ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల అవగాహన, పొత్తుల పైన ఎవరికి ఏ విధంగా ఇష్టమైతే,తోచితే వారు ఆ విధంగా ఆలోచించుకుంటూ మీడియా ఛానల్స్ లో డెబేట్లు పెడుతూ వారి ఇష్టప్రకారం వారు అభిమానించే , ఇష్టపడ్డ పార్టీకి, అనుకూలంగా ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారు గురిచేస్తున్నారు.
అయితే బిజెపి మొదటి నుండి జనసేనతో అలయన్స్ కుదిరిన ప్పటినుండి తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో గాని, బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నికలలో గాని, జరగబోయే ఆత్మకూరు ఉప అసెంబ్లీ ఎన్నికల్లో గాని బిజెపికి సహాయం చేస్తూ ఒకే మాట మీద ఉంది. ఆ విధానం నచ్చని కొన్ని మీడియా ఛానల్స్ వారు బిజెపి నుండి జనసేన ను వేరు చేయడానికి రకరకాల డిబేట్ల లో ప్రయత్నం చేస్తూ వారి రేటింగ్ పెంచుకోవడం కోసం ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు .
తెలుగుదేశం పార్టీ వారు మొదట మొదలుపెట్టారు ఏమనంటే కుప్పం నియోజకవర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని వారి పార్టీ కార్యకర్త జనసేన తో అలయన్స్ పెట్టుకుంటే మనం సులభంగా గెలుస్తాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ లవ్ సక్సెస్ కాదు అని మాట్లాడారు .
అంటే ఆయన ఉద్దేశం జనసేన సరేనంటే వెంటనే వారికేదో కొన్ని సీట్లు ఇచ్చి వాటిల్లో కొన్నింటిలో టిడిపి రెబల్ అభ్యర్థులను నిలబెట్టి (వారిన వారే సస్పెండ్ చేసి) జనసేన పార్టీని లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు చేసే ఎత్తుగడ. 2009లో ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవి గారిని వారి అనుకూల మీడియా, వారి అనుకూల మనుషులు, సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది పెద్ద మనుషులనబడేవారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నట్టుగానే ఏ విధంగా ద్రోహం చేశారో ,ఎంత అవమానించారో ఈ రాష్ట్ర ప్రజలు ,చిరంజీవి అభిమానులు ఇంకా మర్చిపోలేదు.
టీవీ డిబేట్ లో బిజెపి ,జనసేన పార్టీలను తక్కువచేసి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో బిజెపికి 1% కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ,జనసేన కు 6% వచ్చాయని టీడీపీకి 39% ఓట్లు వచ్చాయని పొత్తు పెట్టుకుంటే తప్ప మీరు అధికారంలోకి రాలేరని రకరకాల మాటలతో కించ పరచె ప్రయత్నం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారు .
ప్రజలు ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు వై ఎస్ ఆర్ సి పి పార్టీ దెబ్బకు నిలవలేక మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఈ ఎన్నికల ను బహిష్కరిస్తున్నామని చెప్పిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా గుర్తుంది.
మీ ,
కరణం భాస్కర్,
బిజెపి,
మొబైల్ నెంబర్ 7386128877 .