Suryaa.co.in

Andhra Pradesh

తూర్పుగోదావరి జిల్లాలో బిజెపిలోకి భారీగా చేరికలు

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా బిజెపి కార్యాలయంలో వివిధ మండలాల నుంచి బిజెపి పార్టీ సిద్ధాంతాలు ఆకర్షితులై పటిష్టమైన మోడీ గారి నాయకత్వం నచ్చి సుమారు 500 మంది పార్టీలో చేరారు.

స్థానిక క్వారీ ఏరియా జిల్లా పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర సమక్షంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పార్టీలో నూతనంగా చేరిన వారికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి , అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిజెపి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి M L A నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ,జమ్మలమడుగు M L A ఆదినారాయణ, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు కోడూరి లక్ష్మీనారాయణ, mఅడబాల రామకృష్ణ ,రొంగల గోపి శ్రీనివాస్ ,కురగంటి సతీష్ , శెట్టిపల్లి నాగరాజు , పొన్నాల లక్ష్మీ సంతోషి, గుర్రాల వెంకట్రావు , పొట్లూరి రామ్మోహన్ రావు గారుపరిమి రాధా , కాశీ విశ్వనాధ్ , తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE