• కురసైన ఆలోచనలతో, మిడిమిడిజ్ఞానంతో మాట్లాడిన కన్నబాబు తనపరువు, ముఖ్యమంత్రి పరువు రెండూ తీసుకున్నాడు
• రైతుని రాజుని చేయాలన్న చంద్రబాబులక్ష్యం ముందు, జగన్ రెడ్డి, కన్నబాబుచెప్పే అబద్ధాలు,మోసపు వాగ్ధానాలు నిలవవు
• బాబాయ్ కి వేసిన గొడ్డలిపోటు, తల్లిని,చెల్లిని రోడ్లపాలు చేసి చేసిన కుటుంబవంచనకంటే మిన్నగా రాష్ట్ర రైతాంగాన్ని చెప్పుకోలేని విధంగా జగన్ రెడ్డి వంచించాడు
• నిప్పుకి చెదలు పట్టించడం, రైతుని రాజుని చేయాలన్న చంద్రబాబు సంకల్పాన్ని నీరుగార్చడం కన్నబాబు, జగన్ రెడ్డి, వైసీపీ తరంకాదు
– తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు కురసైన ఆలోచనలతో నిప్పుకి చెదపట్టించాలని తాపత్రయపడ్డాడని, చంద్రబాబు నాయు డు గారు ఇతర టీడీపీపెద్దలపై అవాకులు చెవాకులు పేలాడని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు.ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జగన్మోహన్ రెడ్డిని మించిన రైతుద్రోహి, అన్నదాతల వంచకుడు ఈ దేశంలో మరెవరూ లేరనే వాస్తవాన్ని కన్నబాబు తెలుసుకోవాలి. అసలు ద్రోహి అని ఎవరిని అంటారో ముందు మంత్రి గ్రహించాలి. నమ్మినవారిని నట్టేటముంచి వారి జీవితాలు నాశనంచేసి, తన జీవితం చక్కబెట్టుకునేవాడిని ద్రోహి అంటారు. అంతటి ద్రోహం రై తులకు చేసిన ఘనాపాటి జగన్మోహన్ రెడ్డే. జగన్ రెడ్డి కుటుంబ సభ్యులకు చేసిన ద్రోహాల గురించి ఎంతతక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. సొంతతల్లిని, చెల్లిని అవసరార్థం వాడుకొని వదిలేసి రోడ్లపాలు చేయడమేగాక, బాబాయ్ గొడ్డలిపోటుతో వేసేసిన ఘన చరిత్ర జగన్ రెడ్డిది.
అందుకని అంతగొప్ప చరిత్ర గురించి చెప్పాలం టే ఒకరోజులో అయ్యేదికాదు. ఆ విషయం పక్కనపెడితే జగన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు రాష్ట్రప్రజల పక్షాన మాట్లాడకుండా, ఎప్పటికప్పుడు ఏవోకుంటిసాకులతో అసెంబ్లీనుంచి పారిపోయేవా డు. ఆసమయంలో గానీ, పాదయాత్ర చేసినప్పుడు గానీ జగన్ రెడ్డి రైతులకుఏంచేస్తాననిచెప్పాడో, ఏఏప్రాంతాల్లోని రైతులను ఎలా ఉద్ధరిస్తానని నమ్మించాడో కన్నబాబుకి గుర్తుందా..లేక తాము గుర్తుచేయాలా?
వ్యవసాయరంగాన్ని ఆదుకోవడానికి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3వేలకోట్లతో ధరల స్థిరీ కరణ నిధి ఏర్పాటుచేస్తానన్నాడు. రైతులు పండించిన అన్నిరకా ల ఉత్పత్తులను తనప్రభుత్వమే గిట్టుబాటుధర నిర్ణయిస్తానని, అది కాకుండా రైతులు ఏపంట వేస్తే ఆపంటలన్నింటినీ తానే గిట్టు బాటు ధరకు కొంటాననికూడా జగన్ రెడ్డి నమ్మబలికాడు. ఆనాడు ప్రకాశంజిల్లాలో రూ.2600నుంచి రూ.3వేలవరకు సుబాబుల్ , జామాయిల్ కు ధరలు లభిస్తుంటే, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.5వేలకు పెంచుతానని చెప్పాడు.
జగన్ రెడ్డి అధికారం లోకివచ్చి 34నెలలు అయినా సుబాబుల్, జామాయిల్ ధర 34 పైసలుకూడా పెంచలేదు. టీడీపీప్రభుత్వంలో చంద్రబాబు గారు అన్నదాతాసుఖీభవ కింద ప్రతిరైతుకి రూ.13వేలవరకు పెట్టుబడి సాయం నేరుగా అందించారు. ఆమొత్తంరైతులకుసరిపోదని తానుఅధికారంలోకివస్తే రాష్ట్రప్రభుత్వవాటాగానే నేరుగా రైతులకు రూ.12వేలవరకు ఇస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక రూ.7వేలతోసరిపెట్టలేదా?
ప్రత్యేకహోదా సాధించలేనప్పుడు పార్ల మెంట్ సభ్యులుఎందుకని చంద్రబాబుని గతంలో ప్రశ్నించిన జగన్ రెడ్డి, ఇప్పుడు 28మంది ఎంపీలను చేతిలోఉంచుకొని పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమయ్యాడు. ప్రాజెక్ట్ డీపీఆర్ 2ని కేంద్రంతో ఆమోదింపచేయించకోలేని అసమర్థ స్థితిలోఉన్నాడు. రాష్ట్ర రైతులకు వరప్రదాయిని అయిన పోలవరం ఎత్తుతగ్గిస్తే, దానివల్ల రైతాం గం తీవ్రంగా నష్టపోతుందని తెలిసికూడా జగన్ రెడ్డి తనస్వార్థం కోసం, తనపై ఉన్నకేసుల భయంతో పోలవరంప్రాజెక్ట్ ను బ్యారేజ్ గా మార్చడానికి సిద్ధమయ్యాడు. అది ఆయన రైతులకు చేస్తున్న తీరనిద్రోహంకాదా? దానిపైకన్నబాబు ఏంసమాధానం చెబుతాడు?
ఇలా అనేకఅంశాల్లో రైతులను దారుణంగా వంచించి, వారినోట్లో మట్టికొట్టిన జగన్ రెడ్డిని మించిన రైతుద్రోహి దేశంలో మరెవరూ ఉండరుఅనేది పచ్చివాస్తవం. రైతుద్రోహి ఎవరనేది చర్చించడానికి అవసరమైతే జగన్ రెడ్డి సొంతనియోజకవర్గంలో ఆయనతోకలిసి గడపగడపకు తిరిగిరైతులనే అడగడానికి తాముసిద్ధంగా ఉన్నా ము. తమతోకలిసి రైతులవద్దకు రావడానికి జగన్ రెడ్డిగానీ, కన్న బాబుగానీ సిద్ధమా అనిప్రశ్నిస్తున్నాం.
రైతుల తరుపున పంటలబీమా సొమ్మంతా తానే కడతానని రైతు అనేవాడు ఎవరూ రూపాయికట్టాల్సిన పనిలేదని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకివచ్చాక రూపాయికట్టలేదు. చంద్రబాబు గారు ఎందుకు రైతులను మోసగిస్తున్నారని ప్రశ్నించి, అసెంబ్లీలో నేలపై కూర్చొని నిరసనతెలిపితే,అప్పటికప్పుడు రూ.500కోట్లు ప్రభుత్వవాటాగా పంటలబీమాకు చెల్లిస్తున్నట్లు జీవోఇచ్చారు. ఆ రూ.500కోట్లు ఎటుపోయాయో ఇంతవరకు తెలియదు. రైతుభరో సాకేంద్రాలపేరుతో వైసీపీవారికి ఉపాధికల్పించిన జగన్ రెడ్డి, అన్న దాతలకు పంగనామాలుపెట్టాడు. అధికారంలోకి వస్తే రూ.3వేల కోట్లతో ఏర్పాటుచేస్తానన్న ధరలస్థిరీకరణ నిధి ఏదని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం.
ఆ నిధితో ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వం ఎందరు రైతులవద్ద, ఎన్నిరకాల పంటఉత్పత్తులను ఎంతమొత్తంలో కొన్న దో కన్నబాబు సమాధానంచెప్పగలడా? తడిచిరంగుమారిన పం ట ఉత్పత్తులు ఎన్నికొన్నారో, ఎందరురైతులకు ఎంతమొత్తం చెల్లించారో సమాధానంచెప్పండి.
కన్నబాబుకి తనశాఖగురించి ఓనమాలుకూడా తెలియవని అతని మాటలనుబట్టే అర్థమవుతోంది. గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాం తాల్లో మైనింగ్ చేస్తున్న ఒకరెడ్డిగారివద్ద కన్నబాబు బ్రోకర్ ఉద్యోగంచేస్తున్నాడు. తాను నిర్వహించాల్సిన వ్యవసాయశాఖను పూర్తిగా పక్కనపెట్టాడు. మూసేయాల్సింది తెలుగుదేశంపార్టీ కా ర్యాలయాన్నికాదు కన్నబాబు … నిన్ను, నీ ముఖ్యమంత్రిని మూసేయాలి. ఆరోజు దగ్గర్లోనేఉందని గుర్తుంచుకో.
కన్నబాబు సొంతఊరులోని ఆర్బీకే కేంద్రానికి వెళ్లి వాస్తవాలు ఏమిటో తెలుసుకుందామా అని నిలదీస్తున్నా. రైతులవద్ద ఎంత మొత్తంలో ధాన్యంకొన్నారు…ఎంతవరకు వారికి డబ్బులు సకాలం లో చెల్లించారో మంత్రి సమాధానం చెప్పగలడా?
కన్నబాబులాంటి చేతగానిఅసమర్థుడికి టీడీపీగురించి, చంద్రబా బుగారి గురించి, మాపార్టీనేతల గురించి మాట్లాడే అర్హతలేదు. ఏ విషయంలో కన్నబాబుగానీ, జగన్ రెడ్డిగానీ రైతులుకు ఇచ్చిన హామీలు నెరవేర్చారో సమాధానంచెప్పగలరా? ఇన్ పుట్ సబ్సిడీ గానీ, పంటలబీమా గానీ, ధరలస్థిరీకరణ నిధి, పంటఉత్పత్తుల కొనుగోళ్లుగానీ, రైతులమోటార్లకు మీటర్లు బిగించే అంశంపైగానీ, రైతులకు టీడీపీ హాయాంలో సబ్సిడీపై ఇచ్చిన యంత్రపరికరాలు గానీ, ఇలా ఏఅంశంపైనైనా తాను బహిరంగచర్చ కు సిద్ధంగా ఉన్నాను.
తనతోచర్చించడానికి మంత్రి కన్నబాబుకి ధైర్యముం దా? ఉంటే ఎక్కడికి వస్తాడో..ఎప్పుడొస్తాడో చెప్పాలని ఈ సంద ర్భంగా డిమాండ్ చేస్తున్నా. టీడీపీ హాయాంలో 90శాతం సబ్సిడీ పై రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించడం జరిగింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్కరైతుకైనా ఎక్కడైనా సరే మూరపైపు ముక్కఇచ్చారా?
తిత్లీ తుఫాను సమయంలో రైతులుతీవ్రంగా నష్టపోతే, ఆనాడు చంద్రబాబుగారు కొబ్బరి చెట్టుకి రూ.1500, జీడిమామిడికి హెక్టా రుకి రూ.30వేలవరకు పరిహారం అందిస్తే, జగన్ రెడ్డి పాదయాత్ర పేరుతో రైతులవద్దకెళ్లి అదేమీసరిపోతుంది..తాను అధికారంలోకి వస్తే కొబ్బరిచెట్టుకి రూ.3వేలు, జీడి మామిడి తోటకు హెక్టారుకి రూ. 50వేలు ఇస్తాననిచెప్పాడు. ముఖ్యమంత్రి అయి 34నెలులు అయినా తిత్లీ తుఫానువల్ల నష్టపోయిన రైతులకు రూపాయి ఇవ్వలేదు.
తాడేపల్లి ప్యాలెస్ లోకూర్చొని ముఖ్యమంత్రి మీట నొక్కాడు గానీ, ఇంతవరకు రైతులఖాతాల్లో పైసాపడలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చీదరి అప్పలరాజు రెండువారాల్లో ముఖ్యమంత్రి చెప్పిన విధంగా సాయం అందేలా చూస్తానని డబ్బాలు కొట్టుకున్నాడు. ఆయన డబ్బామాటలు డబ్బాలకే పరిమితమయ్యాయి గానీ, రైతులకు డబ్బులు అందలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొదలు, మంత్రు లందరూ రైతులను దారుణంగా మాయమాటలతో వంచించారు. ఇప్పటికీ వంచిస్తూనే ఉన్నారు. నిజంగాఈ ముఖ్యమంత్రి రైతు లను ఉద్దరిస్తుంటే, రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం తొలిస్థానంలో ఎందు కు ఉందో కన్నబాబు సమాధానంచెప్పాలి.
నదీపరివాహకప్రాంతాల్లోనిఇసుకను దోచుకోవడం ద్వారా.. ఏజెన్సీ ప్రాంతాల్లోని లేటరైట్ , బాక్సైట్ ఇతర ఖనిజసంపదను, విశాఖపట్నంలోని విలువైన భూములను కాజేయడంద్వారా.. పవిత్రమైన తిరుమల వేంకటేశ్వరుడిని ఆదాయవనరుగా మార్చు కోవడం ద్వారా వై.వీ.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామ కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లు మాత్ర మే ఈ మూడేళ్లలో అభివృద్ధి చెందారు.
వారిద్వారా జగన్ రెడ్డి, ఆయనభార్యభారతి రెడ్డి మరింతగా ఆర్థికంగా అభివృద్ధిచెందారు. అదీ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. అంతేగానీ ఎక్కడా ఏ రైతుకి కనీసం మూడుపూటలా కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర కూడా లభించడంలేదు. అన్నంపెట్టే అన్నదాతలకు అలాంటి దుర్గతి పట్టించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి.
ఆయన వైఫల్యాలు కప్పిపుచ్చడానికి కన్నబాబు లాంటి వారు చంద్రబాబు ని, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీనేతలను దూషిస్తు న్నాడు. సొంతబాబాయ్ ని నరికిచంపినవాడికి ప్రజలు ఒకలెక్కా.. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ, అతను అమాయకుడనిచెప్పాడు. అలానే కన్నబాబు కూడా జగన్ రెడ్డి చేతగానివాడని చెబితేసరిపోతుంది. జగన్ రెడ్డి అమాయకుడు కాదు.. అవినీతిపరుడని, దోపిడీదారని, తనను ప్రశ్నిస్తే సొంత బాబాయ్ ని కూడా చంపడానికి వెనుకాడని కిరాతకుడని ప్రజలకు అర్థమైంది కన్నబాబు..నువ్వే ఆసత్యాన్ని ఇంకా తెలు సుకోలేకపోతున్నావు.
వ్యవసాయరంగాన్ని గెలిపించి, రైతులనురాజులను చేయడమే ఎప్పటికీ చంద్రబాబుగారి లక్ష్యం.
కన్నబాబు, జగన్ రెడ్డి లాంటి నీతిమాలిన వాళ్లు ఎంతగా విషప్రచారంచేసిన చంద్రబాబుకి, రైతులకు ఉన్నఅవినాభావసంబంధాన్ని విడదీయలేరు. రైతును, వ్యవసాయాన్ని నిలబెట్టడానికే చంద్రబాబు పోలవరం నిర్మా ణంచేపట్టి, 70శాతం వరకు పనులుపూర్తిచేశారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల ఆయకట్టును కొత్తగా సాగులోకి తెచ్చారు. జగన్ రెడ్డి వచ్చాక ఒక్కఎకరాకైనా అదనంగా నీరిచ్చాడా? ఏ ఒక్కరైతు భూమిలోనైనా ఉచితంగా భూసారపరీక్షలునిర్వహించి, సబ్సిడీపై జిప్సం,బోరాన్ వంటి ఎరువులు అందించాడా? రైతులకు రైతుర థంకింద సబ్సిడీపై ట్రాక్టర్లు ఇతరయంత్రపరికరాలు అందించాడా?
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 2లక్షలబోర్లు వేయిస్తానని, తానే మోటార్లుకూడా ఇస్తానని జగన్ రెడ్డి అన్నదాతలను వంచించాడు. ఎక్కడఎన్నిబోర్లు వేసి, రైతులకుఎన్నిఎకరాలకు నీళ్లుపారించాడో చెప్పమనండి. ఇలా చెబితే చాలానే ఉన్నాయి.
కన్నబాబు నువ్వు పెద్దకన్నింగ్ బాబువని అందరికీ తెలుసు. నీ మిడి మిడి జ్ఞానాన్ని ప్రజలముందు, టీడీపీముందు ప్రదర్శించి అభాసుపాలు కాకు. అలాంటిచర్యలకుపాల్పడితే రోడ్లపై తిరగలేవ ని గుర్తుంచుకో. నీకువ్యవసాయం తెలియదు.
బెట్టింగ్ మంత్రి అని ల్ కుమార్ కు ప్రాజెక్ట్ ల నిర్వహణ తెలియదు. రాష్ట్రంలో ఏ ఏ ప్రాజెక్టులద్వారా ఎన్నిలక్షల ఎకరాలకు నీరుఇస్తున్నారో చెప్పలే రు. మీ అసమర్థతను అలానే ఉంచుకోండి. అంతేగానీ వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్లు,రైతులను బాగుచేస్తున్నట్లు అబద్ధాలు చెప్పకండి. మీరుఎన్ని అబద్ధాలుచెప్పినా చంద్రబాబులాంటి నిప్పుకు చెదలుపట్టించలేరు.
జగన్మోహన్ రెడ్డిని మించిన రైతుద్రోహి ఈ భూమండంలోనే మరెవరూ ఉండరనే వాస్తవాన్ని తెలుసుకొని, రైతులుఆగ్రహంతో మీపునాదులు కదిలించకముందే పెట్టేబేడా సర్దుకొని రాష్ట్రం విడిచి పోవడానికి సిద్ధమవ్వండి.