అభివృద్ధిలో అధమం.. ఆత్మహత్యల్లో ప్రథమం

-తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం, దేశంలోనే 3వస్థానంలో, కౌలురైతు ఆత్మహత్యల్లో 2వస్థానంలో ఉందంటే, అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులపట్ల అనుసరిస్తున్న మోసపూరిత విధానాలే.
జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా, ఇసుక, మద్యం అమ్మకాలు, గనులు, భూములదోపిడీ నుంచి తనదృష్టిని మళ్లించి, వ్యవసాయరంగం గురించి ఆలోచిస్తే మంచిది.
పత్రికల్లో నేడు ప్రధానమైనవార్తగా జాతీయ నేరపరిశోధన సంస్థ వివరాలు వచ్చాయని, దానిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుఆత్మహత్యల్లో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతోందని, కౌలురైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం, రెండోస్థానంలో ఉందని టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షు లు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
సంఖ్యాపరంగా మనరాష్ట్రంకంటే ఎక్కువ జనాభాఉన్న రాష్ట్రాలు రైతు ఆత్మహత్యల్లో తొలి, ద్వితీయస్థానాల్లోఉన్నాకూడా, త్వరలోనే ఏపీ తొలి వరుసలో నిలిచేప్రమాదముంది. జాతీయ నేరపరిశోధన సంస్థ వివరాల ప్రకారం రాష్ట్రంలో 2018లో 664 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 2019లో 1029, 2020లో 889 మంది రైతులు బలవన్మర ణాలకు పాల్పడ్డారు. సదరు సంస్థ లెక్కలు కాకుండా, రాష్ట్రంలో చాలా పెద్దసంఖ్యలోనే ఇంకా అధికంగా అన్నదాతలు తమప్రాణాలు తీసుకుంటున్నారు.
వ్యవసాయంపై ఏమాత్రం ప్రేమ, శ్రద్ధలేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండటమే అందుకుప్రధాన కారణం. రైతులఆత్మహత్యల ను ప్రభుత్వం తక్కువచేసి చూపుతోంది. రైతులు బలవంతంగా తమ ఉసురు తీసుకుంటున్నా, పాలకులు మాత్రం ఇతరత్రా కారణాలతో చని పోయారని చెప్పి, అసలు వాస్తవాలను కప్పిపుచ్చుతోంది. భార్యా బిడ్డల మెడల్లోని బంగారాన్ని తాకట్టుపెట్టిమరీ, ఆరుగాలం నానా కష్టాలు పడి రైతులు పంటలు పండిస్తే, వారి ఉత్పత్తులకు ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధరకల్పించడంలేదు. ప్రభుత్వనిర్వాకంతో చేసేదిలేక, అయినకాడికి రైతులు తమపంటఉత్పత్తులు తెగనమ్ముకుంటూ, అప్పులుతీర్చలేక, అవమానాలు భరించలేక, తలదించుకొని బతకడంచేతగాని ఆంధ్రారైతు, తలవంచుకొని బతికేస్తున్నాడు.
రాష్ట్రంలో ఆరుమాసాలక్రితం రైతుల మొక్కజొన్న అమ్మితే, ఇంతవరకు వారికి బకాయిలు చెల్లించలేదు. గత రబీలో వేసిన వరిపైరు తాలూకా ధాన్యం లెక్కలు ఇప్పటికీ సరిగా తేలలేదు. రైతులు ధాన్యం అమ్మితే, దానితాలూకా బకాయిలు ఇవ్వడా నికి ప్రభుత్వానికి మనసు రావడంలేదు. నేరుగా మిల్లర్లు ధాన్యం కొని, వైసీపీనేతలను అడ్డుపెట్టుకొని, కొనుగోలు చేసిన ధాన్యం తాలూకా లెక్క లుకూడా బయటకు రాలేదు. ఈ విధంగా పంటలు అమ్మకోవడానికే రైతులు నానాఅవస్థలుపడుతున్నారంటే, అందుకు కారణం ఈ చేతగాని ప్రభుత్వంకాదా? దేశానికి అన్నంపెట్టాల్సిన రైతు తనువుచాలిస్తుంటే, ఈ ప్రభుత్వం వారికందించే సాయం విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. గతసంవత్సరం ఈ అసమర్థప్రభుత్వం రైతాంగానికి సకాలంలో డబ్బులు ఇవ్వడంలో విఫలమవ్వబట్టే, ఈ ఏడాది ధాన్యం, ఇతర పంటఉత్పత్తులను కొనుగోలుచేయకుండా కుంటిసాకులుచెప్పి తప్పించుకోవాలని చూస్తోంది. ప్రభుత్వ సలహాదారులు ఇస్తున్న దిక్కు మాలిన సలహాలకు తోడు, ప్రభుత్వతీరు రైతులకు శాపంగా మారుతోంది. ధాన్యం వచ్చింది..కల్లాల్లోకి చేరింది… బజార్లలో రోడ్లపైఉన్నాకూడా ఈ ప్రభుత్వం నేటికీ ధాన్యం కొనుగోళ్లపై ఒకనిర్ణయానికి రాలేదు. నెల్లూరు జిల్లాలో 1010క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుచేయాలని చెప్పారు. గోదావరి జిల్లాల్లో పచ్చిధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఇం తవరకు నిర్ణయం తీసుకోలేదు.
ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉన్నఅవకాశాలను సమర్థంగా వినియోగించుకోకుండా, మోసం, దగాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తోంది. నిన్నటికి నిన్న వచ్చిన నివర్ , గులాబ్ తుఫాన్ల తాలూకా నష్టపోయిన పంటలకు ఇన్ పుట్ సబ్సిడీని ఈ ప్రభుత్వం ఇం తవరకు చెల్లించలేదు. ఈ విధంగా పాలకుల వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా, రైతులమరణాలను తక్కువచేసి చూపుతూ, ప్రభుత్వం అంతాబాగుందంటూ బ్లూమీడియాసాయంతో దుష్ప్రచారంచేస్తోంది. పోలీ సులు, అనుకూలమీడియా సాయంతో ఇప్పటికిప్పుడు రైతుసంక్షేమం బాగుందని పాలకులు ప్రగల్భాలు పలికినా, రాబోయేరోజుల్లోవారి మర ణాల తాలూకా శాపం, పాలకులకు పాపంగా పరిణమిస్తుంది.
ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పటికైనా దొంగలెక్కలు వేయడం మానేసి, రైతుల ఉత్పత్తులు కొంటున్నట్లు నమ్మిస్తూ, ప్రజలను మభ్యపెట్టడం చేయకుండా, వ్యవసాయరంగంపై దృష్టిపెడితే మంచిది. రైతులు వ్యవసాయం వదిలేస్తే, అంతిమంగా సమాజం అన్నమో రామచంద్రా అని అలమటించే దుస్థితివస్తుందని హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇసుక అమ్ముకోవడం, మద్యం అమ్మడం, గనులు, భూము లను దోపిడీచేయడం వంటివాటిపైనుంచి కాస్త దృష్టి మరల్చి, రైతుల గురించిఆలోచిస్తే మంచిది. గతంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం విత్త నం నుంచి విక్రయం వరకు రైతులకు ఎలాగైతే అండగా ఉన్నారో, అదే విధంగా ఈ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవడంపై శ్రద్ధపెడితే మంచి దని సూచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్నపేరుని నిలబెట్టే దిశగా, రైతులఆత్మహత్యలను నివారించే దిశగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశంపార్టీ అనుబంధవిభాగమైన తెలుగు రైతు తరుపున డిమాండ్ చేస్తున్నాం.