సరస
అనే పదముంటే..
దేవతలే ఆ మాట వింటే..
ఈ భూలోకపు
అప్సరసను గాంచి
సిగ్గుతో తలదించుకోరా..
నోళ్ళెళ్ళబెట్టి అనరా ఔరా!
మార్లిన్ మన్రో..
ఆమె జీవితమంతా సారో..
అందంతో..అభినయంతో
జగతిని ఏలిన సుందరి..
సౌందర్య ఝరి..
మత్తెక్కించే ఆవిరి..
పగలే వెన్నెల సిరి..!
ఆమె..’సం లైకిట్ హాట్’..
అంటే జనాలకి
ఎంత దిగులైనా హాంఫట్..
‘హౌ టు మ్యారీ
ఎ మిలియనీర్’..
సినిమా పేరదే గాని
సిరి కోసం..మగసిరి కోసం గాక స్వాంతన వెతుక్కుంటూ
చేసుకుంది పెళ్లి మీద పెళ్లి
ప్రతి వివాహము వివాదమై
కలల రాణి కలలే కల్లలై
బ్రతుకే విషాదమై..!
డాడీ ఎవరో తెలియని
జీవితం కెనడీ వరకు చేరింది
‘లెట్స్ మేక్ లవ్’ ఆంటూ
ఎందరితోనో మన్రో మనువు
అందరూ ‘మిస్ ఫిట్స్’ అయి
విరిచేశారు ఆమె మనసు!
పరాజయంలో వేదాంతం వెతుక్కోలేని అందం
జీవితాన్ని విషాదాంతం
వైపు నడిపింది..!
తన జీవితం హిస్టరీ..
మరణమేమో మిస్టరీ..
ప్రపంచాన్ని దాసోహం
చేసుకున్న సొగసరి
సొగసైన సిరి..
ఎంత బాధలో వదిలిందో
చివరి ఊపిరి..
తప్పులు చేస్తూ
మృత్యువును
స్వాగతించింది ఏరికోరి!
హాలీవుడ్ కి 200 మిలియన్ల
అఖండ రాబడి…
పేరు వింటేనే అభిమానులు
పడిచచ్చే పలుకుబడి..
తరిగిపోని సంపద..
కరిగిపోని కీర్తి..
ఆమ్మడి దుస్తులే కోట్లలో
అమ్ముడిపోయే క్రేజ్..
చిన్న ఏజ్..
ఏవీ వెంటరాని ప్రయాణంలో
ఒంటరి జీవితాన్ని
అధాటున ముగించిన
మార్లిన్ వెళ్ళిపోయింది ఎటో
మిగిలింది ఐన్ స్టీన్ ఫోటో..
దానిపై అంతటి
శాస్త్రవేత్త ఆటోగ్రాఫ్..
ఆ గురుతుతో మరింత సుసంపన్నం
మన్రో బయోగ్రాఫ్..!
-సురేష్ కుమార్
9949546286