Suryaa.co.in

Telangana

ఇద్దరు పురుషుల పెళ్లి..అలా‘గే’..అలా‘గే’!

ఇద్ద‌రు పురుషులు లేదా ఇద్ద‌రు స్త్రీలు పెళ్లి చేసుకున్న ఘటనలు మనం అక్కడక్కడా వింటూనే ఉన్నాం. అయితే హైదరాబాద్‌లో అలాంటి వివాహం జరగబోతుంది. అవును, ఇద్దరు పురుషులు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రజంట్ సొసైటీలో వివాహాలకు లింగ భేదం అడ్డు రావడం లేదు. మనసుకు ఎవరు నచ్చితే వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కువగా విదేశాల్లో జరిగినట్లు మనం విన్నాం.
హైదరాబాద్ కి చెందిన సుప్రియో, అభయ్ అనే ఇద్దరు యువకులు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. 2013లో ఒక డేటింగ్ యాప్ వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మనసులోని భావాలు కలవడంతో వారి మధ్య స్నేహం కుదిరింది. అనంతరం అది ప్రేమగా మారింది. ఎనిమిదేళ్ల పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో వారీ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి చేసుకుంటామని ఇరు కుటంబాల పెద్దల్ని అప్రోచ్ అయ్యారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఈ డిసెంబర్ లో వీరి వివాహం జరగనుంది. పెద్దల గురించే భయముండేదని.. ఇప్పుడు వారిని ఒప్పించడంతో ఆనందాలకు అవధులు లేవని వారు చెబుతున్నారు. ఇక ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం తెలంగాణలో ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. అందరి పెళ్లిళ్లు లానే తమ వివాహంలోనూ మంగళ స్నానాలు, నిశ్చితార్థం, సంగీత్, ఉంగరాలు మార్చుకునే కార్యక్రమాలు ఉంటాయని ఈ ప్రేమ జంట వెల్లడించారు.

LEAVE A RESPONSE