Suryaa.co.in

Andhra Pradesh

మెడికల్ విద్యార్థుల ఆవేదన.. ప్రభుత్వ స్పందన.. వైకాపా వక్రభాష్యాలు

(చాకిరేవు)

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించకుండానే శాశ్వత నివాసం (పీఆర్) కోసం ప్రయత్నించిన కొన్ని ఘటనల కారణంగా, సంబంధిత దేశాల రాయబార కార్యాలయాల ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ క్షుణ్నంగా పరిశీలించిన మీదటనే శాశ్వత రిజిస్ట్రేషన్లు జారీ చేస్తోందని, ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.

ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన టిడిపి ఎమ్మెల్యే అదితి గజపతి రాజు కృషి ప్రశంసనీయం. మరోవైపు, ఇటీవల మెడికల్ కాలేజీ సీట్ల పేరుతో కోటీ ఇరవై లక్షలకు పైగా మోసం చేసినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరులపై కేసు నమోదైంది. వైద్య విద్యార్థుల ముసుగులో వచ్చిన వైకాపాకు చెందిన అరాచక శక్తులు వాహనాలను అడ్డుకోగా, పోలీసులు వారిని నిలువరించారు.

గత వైకాపా పాలనలో 144 సెక్షన్లు విధించి, పోలీసుల చేత అరెస్టులు చేయించి నిర్దాక్షిణ్యంగా అణచివేసిన దానికి భిన్నంగా, ప్రస్తుత ప్రభుత్వం శాంతియుత ధర్నాలకు అనుమతినిచ్చింది. అయినప్పటికీ, వైకాపా సోషల్ మీడియా, సాక్షి మీడియా మాత్రం శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని అనవసరంగా అతిగా స్పందిస్తూ రెచ్చగొడుతున్నాయి.

ఇలాంటి కీలక సమస్యలపై ప్రజల పక్షాన నిలబడి, వారి గోడును విని, అసెంబ్లీలో ప్రశ్నించిన దాఖలాలు జగన్‌కు లేవు. బెట్టింగ్, గంజాయి ముఠాలతో బలప్రదర్శనలు చేయడం, వాహనాలతో తొక్కించడం, లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోవడం వంటి అంశాలతోనే ఆయనకు తీరిక దొరకడం లేదు.
ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ పేరు పెట్టి, యూనివర్శిటీ నిధులను కూడా పక్కదారి పట్టించి, తన సామాజిక వర్గం వారినే కులపతులుగా నియమించి విద్యా సంస్థలను భ్రష్టు పట్టించిన వైకాపా, ఇప్పుడు వైద్య విద్యార్థులపై దాడులంటూ మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉంది. ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాక మరేమిటి?

LEAVE A RESPONSE