– రైతు భరోసాకేంద్రాలతో రైతాంగాన్నిఉద్ధరిస్తున్నామంటున్న జగన్ రెడ్డి వ్యాఖ్యలపై బహిరంగచర్చకు సిద్ధం
• మూడేళ్లపాలనలో జగన్మోసపురెడ్డి రాష్ట్రరైతాంగానికి అబద్ధాలు, మోసం, దగాలనే కానుకగా ఇచ్చాడు
• పంటలబీమా, ఇన్ పుట్ సబ్సిడీ, ధరలస్థిరీకరణ నిధి.. ధాన్యంకొనుగోళ్ల తాలూకా బకాయిలు ఏవీ రైతులకు ఇవ్వని జగన్మోసపురెడ్డి, రైతులను ఉద్ధరించానంటూ అసెంబ్లీలో కట్టుకథ చెప్పాడు
– తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
రైతుద్రోహి జగన్మోసపురెడ్డి ప్రభుత్వం అధికారంలోకివచ్చినప్పటినుంచీ, ఇప్పటివరకు రైతులకుచేసిన సాయంపై నిండుఅసెంబ్లీలో పచ్చిఅబద్ధాలుచెప్పిన జగన్ రెడ్డి, గంటలతరబ డి సభాసమయాన్ని, ప్రజలసొమ్ముని దుర్వినియోగంచేశాడని, పచ్చిఅబద్ధాలతోకూడిన వంటకాలనేవండివార్చి ప్రజలముందుఉంచడానికి ప్రయత్నించాడని టీడీపీ నేత, తెలుగు రైతువిభాగం రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
ముఖ్యమంత్రికి తానేమీ తీసిపోమన్నట్టుగా వ్యవసాయమంత్రి కురసాలకన్నబాబు, పౌరసర ఫరాలశాఖామంత్రి కొడాలినానీ కూడా అసెంబ్లీలో అబద్ధాలపంచాంగాన్నే వల్లేవేశారు. 2019 రైతుదినోత్సవం పేరుతో రైతుదగా దినోత్సవాన్నిజగన్ రెడ్డి నిర్వహించాడు. తాను ముఖ్యమంత్ర్రి అయ్యాక 2019జూలై 8 నుంచినేటివరకు రైతులగురించి, వారికిచేసిన, చేస్తున్నామని జగన్మోసపురెడ్డి చెబుతున్న సాయంఅంతా అభూతకల్పనే.
టీడీపీ హయాం లో రైతులుఅకాలవర్సాలు, తుఫాన్లదెబ్బకు పంటలుకోల్పోతే, నాడు ముఖ్యమంత్రిగాఉన్న చంద్రబాబునాయుడి గారిచొరవతో కేంద్రబృందం పంటనష్టం అంచనాలను రూ.970కోట్లుగా నిర్థారించి, 900కోట్ల46లక్షలవరకు విడుదలచేయడంజరిగింది. ఆసొమ్ము మే 2019లో నాడుకొత్తగా కొలువుదీరిన జగన్ రెడ్డిప్రభుత్వఖజానాకు జమచేయడం జరిగింది.
కేంద్రం నుంచి నిధులు వచ్చి 34నెలలు అయినా, రూ.900కోట్లసొమ్ము ఏమైందో..ఎవరికిచ్చారో ఇం తవరకుతెలియదు. తెలుగుదేశంపార్టీ పెట్టిన బకాయిలను తీరుస్తున్నామంటూ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను మోసగించడం తప్ప, జగన్మోసపురెడ్డి ఇంతవరకు రాష్ట్రరైతాంగానికి రూపాయికూడా సాయంచేయలేదు. పంటనష్టంతాలూకా రూ.900కోట్లకుతోడు, ఇన్ పుట్ సబ్సీడీ.. పంటలబీమా…ఇతరత్రా సహాయాలకింద రైతులకు రూ.2వేలకోట్లవరకు చెల్లించాల్సి ఉంది.
ఆ సొమ్ముపై సమాధానంచెప్పకుండా మంత్రి కన్నబాబు అసెంబ్లీలో కట్టు కథలతో చంద్రబాబుని, ఆయనపాలనను విమర్శిస్తూ మాట్లాడాడు. రైతాంగానికి పెద్దపీట వేస్తామని, పంటలకుధరలస్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని, చివరిగింజవరకు మద్ధతుధర చెల్లించి కొంటామని చెప్పిన జగన్మోసపురెడ్డి, రూ.5వేలకోట్లవరకు ధరలస్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. ఆ రూ.5వేలకోట్ల ధరలస్థిరీకరణ నిధిఏమైందో.. ఈప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నిలక్షలక్వింటాళ్ల ధాన్యం కొన్నదో, ఎందరురైతులకు సకాలంలో ఎంతమొత్తంచెల్లించిందో లెక్కాపత్రం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షా30వేలమెట్రిక్ టన్నులధాన్యాన్ని రైతులు పండిస్తే, ఈ ప్రభుత్వంతో చేతులుకలిపిన అధికారపార్టీ వైసీపీనేతలు దళారులఅవతారమెత్తి, ఆర్బీకే కేంద్రాలద్వారా45 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరించారు. మిగతా 90వేలమెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, రేపు రబీలో రాబోయే ధాన్యాన్నిఎవరుకొనాలనే దానిపై ప్రభుత్వంనుంచి స్పష్టతలేదు.
టీడీపీ హాయాంలో రైతులనుంచి ధాన్యంకొన్న 48గంటల్లోనేవారికి చెల్లింపులుచేయడంజరిగింది. 49 వ గంటవచ్చీరాగానే ఆనాడుప్రతిపక్షంలోఉన్న జగన్మోసపురెడ్డి, ఆయనపార్టీనేతలు బజార్లుఎక్కి కాకిగోల చేశారు. అదేవ్యక్తి నేడు అధికారంలోకి వచ్చాక 48గంటలసమయాన్ని 21 రోజులకు పెంచాడు. 21రోజులైనా కూడా అందరురైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు ఇస్తున్నారా అంటే అదీలేదు. ఈ ప్రభుత్వం చెబుతున్న లెక్కలప్రకారమే 25వేలకోట్ల సొమ్ము ఇంకా రైతులకు చెల్లించాల్సిఉంది.
ప్రభుత్వం కొనుగోలుచేయకుండా ఇంకా 66 శాతం ధాన్యం రైతులవద్దనే ఉంది. దాన్నిఎప్పుడుకొంటారో.. ఎప్పుడు సకాలంలో రైతులకుడబ్బులిస్తారనే దానిపై ఈ ప్రభుత్వంనుంచి సమాధానంలేదు. పౌరసరఫరాలశాఖ అధికారులతో కుమ్మక్కైన వైసీపీనేతలు, రూ.19600గాఉన్న టన్నుధాన్యంధరను, రూ.12వేలవరకు దిగజార్చారు. కొన్నిప్రాంతాల్లో అయితే తేమఎక్కువగాఉందంటూ.. రూ.11వేలకే కొంటున్నారు. న్యాయంగా రైతులకు దక్కాల్సిన ధాన్యంసొమ్ముని మిల్లర్లు, వైసీపీనేతలు, దళారులు, అధికారులంతా కుమ్మక్కై దిగమింగుతున్నారు.
జగన్మోసపురెడ్డి చెబుతున్న ఆర్ బీకే కేంద్రాల్లో ఏంజరుగుతుందో ఆయనకు తెలుసా?సదరు కేంద్రాల్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంటఉత్పత్తులు కొలిచే యంత్రపరిక రాలు.. డబ్బులు లేకుండాపోయాయి. కొన్నిచోట్ల ఆర్బీకే కేంద్రాల్లోపనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వం కరెంట్ బిల్లులుకూడా కట్టడంలేదని వాపోతున్నారు. ఆర్ బీకే లతోనే రైతులకుఅంతాజరగాల్సిందంతా జరిగిపోతోందనే భ్రమలు జగన్ రెడ్డికల్పిస్తున్నాడు. రైతుభరోసా కేంద్రాల (ఆర్ బీకే) పనితీరుపై, వాటివల్ల రైతులకు కలుగుతున్న ప్రయోజనాలపై టీడీపీ బహిరంగచర్చకు సిద్ధంగాఉంది. తమతో చర్చకు వ్యవసాయమంత్రి వస్తారో.. ముఖ్యమంత్రి వస్తారో రావచ్చు. మూడేళ్ల జగన్ పాలనలో ఆరుసార్లు పంటఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి.
సాగుకువసరమైన నీళ్లు అందక, వర్షపు నీరు బయటకువెళ్లే వసతిలేక రైతులు నానా అవస్థలు పడుతున్నా కూడా ఈప్రభుత్వం ఎక్కడా డ్రైన్లు, కాలువల ఆధునికీకరణ చేపట్టిందిలేదు. ఒక్కప్రాజెక్ట్ కింద ఉన్న కాలువల్ని అయినా ఈముఖ్యమంత్రి ఏనాడైనా బాగుచేయించారా? రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఇరిగేషన్ విభాగం చేయాల్సిన పనులను రైతులు చందాలువేసుకొని కాలువల్ని బాగుచేసు కుంటున్నారు.
అలాంటి దుస్థితి రైతాంగానికి కల్పించినందుకు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు అనిల్ కుమార్..కన్నబాబు సిగ్గుతో తలదించుకోవాలి.
మరోపక్క మిరపపంటను ఈఏడాది నల్లతామర సర్వనాశనంచేసింది. దానిపై జగన్మోసపు రెడ్డినోటినుంచి ఒక్కప్రకటనకూడా లేదు. రైతులకు నష్టంలేకుండా వారితరుపును కూడా పంటలబీమాసొమ్ము తాలూకా ప్రీమియం మొత్తంతానేచెల్లిస్తానని జగన్మోసపురెడ్డి గతంలో 420మాటలుచెప్పాడు. ఈ సంవత్సరం ఇంతవరకు రైతులతరుపునచెల్లించాల్సిన పంటల బీమా సొమ్ముని ఇంతవరకు జగన్ రెడ్డి చెల్లించలేదు.
ఇలా రైతాంగానికి అన్నివిధాలా పంగ నామాలుపెడుతున్న జగన్ రెడ్డి, మాట్లాడితే టీడీపీహయాంలోని బకాయిలను తీరుస్తున్నా మంటూకల్లబొల్లి మాటలుచెబుతున్నాడు. ఎన్నాళ్లిలా అబద్ధాలు.. మోసం, దగాలతో జగన్ రెడ్డి రైతుల్ని వంచిస్తాడని ప్రశ్నిస్తున్నాం?
జగన్మోసపు రెడ్డి వంచనకు బలికాకుండా రైతాంగమంతా సంఘటితమై ఈప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం వచ్చింది. రైతుగెలవాలి.. వ్యవసాయం నిలవాలనేనినాదంతో రైతాంగానికి దక్కాల్సిన ప్రయోజనాలుదక్కేలా ప్రభుత్వంపై పోరాటంచేయడానికి తెలుగురైతు విభాగం సన్నద్ధమవుతోందని తెలియచేస్తున్నాం.